అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ .. జాలీ లైఫ్ గడిపారు. ఆయన రాసలీలల గురించి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. ఇప్పుడు వాటికి మరింత మసాలా జోడించే ఫోటోలు వీడియోలు వెలుగులోకి వస్తున్నాయి. ఆయన మీడియాను ఎలా టార్గెట్ చేయాలనుకుంటున్నారో మీడియా కూడా అలాగే ఆయనను టార్గెట్ చేస్తున్నారు. దాంతో ఆయన ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
జెఫ్రీ ఎస్స్టీన్ అనే పెద్ద మనిషి అమెరికాలో మైనర్లపై లైంగిక వేధింపులు, మానవ అక్రమ రవాణా వంటి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తితో చాలా కాలం ట్రంప్ స్నేహం చేశారు. కానీ ట్రంప్ దీన్ని అంగీకరించడంలేదు. కానీ 1990 నుంచి దాదాపు పది, పదిహేనేళ్ల పాటు ట్రంప్, ఎప్స్టీన్ కలిసి తిరిగారు. విమానాల్లో మైనర్లతో రాసలీలకు పాల్పడ్డారని ఆరోపణలువస్తున్నాయి. అనేక ఫోటోలు, వీడియోలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. 2002లో ట్రంప్ ఎప్స్టీన్ను గొప్ప వ్యక్తిగా పొగిడిన వీడియో కూడా వెలుగులోకి వచ్చింది.
అమెరికాలో ఇప్పుడు ఎప్స్టీన్ ఫైల్స్ కూడా వైరల్ గా మారుతున్నాయి. CNN , ది వాల్ స్ట్రీట్ జర్నల్ వంటి మీడియా సంస్థలు ఎప్ స్టీన్తో ట్రంప్ సంబంధాలను హైలెట్ చేస్తున్నాయి. ఇటీవల ట్రంప్ తో గొడవలు వచ్చాక.. ఎలన్ మస్క్ ఎప్స్టీన్ ఫైల్స్లో ట్రంప్ పేరు ఉందని ఆరోపించారు. అందుకే ఆ కేసు విచారణను ఆపేశారని కూడా అన్నారు. తర్వాత మస్క్ ఈ ట్వీట్ డిలీట్ చేశారు.
లోలిత ఎక్స్ ప్రెస్ పేరుతో ఓ విమానంలో అమ్మాయిల్ని తీసుకెళ్లి గాల్లోనే రాసలీలలు చేసేవారని .. కథలు కథలుగా ఇప్పుడు అమెరికా అంతా చెప్పుకుంటున్నారు. ఓ ఫ్యాషన్ షోలో మైనర్ బాలికలను జడ్జ్ చేస్తూ ట్రంప్ ఉన్న వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. వీటన్నింటిపై ట్రంప్ అసహనానికి గురవుతున్నారు. ఇదే కావాలన్నట్లుగా మీడియా ఆయనను ఓ ఆటాడుకుంటోంది.