జగన్ ప్రభుత్వాన్ని కూల్చే వరకూ నిద్రపోనన్న జనసేనాని..!

వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చేవరకు జనసేన నిద్రపోదని జనసేనాని పవన్ కల్యాణ్ ప్రకటించారు. అసెంబ్లీ ముట్టడి సందర్భంగా.. పోలీసుల చేతిలో గురైన రైతులు.. పవన్ కల్యాణ్‌ను కలిశారు. ఈ సందర్భంగా పవన్ భావోద్వేగానికి గురయ్యారు. అమరావతిని శాశ్వత రాజధానిగా ఉంచుతామంటేనే బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని పవన్ కల్యాణ్ ప్రకటించారు. అమరావతికి ప్రధాని శంకుస్థాపన చేశారు కాబట్టి మేం గౌరవిస్తాం.. అమరావతిలోనే రాజధానిని ఉంచుతామని బీజేపీ నేతలు హామీ ఇచ్చారని పవన్ ప్రకటించా ఢిల్లీలో రాష్ట్ర పరిస్థితిని తెలియజేస్తా … వైసీపీ ప్రభుత్వం లేకుండా చేసేందుకు ఏం చేయాలో చేస్తానని ప్రకటించారు. ఇది మా రాజధాని అనిపించేలా జనసేన, బీజేపీ పనిచేస్తాయని.. 151 మంది ఎమ్మెల్యేలు ఎన్ని తిట్టినా భరిస్తానన్నారు. వైసీపీ నేతల నోటి నుంచి వచ్చిన ప్రతి మాటను కక్కేలా చేస్తానని హెచ్చరించారు.

రైతులు, మహిళలపై లాఠీఛార్జ్‌ కంటతడి పెట్టిస్తోందన్నారు. వైసీపీ ఆలోచనా విధానాన్నే పోలీసులు అవలంభిస్తున్నారని … ఆడపడుచులు రోడ్డుపైకి వచ్చి పోరాడుతుంటే పాశవికంగా దాడి చేశారని… ఆడపడుచులపై పోలీసుల దాడిని మర్చిపోనని శపథంచేశారు.దివ్యాంగులన్న కనికరం కూడా లేకుండా లాఠీచార్జ్‌ చేశారు ఒళ్లంతా మదమెక్కితేనే ఇలాంటి పనులు చేస్తారని మండిపడ్డారు. వైసీపీ వ్యక్తిత్వం రౌడీ సంస్కృతి, ఫ్యాక్షనిస్టు సంస్కృతి అని..వారు అధికారంలోకి వస్తే.. ప్రజలపై చూపుతారని మొదటి నుంచీ చెబుతున్నానన్నారు. రాజధానిపై సమష్టిగా నిర్ణయం తీసుకున్నప్పుడు.. తర్వాత ప్రభుత్వం పాటించి తీరాలన్నారు. ఒక సామాజికవర్గం అని, ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందన్న నెపంతో.. ఇన్ని కులాలను, ఇంత మందిని క్షోభపెట్టారని .. వైసీపీ వినాశనం మొదలైంది..భవిష్యత్‌లో వైసీపీ ఉండకూడదని శాపం పెట్టారు. 3పంటలు పండే పొలాలను రాజధాని కోసం త్యాగం చేశారని .. రాజధాని కదలదు..గుర్తుపెట్టుకోండి.. అని హామీ ఇచ్చారు.

వైసీపీ నేతల భూములు అమరావతిలో ఉండి ఉంటే.. రాజధానిని కదిలించే వాళ్లు కాదని… వాళ్ల భూములన్నీ విశాఖలోనే ఉన్నాయి..అందుకే ఉత్తరాంధ్ర మీద ప్రేమ చూపుతున్నారన్నారు. ఇవాళ అమరావతిని మోసం చేసిన వాళ్లు.. రేపు కడప, విశాఖ..అందర్నీ మోసం చేస్తారని .. మహిళలపై దాడులను సెక్రటేరియెట్‌ ఉద్యోగులు గమనించాలని పిలుపునిచ్చారు. ఉద్యోగులు.. రాజకీయ నాయకుల్ని నమ్మొద్దని సూచించారు. బుధవారం పవన్ కల్యామ్ ఢిల్లీకి వెళ్తున్నారు. బుధవారం సాయంత్రం బీజేపీ-జనసేన సమన్వయ కమిటీ సమావేశం జరగనుంది. అందులో..రాజధానిపై పోరాట కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఛోటా కె.నాయుడు Vs హ‌రీష్ శంక‌ర్‌… ఏం జ‌రిగింది?

'మ‌ళ్లీ నా జోలికొచ్చారో... చూసుకొందాం' అంటూ సినిమా ఫ‌క్కీలో కెమెరామెన్‌ ఛోటా కె.నాయుడుకు వార్నింగ్ ఇచ్చాడు హ‌రీష్ శంక‌ర్‌. వీరిద్ద‌రూ క‌లిసి 'రామ‌య్యా వ‌స్తావ‌య్యా' సినిమా చేశారు. అప్ప‌టి నుంచీ ఇద్ద‌రి మ‌ధ్యా...

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close