కేంద్రానికి ‘జిశాట్ 6’ హితవు!

భారత అంతరిక్షపరిశోధనా సంస్ధ (ఇస్రో) ని విభాగాలవారీగా, సర్వసుల వారీగా ప్రయివేటీకరించే ఆలోచనను మానుకోవాలని కూడా నాలుగు రోజులనాటి జిశాట్ 6 లేదా జియోసింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (జిఎస్ఎల్ వి) డి6 విజయం కేంద్రప్రభుత్వానికి హితవు చెబుతోంది.

అంతరిక్షంలోకి సాంకేతిక ఉపగ్రహాలను పంపే మార్కెట్ లో భారతదేశం అమెరికాను అధిగమించి దూసుకుపోతోంది. ద్రవరూప, ఘనరూప ఇంధనాలతో రాకెట్లను అంతరిక్షంలోకి పంపే పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పిఎస్ఎల్ వి) పంపడంలో ఇస్రో విజయవంతమౌతున్న స్ధితీ, భారత్ లో సొంత అణుపరీక్షలూ అమెరికా, యూరప్ లకు కన్నెర్రఅయ్యాయి. ఫలితంగా హెచ్చుబరువుని స్ధిరంగా తీసుకుపోగల ఇంధన సంబంధిత క్రయోజనిక్ పరిజ్ఞానాన్ని తెచ్చుకోవడంలో భారతదేశం మీద అంక్షలు వచ్చిపడ్డాయి. స్వంత క్రయోజనిక్‌ పరిజ్ఞానంతో రాకెట్‌ తయారీకి ఉపక్రమించిన భారత అంతరిక్ష శాస్త్రవేత్తలు ఈ కృషిలో అనేక సమస్యలను ఎదుర్కొన్నారు. పశ్చిమ దేశాలు మన దేశానికి ఆధునిక అంతరిక్ష పరిజ్ఞానం రాకుండా అడ్డుకున్నాయి. రష్యానుండి క్రయోజనిక్‌ రాకెట్ల దిగుమతి ఒప్పందం చేసుకుంటే 1991లో దానిపై ఒత్తిడి తెచ్చి ఒప్పందం నుండి వెనక్కు మళ్లేట్లు చేశారు. ఇస్రో శాస్త్రవేత్తలు సొంత క్రయోజనిక్ టెక్నాలజీని అభివృద్ధి చేయడానికి ఈ ఆంక్షలే దారి చూపించాయి. పిఎస్ ఎల్ వి రాకెట్లు టన్ను నుంచి టన్నున్నర బరువుగల ఉపగ్రహాలను మోసుకుపోయేవి. తాజాగా విజయవంతమైన సొంత క్రయోజనిక్ టెక్నాలజీ వల్ల జిశాట్ 6 – రెండు టన్నుల శాటిలైట్ ని అంతరిక్షంలో విడిచిపెట్టింది. ఈ ఉపగ్రహం ప్రధానంగా మన దేశ సైనికావసరాల కోసమే అయినా కూడా, ట్రాన్స్ మిషన్ పరంగా ఎస్ బేండ్ కి కూడా ఉపయోగపడుతుందని చెబుతున్నారు.

ఇస్రో శాస్త్రవేత్తల పరిశోధనలు తక్కువ ఖర్చతోనే ఉపగ్రహాలను పంపే విధానాలను ఖరారు చేశాయి. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్ధ నాసా, మన ఇస్రో దాదాపు ఒకే సమయంలో అంగారక గ్రహానికి శాటిలైట్లను పంపాయి. ఇందులో నాసా ‘మావెన్‌ ఆర్బిటర్‌’ కు ఖర్చు 67 కోట్ల డాలర్లయితే, ఇస్రో ‘మంగళయాన్ ‘ ఖర్చు కేవలం 7 కోట్ల డాలర్లే! మొదటినుంచీ కూడా ఇస్రో ఖర్చు తక్కువగా వుండటం వల్లే అనేక విదేశాలు ఇస్రోనుంచే శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపుతున్నాయి.

‘నాసా’ లో ప్రతీ పనీ, ప్రతీ సర్వీసూ, ప్రతీ సపోర్టింగ్ సర్వీసూ ప్రయివేటురంగమే చేస్తుంది. ఇందువల్లే వారి ఖర్చ తడిసిమోపెడు అవుతుంది. సర్వాస్వాన్నీ ప్రయివేటురంగానికే ఇచ్చేయాలన్న లిబరలైజ్డ్ విధానాన్ని శరవేగంతో అమలు చేస్తున్న కేంద్రప్రభుత్వం ఇస్రో ను కూడా నాసా మాదిరిగానే విభాగాలుగా విడిభాగాలుగా ప్రయివేటీకరించే ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది.

జిశాట్ 6 విజయమైనా కేంద్రం ఆలోచనల్ని మారుస్తుందని ఆశిద్దాం!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తేజూ సిక్స్ ప్యాక్‌

సాయిధ‌ర‌మ్ తేజ్ ఈమ‌ధ్య బాగా బొద్దు చేశాడు. రోడ్డు ప్ర‌మాదం త‌ర‌వాత ఫిజిక్‌ని పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. దాంతో స‌హజంగానే లావ‌య్యాడు. `బ్రో` సినిమాకి ముందు కాస్త త‌గ్గాడు. అయితే ఆ త‌ర‌వాతి సినిమాకి...

గన్నవరం ఎయిర్‌పోర్టుకు ఎన్టీఆర్ పేరు ?

ఆంధ్రప్రదేశ్‌లో మూడు ఎయిర్ పోర్టుల పేరు మార్పు ప్రతిపాదనలను కేంద్రానికి ఏపీ ప్రభుత్వం పంపింది. విజయవాడ, తిరుపతి, కర్నూలు ఎయిర్ పోర్టుల పేర్లను మార్చాలని సిఫారసు చేశారు. ఈ విషయాన్ని కేంద్ర విమానయాన...

లిక్కర్ వాసుదెవరెడ్డిని దేశం దాటించేశారా ?

ఏపీ లిక్కర్ స్కాంలో అత్యంత కీలకమైన వ్యక్తి వాసుదేవరెడ్డి. ఆయన ఇప్పుడు ఆచూకీ లేరు. ఆయన కోసం ఏపీ ప్రభుత్వం లుకౌట్ నోటీసులు జారీ చేసింది. ఇప్పటి వరకూ ఆయనపై రెండు...

బ్యాక్ టు బెంగళూరు

వైఎస్ జగన్ మళ్లీ సతీసమేతంగా బెంగళూరు వెళ్లిపోయారు. మళ్లీ ఏదైనా హత్య లేదా మృతదేహం రాజకీయం చేయడానికి ఉపయోగపడుతుందనుకుంటే వస్తారేమో కానీ.. ఎప్పుడొస్తారో తెలియదని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. వినుకొండలో రషీద్ అనే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close