జగన్ నిస్సహాయతను ఎగతాళి చేసిన జేఎంఎం..!

అసలు సంబంధమే లేకపోయినా కల్పించుకుని తమ ముఖ్యమంత్రికి సుద్దులు చెప్పబోయిన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి జార్ఖండ్ ముక్తి మోర్చా…గట్టిగా రిప్లయ్ ఇచ్చింది. ” మీ నిస్సహాయత గురించి దేశం మొత్తం తెలుసు.. మేము కూడా నిన్ను అభిమానించి, గౌరవిస్తున్నామని, మీరు ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నామని..”.. త్రివిక్రమ్ డైలాగుల తరహాలో పంచులిచ్చి… వ్యంగ్యంగా ట్వీట్ చేసింది. ఇలా పంచ్‌లు పేల్చడమే కాదు.. జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై సీబీఐ కౌంటర్ వేయడానికి సమయం అడిగిన న్యూస్ క్లిప్‌ కూడా.. ఈ ట్వీట్‌కు జత చేసింది. జేఎంఎం ఇచ్చిన రివర్స్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ .. ఎస్టీ వర్గానికి చెందిన నేత. ఆయన తమ రాష్ట్రం కోసం.. ప్రజల కోసం ప్రధాన మంత్రిని ప్రశ్నిస్తే.. ఏ మాత్రం ప్రశ్నించలేని నిస్సహాయ స్థితిలో ఉన్న సీఎం జగన్.. ఆయనను తప్పు పడుతూ.. ట్వీట్ చేయడం.. దేశవ్యాప్తంగా విమర్శలకు తావిస్తోంది. తాను చేసిన ట్వీట్ రాంగ్ అని జగన్‌కు తెలిసిందేమో కానీ.. ఆ ట్వీట్ గురించి సొంత మీడియాలో కానీ.. వైసీపీ సోషల్ మీడియా టీం కానీ.. అసలు ప్రచారం చేయడం లేదు. అయితే.. జేఎంఎం మాత్రం… తమ సీఎంను ఒక్క మాట అంటే.. తాము వంద మాటలు అంటామని.. రివర్స్ కౌంటర్ ప్రారంభించింది.

జార్ఖండ్‌ ముక్తి మోర్చా నేత పోరాటాలు చేసి సీఎం పదవిలోకి వచ్చారు. జార్ఖండ్ ప్రజల అభిమానాన్ని ఆయన… ప్రత్యర్థులపై కులం .. మతం ముద్ర వేసి… తనపై అనుకూలంగా మార్చుకోలేదు. ప్రత్యర్థుల్ని హింసిస్తే.. తమ ప్రజలు తమకు ఓట్లేస్తారని అనుకోలేదు. పాలన చేపట్టిన దగ్గర్నుంచి ప్రజల హితం కోసమే పని చేస్తున్నారని.. ఆ ప్రజల కోసం… ప్రధాని తో సైతం కొట్లాడతారని.. జేఏఎం కార్యకర్తలు ట్వీట్లు పెడుతున్నారు. మొత్తానికి చేసిన ట్వీట్‌పై జగన్ తో పాటు.. ఆయన టీం మొత్తం సైలెంటయినా.. మాట పడిన జేఎంఎం మాత్రం సైలెంట్‌గా ఉండే పరిస్థితి కనిపించడం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

త‌మ‌న్ సంగీత సార‌థ్యంలో యూఎస్‌లో బిగ్గెస్ట్ మ్యూజిక‌ల్ షోను ఏర్పాటు చేసిన హంసిని ఎంట‌ర్‌టైన్‌మెంట్‌

త‌మ‌న్ సంగీత సార‌థ్యంలో యూఎస్‌లో  'అలా అమెరికాపురములో..` పేరుతో బిగ్గెస్ట్ మ్యూజిక‌ల్ షోను ఏర్పాటు చేసిన  హంసిని ఎంట‌ర్‌టైన్‌మెంట్‌. సెన్సేష‌న‌ల్ కాన్స‌ర్ట్స్ ఏర్పాటుచేయ‌డంలో అగ్రగామిగా ఉన్న హంసిని ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ ఈ సంవత్సరం టాలీవుడ్ మ్యూజిక్...

శ్రీ‌నువైట్ల మ‌ల్టీస్టార‌ర్… ‘డ‌బుల్స్‌’

వ‌రుస హిట్లు ఇచ్చిన శ్రీ‌నువైట్ల‌.. ఇప్పుడు వ‌రుస ఫ్లాపుల‌ను మోస్తున్నాడు. అయినా స‌రే, మళ్లీ త‌న‌దైన ముద్ర వేయ‌డానికి త‌ప‌న ప‌డుతున్నాడు. అందులో భాగంగా `ఢీ అండ్ ఢీ` తీస్తున్నాడు. `డ‌బుల్ డోస్‌`...

జనసేనను మరోసారి కించ పర్చిన ఏపీ బీజేపీ..!

పవన్ కల్యాణ్‌కు కేంద్రంలో మంత్రి పదవి అని ఢిల్లీ నుంచి బీజేపీ లీకులు ఇస్తూ గిలిగింతలు పెడుతోంది కానీ.. అసలు విషయం మాత్రం అసలు జనసేనను లెక్కలోకి తీసుకోవడం లేదు. ముఖ్యంగా ఏపీ...

ఏపీ సర్కార్‌ను అప్పులు చేయనివ్వొద్దని మోడీకి రఘురామ లేఖ..!

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి అప్పుల మీద నడుస్తోంది. నెలకు రూ. ఆరేడు వేల కోట్లు అప్పులు ఎలాగోలా తెచ్చుకోకపోతే.. ఆ నెల దివాలా ప్రకటించాల్సిన పరిస్థితి. ఆ అప్పులు కూడా రాకుండా చేయాలని...

HOT NEWS

[X] Close
[X] Close