మ‌హేష్… ఆ లోటు కూడా తీర్చేస్తున్నాడా?

మ‌హేష్‌ బాబు మంచి పెర్‌ఫార్మ‌ర్‌. అంద‌గాడు. ఓ గొప్ప స్టార్‌. తెర‌పై మ‌హేష్ క‌నిపిస్తుంటే, చూపు తిప్పుకోలేం. కాక‌పోతే… అంత గొప్ప డాన్స‌ర్ అయితే కాదు. చ‌ర‌ణ్‌, బ‌న్నీ, ఎన్టీఆర్‌, రామ్‌, నితిన్ – వీళ్లంతా డాన్సుల్లో ఇర‌గ్గొట్టేస్తుంటారు. మ‌హేష్ మాత్రం ఈ విష‌యంలో శ్ర‌మించ‌డు. కొన్ని సినిమాల్లో మ‌హేష్ వేసిన స్టెప్పులు చూసి జ‌నం కూడా న‌వ్వుకున్నారు. బ్ర‌హ్మోత్స‌వంలో మ‌హేష్ వేసిన స్టెప్పులు ట్రోలింగ్‌కీ గుర‌య్యాయి.

అయితే ఈసారి మ‌హేష్ త‌న అభిమానుల‌కు డాన్స్ ఫీస్ట్ ఇవ్వ‌బోతున్నాడ‌ని తెలుస్తోంది. త‌న కొత్త సినిమా `స‌రిలేరు నీకెవ్వ‌రు`లో మ‌హేష్ డాన్సులు కొత్త‌గా ఉండ‌బోతున్నాయ‌ట‌. సాధార‌ణంగా మ‌హేష్ సినిమాల‌కు రాజు సుంద‌రం కొరియోగ్ర‌ఫీ అందిస్తుంటాడు. మ‌హేష్ అన‌గానే కొన్ని బ్రాండెడ్ స్టెప్పులు ఉంటాయి. అవి వేయించేసేసి `మ‌మ‌` అనిపిస్తాడు రాజు సుంద‌రం. అయితే ఈసారి మాత్రం అలా కాదు. రాజు సుంద‌రంని ప‌క్క‌న పెట్టి మ‌రొక‌రికి అవ‌కాశం ఇచ్చాడ‌ట మ‌హేష్‌. మ‌రీ ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్‌కి ముందొచ్చే పాట‌లో మ‌హేష్ స్టెప్పులతో అల‌రించ‌బోతున్నాడ‌ని తెలుస్తోంది. అదో మంచి మాస్ బీట్ అని, ర‌ష్మిక – మ‌హేష్‌ల మ‌ధ్య సాగే ఆ పాట‌లో మూమెంట్స్‌ స‌రికొత్త‌గా ఉండేలా చూసుకుంటున్నార‌ని తెలుస్తోంది. ద‌ర్శకుడు అనిల్ రావిపూడి కూడా ఓ మంచి డాన్స‌రే. త‌ను యువ హీరోల‌కు తీసిపోని విధంగా స్టెప్పులు వేస్తాడు. అందుకే మ‌హేష్‌తో కూడా ఈ సినిమాలో స్టెప్పులు వేయించాడ‌ట‌. మొత్తానికి మ‌హేష్ ఫ్యాన్స్‌కి ఇది గుడ్ న్యూసే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీలో కరోనా మరణమృదంగం..! ఆపడానికి ప్రయత్నాల్లేవా..?

ఆంధ్రప్రదేశ్‌లో మరణాలు రెండు వేలు దాటిపోయాయి. గత రెండు రోజులుగా.. రోజుకు కొద్దిగా తక్కువగా వంద మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కరోనా వైరస్ అనేది ప్రాణాంతకం కాదని... చికిత్స చేస్తే పోతుందని ప్రభుత్వం...

“అప్పడం వ్యాక్సిన్” కనిపెట్టిన కేంద్రమంత్రికే కరోనా..!

కరోనా వైరస్‌కు ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్తల దగ్గర్నుంచి భారతీయ జనతా పార్టీ నేతల వరకూ..అందరూ.. మందు కనిపెట్టే పనిలో బిజీగా ఉన్నారు. సైంటిస్టులు ఇంకా కుస్తీలు పడుతున్నారు కానీ.. భారతీయ జనతా పార్టీ...

టీటీడీపై కరోనా పడగ..! బ్రహ్మోత్సవాలు ఎలా..?

తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగుల్లో 743 మంది కరోనా బారిన పడ్డారు. వీరిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ముగ్గురిలో ఓ అర్చకుడు కూడా ఉన్నారు. అర్చకుల్లో సగం మందికిపైగా వైరస్ బారిన...

తప్పు యాజమన్యాలది .. పరిహారం మాత్రం ప్రజల సొమ్మా..!?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైనా హై ప్రోఫైల్ ప్రమాదం జరిగితే ముందుగా... భారీగా నష్ట పరిహారం ప్రకటించడానికి ఉత్సాహపడుతోంది. ముందూ వెనుక ఆలోచించకుండా.. ఎంత మంది చనిపోయారో తెలియకుండానే.. ఆ ప్రమాద వార్త హైలెట్...

HOT NEWS

[X] Close
[X] Close