బుచ్చికి ఎన్టీఆర్ స‌ల‌హా!

ఉప్పెన‌తో తొలి ప్ర‌య‌త్నంలోనే సూప‌ర్ హిట్టు కొట్టాడు ఎన్టీఆర్ శిష్యుడు బుచ్చిబాబు. తొలి సినిమానే హిట్ట‌యితే ఆటోమెటిగ్గా… పెద్ద హీరోల దృష్టి ఆ ద‌ర్శ‌కుడిపై ప‌డుతుంది. బుచ్చి కూడా అలానే.. అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించాడు. ఎన్టీఆర్‌తో చ‌నువు, స్నేహం ఉంది కాబ‌ట్టి.. త‌న‌ని క‌ల‌వ‌డం, క‌థ చెప్ప‌డం జ‌రిగిపోయాయి. ఎన్టీఆర్ తో బుచ్చి ఓ స్పోర్ట్స్ డ్రామాని తెర‌కెక్కించ‌బోతున్నాడ‌ని వార్త‌లొచ్చాయి. దానికి ‘పెద్ది’ అనే టైటిల్ నీ అనుకున్నారు. అయితే.. ఎన్టీఆర్ వ‌రుస ప్రాజెక్టుల వ‌ల్ల‌… బుచ్చిబాబు సినిమా ఆల‌స్య‌మ‌వుతూ వ‌స్తోంది. అయితే.. ఈసినిమా పూర్తిగా ప‌క్క‌కు పోలేదు. కాస్త టైమ్ ప‌డుతుందంతే.

ఈమ‌ధ్య‌.. బుచ్చిబాబుని పిలిపించుకొన్న ఎన్టీఆర్ ఓ స‌ల‌హా ఇచ్చాడ‌ని టాక్‌. ”పెద్ది… క‌థ బాగుంది. అయితే అందులో ల‌వ్ ట్రాక్ కొత్త‌గా ఉండాలి. ఎలాగూ టైమ్‌దొరికింది క‌దా.. ఆ ల‌వ్ ట్రాకుని మ‌ళ్లీ రాయ్‌” అని చెప్పి పంపాడ‌ట‌. ఉప్పెన ల‌వ్ స్టోరీనే. ఆక‌థ‌ని యూత్ కి న‌చ్చేలా తీర్చిదిద్దాడు బుచ్చిబాబు. పెద్ద హీరోల సినిమా అంటే ల‌వ్ ట్రాక్‌కి పెద్ద‌గా ప్రాధాన్య‌త ఉండ‌దు కాబ‌ట్టి.. ఈసారి లైట్ తీసుకొన్నాడు. కానీ.. ఎన్టీఆర్ మాత్రం ల‌వ్ ట్రాక్ బాగుండాల‌ని భావిస్తున్నాడు. సుకుమార్ సినిమాల్లో ప్రేమ‌క‌థ‌లు వెరైటీగా ఉంటాయి. ఎంత యాక్ష‌న్ సినిమా అయినా.. ల‌వ్ ఫీల్ ని తీసుకురావ‌డంలో సుకుమార్ సిద్ధ‌హ‌స్తుడు అయిపోయాడు. సుకుమార్ శిష్యుడు బుచ్చిలోనూ ఆ ల‌క్ష‌ణం ఉంది. కాబ‌ట్టే.. ఎన్టీఆర్ ఈ మార్పు కోరి ఉంటాడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇండియా టుడే సర్వే : ఇప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీకి 18.. టీడీపీకి ఏడు సీట్లు !

ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో ఫోన్ల నుంచి తీసుకుని చేసే అభిప్రాయసేకరణలో ఏపీలో బీజేపీకి ఒక్క సీటు కూడా రాదని తేలిసింది. ఉన్న ఇరవై ఐదు సీట్లు యూపీఏ,...

షర్మిల చెప్పారు.. జగన్ చెప్పలేదు !

ఎప్పుడైనా రాఖీ పండుగ వస్తే.. వైసీపీ నేతలకు కానీ.. వైసీపీ మీడియాకు కానీ.. వారి అనుబంధ మీడియాకు కానీ జగన్- షర్మిల అనుబంధం చూపించడానికి స్పెషల్ ఎపిసోడ్లు వేసేవారు. షర్మిల,...

రివ్యూ : మాచర్ల నియోజకవర్గం

Macherla Niyojakavargam movie review telugu తెలుగు360 రేటింగ్ :1.75/5 పాండమిక్ తర్వాత థియేటర్ సినిమా ఈక్వేషన్ మొత్తం మారిపోయింది. ఎలాంటి సినిమాల‌కు ప్రేక్షకులు థియేటర్ కి వస్తున్నారో తలపండిన ఇండస్ట్రీ జనాలకు కూడా...

మునుగోడులో బీసీ నినాదం !

మునుగోడు రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఖరారు ప్రక్రియ ప్రారంభించేసరికి బీసీ నినాదం తెరపైకి వచ్చింది . ఇప్పటి వరకూప్రధాన రాజకీయపార్టీలన్నీ రెడ్డి సామాజికవర్గం అభ్యర్థులకే ప్రాధాన్యం ఇస్తున్నాయి. నియోజకవర్గంలో బీసీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close