కేఏ పాల్‌ని వ‌ర్మ డ‌బ్బులు అడిగాడా?

వ‌ర్మ- పాల్‌ల‌ల‌ది టామ్ అండ్ జెర్రీ వ్య‌వ‌హారం. ఇద్ద‌రూ మాట్లాడితే బోలెడంత కామెడీ. ఒక‌రి గురించి ఇంకొక‌రు మాట్లాడితే మ‌రింత బీభ‌త్స‌మైన కామెడీ. ఇప్పుడైతే ఇద్ద‌రి మ‌ధ్య వార్ మొద‌లైపోయింది. వ‌ర్మ త‌న కొత్త సినిమా `క‌మ్మ రాజ్యంలో క‌డ‌ప రెడ్లు`లో కేఏ పాల్‌ని పోలిన పాత్ర‌ని సృష్టించాడు. పాల్‌తో వ‌ర్మ ఈ సినిమాలో చెడుగుడు ఆడుకోవ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. అది చూసి పాల్ మ‌న‌స్తాపానికి గుర‌య్యాడు. వ‌ర్మ‌పై కేసు వేస్తాన‌ని అంటున్నాడు. ప్ర‌స్తుతం పాల్ అమెరికాలో ఉన్నాడు. అక్క‌డి నుంచే వ‌ర్మ‌పై లీగ‌ల్ యాక్ష‌న్ తీసుకునే ప్ర‌య‌త్నాల్లో ఉన్నాడు. వ‌ర్మ ఇది వ‌ర‌కు త‌న‌ని సంప్ర‌దించాడ‌ని, త‌న సినిమాలో పెట్టుబ‌డి పెట్టాల‌ని అడిగాడ‌ని, త‌న కాళ్లు కూడా ప‌ట్టుకుని ప్రాధేయ‌ప‌డ్డాడ‌ని, వ‌ర్మ వ్య‌వ‌హారం న‌చ్చ‌క తాను ప్రోత్స‌హించ‌లేద‌ని, ఆ కార‌ణంతోనే ఇలా త‌న‌ని కార్న‌ర్ చేస్తున్నాడ‌ని పాల్ ఆరోపిస్తున్నాడు. క‌మ్మ‌రాజ్యంలో క‌డ‌ప‌రెడ్లు అనే టైటిల్‌తో ఎవ‌డైనా సినిమా తీస్తాడా? అంటూ ప్ర‌శ్నిస్తున్నాడు పాల్‌. తెలుగు చిత్ర‌సీమ‌లో ఎంతోమంది ద‌ర్శ‌కులు ఉన్నార‌ని, అయితే వ‌ర్మ‌లా ఎవ‌రూ దిగ‌జారిపోలేద‌ని, డ‌బ్బుల కోస‌మే వ‌ర్మ ఇలాంటి ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడ‌ని ఆరోపిస్తున్నారు. త‌న‌ని క‌లిసిన‌, మాట్లాడిన వీడియోల‌ని త్వ‌ర‌లోనే చూపిస్తాన‌ని అంటున్నాడు పాల్‌. మొత్తానికి వ‌ర్మ‌కి ఇవ‌న్నీ ప‌బ్లిసిటీలో బాగానే ఉప‌క‌రిస్తున్నాయి. పైసా పెట్టుబ‌డి లేకుండా – త‌న సినిమాని త‌న‌దైన స్టైల్‌లో ప్ర‌మోట్ చేసుకుంటున్నాడు. అలా.. వ‌ర్మ ప్లాన్ స‌క్సెస్ అయిన‌ట్టే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

గుంటూరు కారం: త్రీడీలో క‌నిపించిన బీడీ

https://www.youtube.com/watch?v=V-n_w4t9eEU&feature=youtu.be ముందు నుంచీ అనుకొంటున్న‌ట్టే.. మ‌హేష్ బాబు - త్రివిక్ర‌మ్ సినిమాకి 'గుంటూరు కారం' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. సూప‌ర్ స్టార్ కృష్ణ జ‌యంతి సంద‌ర్భంగా ఈ రోజు ఫ‌స్ట్ గ్లిమ్స్ విడుద‌ల...

కేశినేనికి దారి తెలీడం లేదా ?

విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని తనను తాను ఓ రేంజ్ లో ఊహించుకుంటున్నారు. బెజవాడను తిరుగులేని విధంగా అభివృద్ధి చేశానని.. టాటా ట్రస్ట్ అంటే తనదేనన్నట్లుగా చెప్పుకుంటున్నారు. ఇండిపెండెంట్ గా...

‘గుహ’ క‌డుతున్న ప్ర‌భాస్‌

డ్రీమ్ హౌస్‌.. అంటూ ప్ర‌తీ ఒక్క‌రికీ ఉంటుంది. త‌మ ఇల్లు ఎలా ఉండాలో.. ముందు నుంచీ క‌ల‌లు కంటుంటారు. అలాంటి క‌ల ప్ర‌భాస్‌కీ ఉంది. అత్యాధునిక హంగుల‌తో ఓ ఫామ్ హౌస్ నిర్మించుకోవాల‌ని...

తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలకు కేంద్రం కూడా రెడీ !

తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలను ఎవరూ ఊహించని విధంగా .. అత్యంత కాస్ట్ లీగా నిర్వహించడానికి తెలంగాణ సర్కార్ ఏర్పాట్లు చేసింది. మరోసారి మన తెలంగాణ .. అనే సెంటిమెంట్ అందరిలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close