ఇసుక, లిక్కర్ సహా అన్ని ప్రధానమైన ఆదాయ వనరులను జగన్ రెడ్డి ఒక్కడే దోచుకుంటూంటే.. మాకేంటి అనుకున్న జోగి రమేష్ లాంటి లీడర్లు చేసిన చిల్లర పనులతో ఇప్పుడు అడ్డంగా దొరికిపోతున్నారు. అగ్రిగోల్డ్ భూముల్ని అమ్మేసుకున్న జోగి రమేష్ వ్యవహారం బట్టబయలు అయింది. రికార్డులు, ఆధారాలతో అన్నీ ఆయన చేసిన నిర్వాకాన్ని తేల్చి చెబుతున్నాయి.
అగ్రిగోల్డ్ ఆస్తుల్ని సొంతంగా మార్చుకుని అమ్మేసుకున్నాడు జోగి రిమేష్. అగ్రిగోల్డ్ సంస్థకు చెందిన వారు తమ స్థలాలను జోగి రమేష్ కుట్రపూరితంగా అమ్మేశారని.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆరా తీస్తే విజయవాడలోని ఓ స్థలాన్ని సర్వే నెంబర్ మార్చి అగ్రిగోల్డ్ స్థలాన్ని జోగిరమేష్ అమ్మేసుకున్నారు. ఈ విషయంలో జోగి రమేష్ సమర్థించుకోవడానికి కూడా ఏమీ లేకుండా పోయింది. ఆయన కుమారుడి పేరుతో కథ నడపడంతో ఇప్పటికే కుమారుడు జైలుకెళ్లి బెయిల్ పై వచ్చాడు.
సర్వే నెంబర్ ను మార్చి.. అగ్రిగోల్డ్ స్థలాల్ని కొట్టేయవచ్చని ఆలోచన జోగికి వచ్చింది. ప్రభుత్వం మారితే అడ్డంగా దొరికిపోతామని ఆయన అనుకుని ఉండరు. జగన్ రెడ్డిలా ముఫ్పై ఏళ్లు అధికారంలో ఉంటామని అనుకున్నారు. ఇప్పుడు తనతో పాటు తన కుమారుడ్ని కూడా జైలుకు తీసుకెళ్తున్నారు. రాజకీయ జీవితం ఇవ్వకుండానే క్లోజ్ చేస్తున్నారు.