ఈ దీపావళికి వస్తున్న సినిమాల్లో ‘కె ర్యాంప్’ ఒకటి. కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన సినిమా ఇది. టీజర్, ట్రైలర్ రెండూ కుర్రాళ్లకు నచ్చేలా కట్ చేశారు. లిప్ లాక్ సీన్లకు లెక్క లేదు. స్క్రిప్టు ప్రకారం ఈ సినిమాలో 18 ముద్దు సీన్లు ఉండాలని ముందే ఫిక్సయ్యారు. కానీ ఇప్పుడు 8కి తగ్గించారని తెలుస్తోంది. అయితే ఆ ముద్దుల్లో కొన్ని ఘాటుగా ఉండబోతున్నాయని టాక్. ట్రైలర్ లో ఆల్రెడీ కొన్ని చూపించారు. ఇంకొన్ని థియేటర్ల కోసం అట్టి పెట్టారు. టైటిల్ ‘K – RAMP’ ఏమిటి? అనేదానిపై కూడా చర్చ నడుస్తోంది. ఈ సినిమాలో హీరో పేరు కిరణ్ అట. అందుకే K అని తగిలించారు. ఈనెల 11న ఈ సినిమా నుంచి మరో ట్రైలర్ రానుంది. ఈసారి కూడా కుర్రాళ్లని దృష్టిలో ఉంచుకొనే ట్రైలర్ కట్ చేశారని తెలుస్తోంది.
రిలీజ్కు ముందే ఈ సినిమా ఓటీటీ రైట్స్ కూడా అమ్ముడైపోయాయి. ఫ్యాన్సీరేటుతో ఆహా ఈ సినిమా ఓటీటీ హక్కుల్ని దక్కించుకొంది. ఈమధ్య కాలంలో శాటిలైట్ బిజినెస్ జరగడం లేదు. మరీ డల్ గా ఉంది. అయితే కె.ర్యాంప్ ఈ విషయంలోనూ మెరుగైన బిజినెస్ చేసింది. రెండు కోట్లకు శాటిలైట్ హక్కుల్ని అమ్మేశారని తెలుస్తోంది. దాదాపు రూ.15 కోట్ల బడ్జెట్ తో రూపొందిన సినిమా ఇది. ఓటీటీ, శాటిలైట్ రూపంలో సగం డబ్బులు వెనక్కి వచ్చేశాయి. దీపావళి సీజన్ కలిసొస్తే.. మిగిలింది రాబట్టడం పెద్ద కష్టమేం కాదు. కాకపోతే ఈ సినిమాకు డ్యూడ్ తో గట్టి పోటీ ఉండే అవకాశాలు ఉన్నాయి. అది కూడా అచ్చంగా కుర్రాళ్ల కథే. మిత్రమండలి, తెలుసు కదా సినిమాలు ఈ దీపావళికి పోటీలో ఉన్న సంగతి తెలిసిందే.