మాస్ హీరో టు క్లాస్ టీచర్…ఎన్టీఆర్ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్యూ

21 ఏళ్ళకే తెలుగు సినిమా ఇండస్ట్రీలో నంబర్ ఒన్‌గా ఉన్న హీరోతో పోటీ పడ్డాడు. తన సినిమా కలెక్షన్స్‌తో బాక్స్ ఆఫీస్‌ని హడలగొట్టాడు. లెక్కలేనంత మంది అభిమానులు, అన్ని లెక్కలూ వేసుకుని ఎన్టీఆర్‌తో సినిమా చేస్తే అన్నీ లాభాలే అని అర్థం చేసుకున్న ప్రొడ్యూసర్స్, ఓ స్టార్ హీరోతో నటనకు స్కోప్ ఉన్న కథలను తెరకెక్కించాలనుకున్న పెద్ద పెద్ద డైరెక్టర్స్….అందరూ కూడా ఎన్టీఆర్‌ని ఆరాధించడం మొదలెట్టారు. మరోవైపు రాజకీయ నాయకులు కూడా ఎన్టీఆర్ చుట్టూ తిరిగారు. ఎప్పుడూ పట్టించుకోని వాళ్ళు కూడా ఎన్టీఆర్ ప్రాపకం కోసం పాకులాడారు. 21ఏళ్ళ వయసులో ఆ రేంజ్ పొజిషన్‌లో ఉన్న మాస్ హీరో ఎన్టీఆర్ ఇప్పుడు పూర్తిగా క్లాస్ టీచర్ అవతారమెత్తాడు. బోలెడంత ఫిలాసఫీ చెప్పేస్తున్నాడు. ఎన్టీఆర్‌లో వచ్చిన మార్పుకు ఓ మంచి ఉదాహరణ ఏంటంటే….ఈ ఇంటర్యూ చేస్తూ ఉన్నప్పుడు ఫ్యాన్ సౌండ్‌తో కొంచెం ఇబ్బంది కలిగింది. ఆ విషయం గురించి చెప్పకముందే…తనే అర్థం చేసుకున్న ఎన్టీఆర్…తను కూర్చున్న కుర్చీలో నుంచి లేచి ఫ్యాన్ ఆపడానికి ట్రై చేశాడు. ఆ స్విచ్ ఏదో కూడా వెంటనే తెలియలేదు. బట్ స్టిల్ ఎలాంటి ఫీలింగ్స్ లేకుండా పెదాలపై చిరునవ్వును అలాగే ఉంచుకుని ఓ నాలుగైదు స్విచ్‌లు ఆఫ్ చేశాడు. మళ్ళీ మామూలుగా వచ్చి తన కుర్చీలో కూర్చున్నాడు. 33 ఏళ్ళ సాధారణ కుర్రాడు ఎలా రియాక్టవుతాడో అలాగే రియాక్టయ్యాడు. నాన్నకు ప్రేమతో సినిమాలో ఎన్టీఆర్ క్లాస్ అప్పియరెన్స్ చాలా మందిని షాక్‌కు గురి చేసింది. నమ్మశక్యం కానంత మార్పు చూపించాడు ఎన్టీఆర్. ఎన్టీఆర్‌లో వచ్చిన ఈ మార్పుకు కారణమేంటి? అసలు ఇప్పుడు ఎన్టీఆర్ ఆలోచనలు ఏంటి? పొలిటికల్ థాట్స్ ఏంటి? నటుడిగా ఏంటి? వ్యక్తిగా ఏంటి?

ప్రః నాన్నకు ప్రేమతో సినిమా టైంలోనే మీలో చాలా ఛేంజ్ కనిపించింది. జనతా గ్యారేజ్ ప్రమోషన్స్ కోసం మీడియాతో మాట్లాడుతూ ఉంటే ఓ క్లాస్ టీచర్ కనిపిస్తున్నాడు. ఓ యోగి కూడా. సింహాద్రి రేంజ్ మాస్ హీరో నుంచి క్లాస్ టీచర్ స్థాయికి…..ఎలా? మీకు ఎవరో గురువు ఉన్నారని బయట టాక్ ఉంది.

ఎన్టీఆర్ః (నవ్వుతూ) అలాంటిదేం లేదండి. నిజానికి కొన్ని విషయాలు నేర్చుకోవడానికి గురువు అవసరం లేదు. పరిస్థితులే నేర్పిస్తాయి. 21 ఏళ్ళ వయసులో స్టార్ ఢం వచ్చింది. ఆ తర్వాత కొన్ని మిస్టేక్స్ జరిగాయి. జీవితం తెలిసొచ్చింది. అద్దం ముందు నిలబడి నిజాయితీగా మనల్ని మనం చూసుకుంటే చాలు అన్నీ అర్థమైపోతాయి. మనలోకి మనం చూసుకుంటే బోలెడన్ని పాఠాలు తెలిసిపోతాయి. నాకు తగలిన దెబ్బలు కూడా మార్పుకు కారణమయ్యాయి. మా అమ్మ, వైఫ్, కొడుకు, అభిమానులు, సినిమాలు, నేను ఎదుర్కున్న పరిస్థితులు……అన్నీ నాకు చాలా నేర్పించాయి. నాలో వచ్చిన మార్పు నాకు చాలా సంతోషం కలిగించింది. ఇప్పుడు నాది ది బెస్ట్ లైఫ్. నా రిలేషన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. కెరీర్ కూడా బాగుంది.

ప్రః ప్రేక్షకులు జనతా గ్యారేజ్ సినిమా ఎందుకు చూడాలి?

ఎన్టీఆర్ః గొప్ప కథ అండి. ఈ సినిమా రిలీజ్ అయ్యాక తెలుగు సినిమా ఇండస్ట్రీకి చాలా చాలా కొత్త కథలు వచ్చే పరిస్థితి ఉంటుంది. రెండేళ్ళుగా నన్ను హాంట్ చేసిన కథ. అలాగే అద్భుతమైన డైలాగ్స్. మోహన్‌లాల్, నిత్యామీనన్, సమంతా లాంటి అద్భుతమైన నటుల నటన, ది బెస్ట్ టెక్నికల్ వర్క్. అన్ని వర్గాల ప్రేక్షకులకూ నచ్చే సినిమా. తెలుగు సినిమా భాషలో చెప్పాలంటే ‘కుటుంబ కథా చిత్రం’. అలాంటి కథలో లవ్ స్టోరీ, యాక్షన్ ఎపిసోడ్స్‌ అద్భుతంగా కలిసిపోయాయి. ఫైనల్‌గా ‘జనతా గ్యారేజ్’ కథ కోసమే ఈ సినిమా చూడాలి.

ప్రః దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ చాలా బాగుంది. టెక్నికల్ విషయాల్లో మీ ఇన్వోల్వ్‌మెంట్ ఎంత వరకూ ఉంటుంది?

ఎన్టీఆర్ః తెలుగులో ఓ సామెత ఉంటుందండి. గుర్రం పని గుర్రం చేయాలి. గాడిద పని గాడిద చేయాలి అని. నేను అందులో ఉన్న నీతిని బలంగా నమ్ముతాను. ప్రతి విషయంలోనూ నేనే ఇన్వోల్వ్ అయితే నా అన్ని సినిమాలూ ఒకేలా ఉంటాయండి. అది నాకు ఇష్టం ఉండదు. ఏ క్యారెక్టర్ చేసినా ఎన్టీఆర్ బాగా యాక్ట్ చేశాడు. క్యారెక్టర్‌ని చెడగొట్టలేదు అని పేరు తెచ్చుకోవడానికి మేక్సిమం ట్రై చే్స్తాను. నా కాన్సన్‌ట్రేషన్ మొత్తం నటనపైనే ఉంటుంది.

ప్రః దేవిశ్రీ మ్యూజిక్ గురించి……

ఎన్టీఆర్ః కథను, క్యారెక్టర్స్‌ని అర్థం చేసుకుని మ్యూజిక్ కంపోజ్ చేస్తాడండి. ప్రతి సాంగ్ కూడా ఎంతో కొంత కథను చెప్తుంది. ఆఖరికి పక్కా లోకల్ సాంగ్‌కి కూడా కథతో సంబంధం ఉంటుంది. ఒన్ ఆఫ్ ద బెస్ట్ ఆల్బమ్స్ ఇన్ మై కెరీర్. నాకు పర్సనల్‌గా కూడా జనతా గ్యారేజ్ సాంగ్స్ మళ్ళీ మళ్ళీ వినాలనిపించేంత బాగా నచ్చాయి.

ప్రః రాక్ స్టార్ మ్యూజిక్‌కి మీ డ్యాన్సులు అదిరిపోయే రేంజ్‌లో ఉంటాయని మీ అభిమానులు చాలా చాలా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు.

ఎన్టీఆర్ః (స్మైల్) ఇంతకుముందు నేనూ చేశానండి. మెలికలు తిరిగిపోయాను. కానీ ఇఫ్పుడు ప్రేక్షకులు చాలా మారారు. పాటను బట్టి డ్యాన్స్ మూమెంట్స్ ఉండాలండి. ఓ క్లాసిక్ మెలోడీ సాంగ్‌కి ‘నాచోరే…నాచోరే..’ పాటలో వేసిన లాంటి స్టెప్స్ వేయలేము కదా. పాటకు తగ్గట్టుగా డ్యాన్స్ ఉంటుంది.

ప్రః చాలా కాలం తర్వాత యాక్షన్ ఎపిసోడ్స్ డోస్ ఎక్కువుండే సినిమా చేస్తున్నారు. రిస్సీ ఫైట్స్ ఏమైనా చేశారా?

ఎన్టీఆర్ః అలాంటివి ఎప్పుడో ఆపేశానండి. నేనే కాదు ఎవరూ చేయడం లేదు. ఇప్పుడు హీరోలందరం కూడా జాగ్రత్తగానే ఉంటున్నాం. రిస్క్‌లు ఏమీ చేయడం లేదు. బోన్స్ విరిగినా ఫర్లేదు..మళ్ళీ అతుక్కుంటాయి అన్న నమ్మకమున్నప్పుడు…ఆ వయసులో రిస్క్ చేశానండి. కానీ ఇప్పుడు అలాంటివేమీ లేవు.

ప్రః జనతా గ్యారేజ్‌లో మంచి మెస్సేజ్ కూడా ఇవ్వాలని ప్రయత్నించినట్టున్నారు.

ఎన్టీఆర్ః మెస్సేజ్‌లు ఇవ్వడంపైన నాకు నమ్మకం లేదండి. కథలో భాగంగా విషయం చెప్పాలి. దాన్ని అర్థం చేసుకున్నవాళ్ళు ఫాలో అవుతారు. నా కొడుక్కి కూడా నేను విషయం గురించి చెప్తాను. ఫాలో అవ్వాలా? వద్దా? అనేది వాడిష్టం. బయటి ప్రపంచానికి మెస్సేజ్‌లు ఇచ్చే ముందు మన ఇంటిని మనం శుభ్రం చేసుకోవాలండి. ఆ విషయంలో సక్సెస్ అయితే సమాజంలో గొప్ప మార్పు అదే వస్తుంది.

ప్రః రజనీకాంత్ కబాలి సినిమా కంటే కూడా జనతా గ్యారేజ్ ఎక్కువ స్థాయిలో రిలీజ్ అవుతోంది.

ఎన్టీఆర్ః అనుకోవడానికి కూడా ఓ అర్హత ఉండాలండి. రజినీకాంత్‌గారు ఓ వెయ్యి మెట్లు ఎక్కితే నేను ఒకటి…రెండు మెట్ల దగ్గర ఉన్నాను. ఆయనతో పోల్చుకోవడం అస్సలు కరెక్ట్ కాదు. నా సినిమా ఎక్కువ భాషల్లో, ఎక్కువ థియేటర్స్‌లో రిలీజ్ అవుతుందంటే ఐ యామ్ సో హ్యాపీ. సినిమాను ఎక్కువ మంది ప్రేక్షకుల దగ్గరకు తీసుకెళ్ళే ప్రయత్నం అందరూ చేయాలండి.

ప్రః జనతా తర్వాత ఎలాంటి కథ చేయబోతున్నారు?

ఎన్టీఆర్ః అలా ఒక స్టోరీ అంటూ ఏమీ అనుకోనండి. అలాంటి ఐడియాలు ఉంటే నేనే కథ రాసేసుకుంటానుగా. తన దగ్గరకు వచ్చిన కథల్లో నాకు బాగా నచ్చిన కథను సెలక్ట్ చేసుకుంటాను. అంతకంటే ముందు కొంత కాలం రెస్ట్ తీసుకోవాలని అనుకుంటున్నాను.

ప్రః రీసెంట్‌గా జరిగిన ఓ దుర్ఘటన గురించి…..

ఎన్టీఆర్ః నేనూ బాధపడ్డానండి. చాలా బాధగా అనిపించింది. అలాంటి పనులు నా అభిమానులు చేయరనే అనుకుంటున్నా. అలా చేసేవాళ్ళను మాత్రం నా అభిమానులని ఎప్పుడూ చెప్పుకోను. కానీ పూర్తి వివరాలు తెలియకుండా మాట్లాడకూడదు. జీవితంలో మితిమీరినది ఏదైనా ప్రమాదరకరమేనండి. ఏదైనా మితంగానే ఉండాలి. అభిమానుల ప్రేమాభిమానాలు నాకు చాలా ఆనందాన్నిస్తాయి. శక్తికి మించి కష్టపడాలన్న ప్రోత్సాహాన్ని ఇస్తాయి. ఎలాంటి సంబంధం లేనివారు, మన నుంచి ఏమీ ఆశించకుండా అంతటి ప్రేమానుబంధాలు చూపించడమంటే చాలా గొప్ప విషయమండి. కానీ మన అభిమానం ఎప్పుడూ ఎవ్వరినీ కూడా బాధపెట్టే స్థాయిలో ఉండకూడదు.

ప్రః రాజకీయ జీవితం గురించి ఊహాగానాలు వినిపిస్తున్నాయి

ఎన్టీఆర్ః ప్రస్తుతం నటుడిగా నన్ను నేను ప్రూవ్ చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నాను. ఇంకా గొప్ప గొప్ప కథల్లో నేను భాగమవ్వాలి. మంచి మంచి క్యారెక్టర్స్ చేయాలి. నాకు గతంలో బ్రతకడం ఇష్టం ఉండదు. భవిష్యత్ గురించి ఆలోచిస్తూ బ్రతికేయడం కూడా ఇష్టముండదు. వర్తమానంలో బ్రతకడం ఇష్టం.

ప్రః జనతా గ్యారేజ్ టైటిల్ దగ్గర నుంచి క్యాప్షన్, టీజర్, సాంగ్స్, ట్రైలర్, లీక్డ్ వీడియోస్‌తో సహా ఇఫ్పటి వరకూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన అవుట్ పుట్ మొత్తం కూడా వాళ్ళకు నచ్చింది. ఫైనల్ రిజల్ట్ కూడా వాళ్ళకు నచ్చుతుందనుకుంటున్నారా? రీసెంట్‌గా మీరు సినిమా చూశారట కదా. నచ్చిందా? మీ సన్నిహితుల అభిప్రాయమేంటి?

ఎన్టీఆర్ః టీజర్, ట్రైలర్, సాంగ్స్ అన్నీ కూడా ప్రేక్షకులకు నచ్చినందుకు ఐ యామ్ సో హ్యాపీ అండి. జనతా గ్యారేజ్ సినిమా చూశాను. నాకు చాలా బాగా నచ్చింది. చాలా బాగుందనిపించింది. నా సన్నిహితులు కూడా బాగుందని చెప్పారు. కానీ ప్రేక్షకుల అభిప్రాయమే ఫైనల్. అయినా సినిమా రిజల్ట్ కంటే కూడా ఆ సినిమా కెోసం వర్క్ చేస్తూ ఉన్న ప్రాసెస్ మనకు నచ్చాలి. వర్క్‌ని ఇష్టపడి చేయాలనిపించాలి. అలా ఇష్టపడి పనిచేస్తే రిజల్ట్ కూడా బాగానే ఉంటుంది. నేను ఆ వర్క్ ప్రాెసెస్‌ని ఇష్టపడతాను.

సినిమా రిలీజ్ అయ్యాక మళ్ళీ మనం మరోసారి కలుద్దాం. ఇంకా డీటెయిల్డ్‌గా మాట్లాడుకుందాం. నేను కూడా అభిమానులతో షేర్ చేసుకోవాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. అందుకే వాళ్ళను కూడా ఓ సారి కలిసే ప్రయత్నంలో ఉన్నాను.

ఆల్ ది బెస్ట్ సార్……….

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close