కేఏ పాల్ పై ఆయన దగ్గర పని చేసే ఉద్యోగిని ఒకరు లైంగిక వేధింపుల కేసు పెట్టారు. ఉద్యోగం చేస్తున్న సమయంలో అనుచితంగా మాట్లాడుతూ…వాట్సాప్‌కు అసభ్యసందేశాలు పంపుతున్నారని ఆ మహిళ షీ టీమ్‌ను ఆశ్రయించింది. ఆ టీమ్ కేసు పెట్టి ..కేసును పంజాగుట్ట పోలీసులకు రిఫర్ చేసింది. వారు ఆధారాలను పరిశీలించి కేసు నమోదు చేశారు.
ఫిర్యాదు చేసింది పాల్ కార్యాలయంలో పని చేసే మహిళే కావడంతో పోలీసులు సీరియస్ గా దర్యాప్తుచేస్తున్నారు. ఆమె ఇచ్చిన అందించిన ఆధారాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. బాధితురాలికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని పంజాగుట్ట పోలీసులు ఆమెకు హామీ ఇచ్చారు. కేఏ పాల్ కు నోటీసులు జారీ చేసి విచారించే అవకాశం ఉంది.
కేఏ పాల్ టీం మాత్రం మహిళ ఆయనపై చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని పేర్కొంది. ప్లాన్ ప్రకారం ఆయనపై ఆరోపణలు చేస్తున్నారంటూ కొట్టిపారేసింది. జూబ్లిహిల్స్ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారని తెలిసి రాజకీయ ప్రత్యర్థులు కుట్ర చేశారని పాల్ టీం అంటోంది. ఆయన జూబ్లిహిల్స్ లో పోటీ చేసినా చేయకపోయినా పెద్ద తేడా ఏమీ ఉండదు. ఆ మహిళ పాల్ ను బ్లాక్ మెయిల్ చేయాడనికైనా ఫిర్యాదు చేసి ఉండాలి లేకపోతే..పాల్ నిజంగానే ఆ పనిచేసి ఉండాలి. పోలీసుల దర్యాప్తులో తేలనుంది.