కొత్త పార్టీ పేరుతో డిమాండ్ పెంచుకునే పనిలో జూపల్లి, పొంగులేటి!

రాజకీయ నేతలకు డిమాండ్ ఉంటే వారు తమ డిమాండ్ ను గరిష్టంగా ఉపయోగించుకోవడం కూడా ఓ కళ. ఆ విషయంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావులు పూర్తి స్థాయిలో పీహెచ్‌డీ చేసినట్లుగా ఉన్నారు. బీజేపీలో చేరే చాన్స్ లేదని సంకేతాలు ఇచ్చిన వాళ్లు… కాంగ్రెస్ లో చేరుతామన్నట్లుగా మాట్లాడుతున్నారు కానీ.. .కొత్త పార్టీ అంటూ ప్రచారమూ చేస్తున్నారు. టీఆర్ఎస్ పేరుతో కొత్త పార్టీపెడతామని ఇరవై మంది నేతలు తమ వెంట వస్తారని వారు ప్రచారం చేసుకుంటున్నారు.

కొత్త పార్టీ వెనుక ఆర్థికంగా బలమైన నేతలు ఉన్నారన్న అభిప్రాయాన్ని కల్పిస్తున్నారు. కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్‌గా మార్చుకున్న అంశాన్ని ఉపయోగించుకుని తెలంగాణ సెంటిమెంట్‌తో కొత్త పార్టీ రేపి.. మంచి విజయం సాధించాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. టీఆర్ఎస్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే ఎన్నికల్లో ఓడించాలన్న లక్ష్యంతో ఈ పార్టీ ఏర్పాటవుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదని… టీఆర్ఎస్ పేరుతో మరో పార్టీ ఉంటే అది్ బీఆర్ఎస్‌కే నేష్టమని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.

కొత్త పార్టీలో కీలకమయ్యే నేతల్లో అత్యధిక మంది లక్ష్యం కూడా టీఆర్ఎస్ పార్టీని ఓడించడమే. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మరో నేత కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఆయన తన పై కుట్రలు చేస్తున్నారని.. దెబ్బకు దెబ్బ తీయాలన్న లక్ష్యంతో ఉన్నారని చెబుతున్నారు. కానీ కొత్త పార్టీ పెడితే ఓట్లు చీలిపోయి కేసీఆర్ గెలుస్తారు కానీ… ఎలా ఓడిపోతారని కొంత మంది లాజిక్ వినిపిస్తున్నారు. అయితే ఎన్నికలు ముంగిట పెట్టుకుని కొత్త పార్టీ ఆలోచన చేసేంత అమాయకులుకాదని.. వారు కాంగ్రెస్ పార్టీతో బేరాలాడేశక్తిని పెంచుకునే ప్రయత్నం చేయడమేనన్న అభిప్రాయం మరో వైపు నుంచి వినిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చైతన్య : నిజమే మాస్టారూ – వై ఏపీ నీడ్స్ బటన్ రెడ్డి ?

వై ఏపీ నీడ్స్ జగన్ అనే కార్యక్రమాన్ని జగన్ రెడ్డి ప్రారంభించబోతున్నారు. ఆంధ్రాకు ఆయన అవసరం ఏంటి అనే చర్చ ప్రజల్లో పెట్టబోతున్నారు. ఇది నెగెటివ్ టోన్ లో ఉంది. అయినా...

ఈ సారి కూడా మోదీకి కేసీఆర్ స్వాగతం చెప్పలేరు !

తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఐదుగురు వైద్యుల బృందంతో చికిత్స అందిస్తున్నట్లుగా మంత్రి కేటీఆర్ తెలిపారు. వారం రోజులుగా జ్వరం, దగ్గుతో కేసీఆర్ బాధపడుతున్నారు. ఒకటి, రెండు రోజులకు తగ్గిపోయే...

టీఆర్ఎస్ కాదు బీఆర్ఎస్ అని మర్చిపోతున్న కేటీఆర్ !

కేటీఆర్ ఇంకా తెలంగాణ రాష్ట్ర సమితిలోనే ఉన్నారు. భారత రాష్ట్ర సమితి వరకూ వెళ్లలేదు. అందరితో పాటు తాను కూడా భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ అయినప్పటికీ... అలా అనుకోవడం లేదు....

ఉద్యోగులందర్నీ సాగనంపుతున్న బైజూస్

ఆన్ లైన్ విద్యను వ్యాపారంగా చేసుకుని లక్షల కోట్లకు పడగలెత్తే ప్రయత్నంలో జారి కిందపడిన బైజూస్ .. లేవడానికి చేస్తున్న ప్రయత్నాలు దివాలా దిశగా సాగుతున్నాయి. ఇటీవలే సీఈవో గుడ్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close