‘జెర్సీ’ కోసం డ‌జ‌ను క్లైమాక్స్‌లు

తెలుగు ప్రేక్ష‌కుల‌కెప్పుడూ యాంటీ క్లైమాక్సులు పెద్ద‌గా న‌చ్చ‌వు. హీరోని చంపేయ‌డాన్ని అస్స‌లు ఇష్ట‌ప‌డ‌రు. అలాంటి ప్ర‌య‌త్నాలు, ప్రయోగాలూ చాలాసార్లు బెడ‌సికొట్టాయి. ‘జెర్సీ’ విష‌యంలో మాత్రం యాంటీ క్లైమాక్స్‌ని సుల‌భంగా క్ష‌మించేశారు ప్రేక్ష‌కులు. ఓ విధంగా ఈ క‌థ‌ని ఇలా ముగించ‌డ‌మే క‌రెక్ట్ కూడా. అయితే జెర్సీ క్లైమాక్స్ విష‌యంలో ద‌ర్శ‌కుడు చాలా త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డ్డాడు. అందుకోసం దాదాపు 12, 13 వెర్ష‌న్లు రెడీ చేసుకున్నాడు గౌత‌మ్ తిన్న‌నూరి.

“స్క్రిప్టు వెర్ష‌న్‌లో ఉన్న‌ప్పుడే.. కొన్ని కొన్ని మార్పులూ చేర్పులూ జ‌రుగుతుంటాయి. క్లైమాక్స్ విష‌యంలోనూ అంతే. ప‌న్నెండు, ప‌ద‌మూడు సార్లు డాఫ్ట్ రాసుకున్న త‌ర‌వాత‌.. ఇప్పుడున్న క్లైమాక్స్ ఫిక్స్ చేశాం. చాలా ర‌కాలుగా ఆలోచించినా స‌రే.. షూట్ చేసింది ఒక్క‌టే క్లైమాక్స్‌. సినిమాలో ఉన్న‌ది కూడా అదే..“ అని చెప్పుకొచ్చారు గౌత‌మ్‌. త‌న మూడో సినిమా గురించి ఇంకా ఏమీ ఆలోచించ‌లేద‌ని, కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుందామ‌నుకుంటున్నాన‌ని చెప్పారాయ‌న‌. ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌, వ‌ర‌ణ్ తేజ్‌… ఇలా గౌత‌మ్ త‌దుప‌రి సినిమాలో హీరో గురించి ర‌క‌ర‌కాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వీటిపై కూడా ఓ క్లారిటీ వ‌చ్చేసింది. త‌న హీరో ఎవ‌ర‌న్న‌ది ఇంకా నిర్ణ‌యించ‌లేద‌ని, ఎన్టీఆర్ త‌న సినిమా చూసి ట్వీట్ చేశారని, ఆయ‌న్ని క‌లుసుకోలేద‌ని, వ‌రుణ్‌తేజ్‌తో సినిమా చేస్తాన‌న్న వార్త కూడా పుకారే అని తేల్చేశారు.

గౌత‌మ్ తిన్న‌నూరితో తెలుగు 360 ప్ర‌త్యేకంగా చేసిన ఇంట‌ర్వ్యూ ఇది..

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రచారంలో పొలిటికల్ గ్లామర్ ఏదీ..?

ఎన్నికలు అనగానే ప్రధాన పార్టీలు సినీ తారల సేవలను ప్రచారంలో ఒకప్పుడు వాడుకునేవి. కానీ, రానురాను ఆ సంప్రదాయం తెరమరుగు అవుతోంది. తమ సేవలను వాడుకొని వదిలేస్తున్నారనే భావనతో ప్రచారాలకు దూరం పాటిస్తున్నారు....

ఎవరీ రామసహాయం రఘురామ్ రెడ్డి..?

ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా రామసహాయం రఘురాం రెడ్డిని హైకమాండ్ ప్రకటించింది.అనేకపేర్లు తెరమీదకు వచ్చినా అనూహ్యంగా అధిష్టానం రామసహాయం పేరును అభ్యర్థిగా ఖరారు చేయడంతో ఈయన ఎవరు అనే చర్చ జోరుగా జరుగుతోంది....

“సివిల్ సర్వీస్” ఇమేజ్ జగన్ పాలనలో డ్యామేజ్ !

సివిల్ సర్వీస్ అధికారి అంటే ఓ గౌరవం.. ఓ మర్యాద. కానీ ఏపీలో సివిల్ సర్వీస్ అధికారులు చేస్తున్న పనులు చూసి.. కోర్టులు కూడా అసలు మీకెవరు ఉద్యోగం ఇచ్చారయ్యా అని అసహనపడాల్సి...

తీన్మార్ మల్లన్న – ఈ సారి ఎమ్మెల్సీ పక్కా !

తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ ..తెలంగాణ రాజకీయల్లో పరిచయం లేని వ్యక్తి. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ కు సపోర్టుగా ఉన్నారు. ఆయన పేరును కరీంనగర్ లోక్ సభకు కూడా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close