మీడియా మైండ్‌సెట్‌తో వైసీపీ మైండ్ గేమ్..!

కరోనా కారణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొంటోంది. ఓ వైపు కేంద్రం… ఆక్సిజన్, వ్యాక్సిన్లు, రెమిడిసివర్ ఇంజక్షన్లు అన్నింటినీ అధీనంలోకి తీసుకుని అరకొరగా పంపుతోంది. దీంత ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వానికి ఉన్న ఆర్థిక పరిమితులతో సెకండ్ వేవ్ ఎదుర్కోవడానికి కష్టపడాల్సి వస్తోంది. ప్రజల కష్టాల్లో ఉంటే వారిని రెచ్చగొట్టాడనికి టీడీపీ నేతలు మరింతగా ప్రయత్నిస్తున్నారని అనుమానిస్తున్న వైసీపీ నేతలు.. టీడీపీ నేతల్ని కట్టడి చేయడానికి భిన్నమైన వ్యూహం ఎంచుకున్నారు. అదే చంద్రబాబు, లోకేష్‌పై కేసులు పెట్టటం. రెండు రోజులుగా… వైరస్ వ్యవహారాలపై మాట్లాడితే.. కఠినంగా వ్యవహరిస్తామని అణిచి వేస్తామని మంత్రులు చెబుతున్నారు. దానికి తగ్గట్లుగా కేసులు ప్రారంభించారు.

మీడియాలో.. సోషల్ మీడియాలో ప్రభుత్వంపై వ్యతిరేక ప్రచారం జోరుగా సాగుతోందని భావిస్తున్న ఏపీ సర్కార్… ఇప్పుడు కట్టడి చేయాలంటే.. ఆ మీడయాకు అంతకు మించిన వార్తలు కావాలని డిసైడ్ అయ్యారు. చంద్రబాబు, లోకష్‌లకు నోటీసులు ఇవ్వడం.. అరెస్ట్ చేస్తామన్నంత హడావుడి చేయడం… ఆ మీడియాకు ఎక్కడ లేని వార్త అవుతుందని.. ఆ దిశగా ముందుకు వెళ్తే… అనుకున్న పని అనుకున్నట్లుగా అయిపోతుందని అంచనాకు వచ్చారు. ఆ ప్రకారమే… చంద్రబాబుపై కేసు పెట్టారని చెబుతున్నారు. ఇప్పుడు నోటీసుల పేరుతో హడావుడి చేస్తారు. తర్వాత అరెస్ట్ పేరుతో మరికొంత హడావుడి చేస్తారు. ఇలా చేయడం వల్ల కరోనా సమస్యల నుంచి మీడియా అటెన్షన్ పోతుందని కొంత మంది విశ్లేషిస్తున్నారు.

జార్ఖండ్ సీఎంను విమర్శిస్తూ ఏపీ సీఎం జగన్ ట్వీట్ చేసిన కాసేపటికే.. చంద్రబాబుపై కేసు పెట్టిన వార్త వెలుగులోకి వచ్చింది. కడపలో పేలుళ్లు జరిగిన కాసేపటికే.. లోకేష్‌పై కేసు పెట్టారంటూ మీడియాకుసమాచారం ఇచ్చారు. ఇక వారికి నోటీసులు ఇతర వ్యవహారాలతో కాస్త హంగామా చేస్తారు. దీని వల్ల మీడియాలో జరుగుతున్న నెగెటివ్ ప్రచారం… రాజకీయం వైపు వెళ్తుందని వైసీపీ పెద్దలు ఓ పక్కా ప్రణాలిక ప్రకారం ఉన్నారని అంటున్నారు. రాజకీయ కక్షలు సాధిస్తున్నారని.. అదంతా రాజకీయం అని ప్రజలుఅనుకుంటారని.. తమకు వ్యతిరేకత ఏమీ ఉండదనే అంచనాకు వస్తున్నారు. అదే సమయంలో… కరోనా కష్టాలకు ప్రభుత్వం కారణం అన్న వాదనను.. ప్రజల్లోకి తీసుకెళ్లకుండా..ప్రతి పక్షాలకు అడ్డు పడినట్లు అవుతుందని అంచనా వేస్తున్నారు. మొత్తానికి వైసీపీ నేతల వ్యూహంలో మీడియా పడుతుందా లేదా.. ముందు ముందు జరిగే పరిణామాలను బట్టి డిక్లేర్ చేసుకోవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

రేవంత్ రెడ్డి యార్క‌ర్… ప్ర‌తిప‌క్షాలు క్లీన్ బౌల్డ్ అయిన‌ట్లేనా?

గ‌త కొంత‌కాలంగా బీఆర్ఎస్ రైతుల చుట్టూ రాజకీయం మొద‌లుపెట్టింది. పంట ఎండిపోతుంద‌ని, సాగుకు విద్యుత్ అంద‌టం లేద‌ని, ధాన్యం కొనుగోలు ఏమైంద‌ని, రుణమాఫీపై మౌనం ఎందుకు అంటూ నేత‌లంతా మూకుమ్మ‌డిగా రేవంత్ స‌ర్కారుపై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close