స‌మంత జోక్యం మామూలుగా లేద‌ట‌

టాలీవుడ్‌లోని టాప్ హీరోయిన్ల‌లో సమంత పేరు కూడా ఉంటుంది. ఆమ‌ధ్య స‌మంత సినిమాల‌కు దూరం అవుతోంద‌న్న గాసిప్పులు వినిపించాయి. కానీ అలాంటిదేం లేద‌ని తేలిపోయింది. స‌మంత సినిమాలు మానేయ‌డం లేద‌ని చైతూ క్లారిటీగా చెప్ప‌డ‌మే కాదు, స‌మంత కూడా ఇప్పుడ‌ప్పుడే సినిమాల‌కు పుల్ స్టాప్ పెట్టేలా క‌నిపించ‌డం లేదు. స‌మంత వ్య‌వ‌హార శైలి చూస్తే… ఇంకొన్నాళ్లు స్ట్రాంగ్‌గా పాగా వేయాల‌ని భావిస్తున్న‌ట్టే అనిపిస్తోంది. ప్ర‌స్తుతం స‌మంత ‘యూ ట‌ర్న్‌’లో న‌టిస్తోంది. చైతూతో ఓ సినిమా చేస్తోంది. త‌న `యూ ట‌ర్న్‌` సినిమా విష‌యంలో స‌మంత చాలా కేర్ చూపిస్తోంద‌ని ఇన్ సైడ్ వ‌ర్గాల టాక్‌. సినిమా మేకింగ్‌, ప్ర‌మోష‌న్ వ్య‌వ‌హారాలు.. ఇవ‌న్నీ త‌న గ్రిప్‌లోనే ఉన్నాయ‌ట‌. ‘యూ ట‌ర్న్’ పేరుతో స‌మంత ఓ వాట్స‌ప్ గ్రూప్ క్రియేట్ చేసింద‌ని, త‌న టీమ్ లోని కీల‌క‌మైన వ్య‌క్తుల్ని అందులో స‌భ్యులుగా చేర్చుకుంద‌ని, ప్ర‌తీరోజూ… త‌న త‌ర‌పునుంచి కొన్ని స‌ల‌హాలూ సూచన‌లూ ఇస్తోంద‌ని, దాన్ని చిత్ర‌బృందం తుచ త‌ప్ప‌కుండా ఫాలో అయిపోతోంద‌ని టాక్‌. మ‌రోవైపు `చిల‌సౌ` ప్ర‌మోష‌న్ల పైనా దృష్టి పెట్టింద‌ట‌. సుశాంత్‌తో ఓ ప్ర‌మోష‌న్ వీడియో బ‌య‌ట‌కు రావ‌డానికి కార‌ణం కూడా స‌మంతే అని టాక్‌. ఇవ‌న్నీ చూస్తుంటే… త్వ‌ర‌లోనే చైతూ సినిమాల విష‌యంలోనూ స‌మంత జోక్యం త‌ప్ప‌ద‌నిపిస్తోంది. సినిమాల‌కు దూరం అవుతుంద‌నుకున్న స‌మంత‌.. ఇలా స‌డ‌న్‌గా `యూ ట‌ర్న్‌` తీసుకోవ‌డ‌మే కాకుండా…. మ‌రింత విజృంభించ‌డం ఆశ్చ‌ర్య‌మే మ‌రి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com