మిగిలిన స్థానిక సంస్థల ఎన్నికలు – ఎంత భయమో !

ఏపీలో కొన్ని స్థానిక సంస్థల ఎన్నికలు పెండింగ్ లో ఉన్నాయి. వాటికి ఎన్నికలు పెట్టమంటే.. పెట్టడంలేదు. అయితే తాజాగా ఓ ప్రకటన అయితే విడుదల చేశారు. స్థానిక సంస్థల్లో పెండింగ్ లో ఉన్న ఖాళీల భర్తీ అని. కానీ ఇవి ప్రత్యక్షఎన్నికలు కాదు. రెండో చైర్ పర్సన్…. కోఆప్షన్ మెంబర్ల ఎన్నికల కోసం ఈ షెడ్యూల్ విడుదల చేశారు. మరి ఖాళీగా ఉన్న వార్డు మెంబర్లు, జడ్పీటీసీలు, మున్సిపాలిటీల సంగతేంటి అన్నది మాత్రం చెప్పడం లేదు.

ఏపీ ప్రభుత్వానికి ఎన్నికలు నిర్వహించే కిటుకుబాగా తెలుసు. అధికారం చేతిలో ఉండి ఎన్నికలు ఎలా నిర్వహించాలో కూడా స్పష్టత ఉన్న ప్రభత్వానికి.. మిగిలిన మున్సిపాలిటీలు.. రాజమండ్రి కార్పొరేషన్ కు ఎన్నికలు జరిపించేందుకు వెనుకడుగు వేస్తోంది. మొత్తంగా అన్ని ప్రాంతాల్లో కలిపి దాదాపుగా ఎనిమిది మున్సిపాలిటీలతో పాటు అనేక చోట్ల ఖాళీలను భర్తీ చేయాల్సి ఉంది. కానీ వైసీపీ వాటిలో ఎన్నికలు పెడితే.. తాము ఎంత చేసినా చేయిదాటిపోతుందేమో అని భయపడుతున్నారు.

ఎన్నికల సమయం వస్తుంది కాబట్టి ఇక అసలు ఎన్నికలు పెట్టరు. ఇప్పటికిప్పుడు ఎక్కడైనా ఎన్నికలు జరిగితే అదే ప్రజాభిప్రాయం అన్న చర్చ జరుగుతుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యూయేట్ ఓటర్లు కొట్టిన దెబ్బతో జగన్ సర్కార్ కు మైండ్ బ్లాంక్ అయింది.ఇప్పటికిప్పుడు అలాంటి ఓటింగ్ జరగాలని కోరుకోవడం లేదు.
అయితే మిగిలిన వాటికి ఎన్నికలు పెట్టకపోవడాన్ని విపక్షాలు అడ్వాంటేజ్ గా తీసుకుంటున్నాయి. ప్రభుత్వంపై వ్యతిరేకత బయటపడుతుందన్న కారణంగానే వెనుకడుగు వేస్తున్నారని విమర్శిస్తున్నారు. అయినా ప్రభుత్వం మాత్రం అనుకుంటే అనుకున్నారు.. ఓటింగ్ కు మాత్రం వెళ్లకూడదని డిసైయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘మై డియర్ దొంగ’ రివ్యూ: స‌హ‌నం దొంగిలించేశాడు

అభినవ్ గోమఠం అంటే నవ్విస్తాడనే నమ్మకం ఏర్పడింది. ఒకవైపు క్యారెక్టర్ రోల్స్ చేస్తూనే మెయిన్ లీడ్ గా కూడా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పుడాయన టైటిల్ రోల్ లో 'మై డియర్ దొంగ' సినిమా...

4 చోట్ల టీడీపీ అభ్యర్థుల మార్పు ?

తెలుగుదేశం పార్టీ నలుగురు అభ్యర్థులను మార్చాలని నిర్ణయించుకుంది. నరసాపురం సిట్టింగ్ ఎంపీ అయిన కనుమూరు రఘురామకృష్ణరాజు ఉండి అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దింపడం దాదాపు ఖాయమే. మంతెన రామరాజుకు...

విజయమ్మ బర్త్‌డే విషెష్ : షర్మిల చెప్పింది.. జగన్ చెప్పాల్సి వచ్చింది !

వైఎస్ విజయలక్ష్మి పుట్టిన రోజును వైఎస్ జగన్ గత మూడేళ్లలో ఎప్పుడూ తల్చుకోలేదు. సోషల్ మీడియాలో చిన్న పోస్టు కూడా పెట్టలేదు. కానీ ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో జగన్ కు...

ఆసుపత్రి వ్యాపారంపై మాధవీలత సంచలన వ్యాఖ్యలు

మాధవీలత... బీజేపీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి. ఎంఐఎంకు పెట్టని కోటగా ఉన్న హైదరాబాద్ సెగ్మెంట్ లో ఈసారి జెండా పాతుతామని చెప్తున్నా బీజేపీ నేతల వ్యాఖ్యలకు తగ్గట్టుగానే మాధవీలత అందరి దృష్టిని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close