సౌత్ వైపు… జాన్వి చూపు

శ్రీ‌దేవి వార‌సురాలు జాన్వి దృష్టి ప్ర‌స్తుతం తెలుగు, త‌మిళ సినిమాల‌పై ప‌డిందా? అవుననే అంటున్నాయి స‌న్నిహిత వ‌ర్గాలు. త‌న తొలి చిత్రం ‘ధడక్‌’.. బాలీవుడ్‌లో చక్కటి వసూళ్లు రాబ‌ట్టుకుంటోంది. జాన్వి న‌ట‌న‌కూ మంచి మార్కులే ప‌డ్డాయి. శ్రీ‌దేవి కుమార్తె అనే ట్యాగ్ లైన్ కూడా జాన్వికి బాగా క‌లిసొచ్చే అంశం. తెలుగులో శ్రీ‌దేవికి వీరాభిమానులున్నారు. టాలీవుడ్‌తో శ్రీ‌దేవి అనుబంధం ప్ర‌త్యేక‌మైన‌ది. నిజానికి జాన్వి ని తెలుగులోనే ప‌రిచయం చేస్తార‌నుకున్నారు. కానీ.. ఆ ఆఫ‌ర్ బాలీవుడ్‌కి వెళ్లింది. ఎలాగూ బాలీవుడ్‌లో తొలి అడుగు దిగ్విజ‌యంగా ప‌డింది కాబ‌ట్టి… ఇప్పుడు సౌత్‌లో స‌త్తా చాటాల‌ని భావిస్తోంది. శ్రీ‌దేవి కూతురుగా జాన్వికి తెలుగులో రెడ్ కార్పెట్ స్వాగ‌తం ద‌క్క‌డం ఖాయం. అయితే… మంచి బ్యాన‌ర్‌, స్టార్ ద‌ర్శ‌కుడు అనే లెక్క‌ల్లో ఉంది జాన్వి. ఆమెకు సంబంధించిన వ్య‌వ‌హారాల‌న్నీ బోనీ క‌పూర్ చూసుకుంటున్నారు. `థ‌డ‌క్‌` ట్రైల‌ర్ విడుద‌లైన‌ప్ప‌టి నుంచీ… బోనీక‌పూర్‌కి టాలీవుడ్ నుంచి సంప్ర‌దింపులు బాగా పెరిగాయ‌ట‌. అయితే `థ‌డ‌క్‌` విడుద‌లైనంత వ‌ర‌కూ మ‌రో సినిమా విష‌యం ఆలోచించ‌నని బోనీ తేల్చి చెప్పేశార‌ని, ఇప్పుడు ఎలాగూ రిల‌జ్ట్ వ‌చ్చేసింది కాబ‌ట్టి… తెలుగు, త‌మిళ చిత్రాల్లో జాన్విని దింప‌డం ఖాయ‌మ‌ని తెలుస్తోంది. మ‌రి ఆ ఛాన్స్ ఎవ‌రు ద‌క్కించుకుంటారో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంటలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీ బదిలీ !

ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాను ఈసీ బదిలీ చేసింది. వెంటనే వీరిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. వీరిద్దర్నీ ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో నియమించాలని స్పష్టం...

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close