మార్చి 23, 24 తేదీల్లో నిర్వహించిన TV9 నెట్వర్క్ ప్రతిష్టాత్మక ‘What India Thinks Today (WITT) 2026’ గ్లోబల్ సమ్మిట్ ఘనంగా ముగిసింది.ఈ సదస్సుకు దేశ , విదేశాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ గ్లోబల్ సమ్మిట్ కు ముఖ్య అతిథిగా హాజరైన ప్రధాని మోడీకి , మై హోం గ్రూప్ వైస్ చైర్మన్ జూపల్లి రామురావు ఘన స్వాగతం పలికారు. ఈ గ్లోబల్ సమ్మిట్ లో ప్రధాని మోడీ..కీలక ప్రసంగం చేశారు. గత కొన్నాళ్లుగా భారత్ స్థానం మారిందని, టెక్నాలజీ ఉత్పత్తిదారుగా ఎదిగిందని స్పష్టం చేశారు అంతర్జాతీయ సంక్షోభాల సమయంలో TV9 నెట్వర్క్ వహించిన పాత్రను ప్రధాని ప్రశంసించారు.
అలాగే, మైహోం వైస్ చైర్మన్ జూపల్లి రామురావు దేశ ఆర్థిక వృద్ధి, మానవ వనరుల శక్తిపై కీలక ప్రసంగం చేశారు. ప్రస్తుతం ప్రపంచ దేశాలు “పాలీ క్రైసిస్” (Poly-crisis) వంటి ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ, భారత్ మాత్రం స్థిరమైన వృద్ధిని కనబరుస్తోందని తెలిపారు. ప్రస్తుతం భారత్ సుమారు 7% వృద్ధిరేటుతో దూసుకుపోతోందని, అతి త్వరలోనే ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతోందని తెలిపారు.
భారత మానవ వనరులు ప్రపంచవ్యాప్తంగా ఎందుకు డిమాండ్‌లో ఉన్నాయో వివరిస్తూ జూపల్లి రాము రావు 7 కీలక అంశాలను హైలైట్ చేశారు. యువ జనాభా ,2. ఆంగ్ల భాషపై పట్టు ,3. STEM రంగాల్లో ప్రతిభ , 4. డిజిటల్ సామర్థ్యం & డేటా వినియోగం , 5. అంతర్జాతీయ అంశాలపై బలమైన అవగాహన , 6. సాంకేతికతను త్వరగా అలవాటు చేసుకునే నైపుణ్యం , 7. సంక్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కోగలిగే సామర్థ్యం ..ఈ అన్ని అంశాలు కలిసి భారత్‌ను గ్లోబల్ టాలెంట్ హబ్‌గా నిలబెడుతున్నాయని జూపల్లి రాము రావు స్పష్టం చేశారు.

