జూబ్లిహిల్స్ ఉపఎన్నికల పోలింగ్ మందకొడిగా ప్రారంభమయింది. మెట్రోల్లో సహజంగానే ఇలాంటి పరిస్థితి ఉంటుంది. ఈ సారి పోలింగ్ పర్సంటేజీ పెరగడానికి సమయం కూడా పెంచారు. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకూ అవకాశంచారు. గతంలో ఐదు గంటల వరకే ఉండేది. ఇప్పుడు ఆరు గంటల వరకూ చాన్స్ ఇచ్చారు. అప్పటి వరకూ వచ్చి లైన్లో ఉన్న వారందరికీ ఓటు వేసే అవకాశం కల్పిస్తారు.
జూబ్లిహిల్స్ లో పోలింగ్ ఎప్పుడూ యాభై శాతం లోపే ఉంటుంది. 2009లో మాత్రమే 52 శాతం నమోదు అయింది. అదే అత్యధికం. అప్పట్లో పీజేఆర్ మరణం సానుభూతి వేవ్ ఉంది. ఆ తరవాత 2014 అసెంబ్లీ ఎన్నికల్లో 50 శాతం, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 46 శాతం, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 47 శాతం మాత్రమే పోలింగ్ నమోదు అయింది. దీనికి కారణం ఓటర్ల వలస. పూర్తి అర్బన్ నియోజకవర్గం కావడం, బస్తీ ప్రజల్లో ఎక్కువ మంది పనుల కోసం ఇతర ప్రాంతాలకు పోయేవాళ్లు కావడంతో ఓటింగ్ బాగా తక్కువగా ఉంటుంది.
అయితే ఈ సారి ఉపఎన్నిక ఒక్కటే జరుగుతోంది. రాజకీయ పార్టీలన్నీ ఈ ఉపఎన్నిక మీదనే దృష్టి పెట్టాయి. ఎక్కడెక్కడి ఓటర్లందరిని వెదికి మరీ తీసుకు వచ్చి ఓట్లు వేయించుకునేందుకు ప్లాన్ చేశాయి. అందుకే ఓటింగ్ శాతం పెరుగుతుందని అంటున్నారు. అరవై శాతం పైగానే ఓటింగ్ నమోదవుతుందని కాంగ్రెస్ అభ్యర్థి నమ్మకంగా ఉన్నారు. పోలింగ్ శాతం పెరిగితే మాకే లాభం అని రెండు వర్గాలు.. ఎవరికి వారు విశ్లేషణలు చేసుకుంటారు.


