స్టాలిన్ : ఈయనా సాధారణ ‘రాజకీయ స్పీకరే’…!

‘జూలియస్‌ సీజర్‌’ నాటకంలోని ‘యూ టూ బ్రూటస్‌’ అనే వాక్యం చాలా పాపులర్‌. దాన్నో సామెత మాదిరిగా వాడుతుంటారు. ‘బ్రూటస్‌ నువ్వు కూడానా?’ …అంటాడు రాజు తనను చంపుతున్న సన్నిహితుడు బ్రూటస్‌తో. బ్రూటస్‌ నువ్వు కూడా అందరిలాంటి ద్రోహివేనన్నమాట అని రాజు భావం. ఏ ప్రత్యేకతా లేకుండా అందరి మాదిరిగానే అదే మూసలో వెళ్లేవారిని యూ టూ బ్రూటస్‌ అంటుంటారు ఈ రోజుల్లో. ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం బ్రూటస్‌లాంటోడేనని చెప్పొచ్చు. అంటే ఈయనకు ఏ ప్రత్యేకతా లేదని, గతంలో పనిచేసిన కొందరు రాజకీయ స్పీకర్లలాంటివాడే ఈయన కూడా అని చెప్పుకోవల్సివస్తోంది.

‘రాజకీయ స్పీకర్‌’ అనే మాటలోనే ఈయన నిష్పాక్షిక స్పీకర్‌ కాదని, వైకాపా మనిషిగా పనిచేస్తున్న స్పీకర్‌ అనేది అర్థమవుతోంది కదా. రాజ్యాగం ప్రకారం స్పీకర్‌ పదవి సమున్నతమైంది. దానికి హుందాతనం, గౌరవం ఉన్నాయి. ‘అందరి బంధువయా’ అన్నట్లుగా స్పీకర్‌ అందరివాడు. అంటే అన్ని పార్టీలను రాజకీయాలకతీతంగా చూడాల్సినవాడు. రాజకీయాల బురద అంటించుకోకుండా ఉండాల్సినవాడు. సభా నిర్వహణలో సంయమనం పాటించాల్సినవాడు. అధికార పార్టీకి చెందినవాడు అయినప్పటికీ ఆ పార్టీతో అంటకాగకుండా ఉండేవాడు. సభలో అధికార పార్టీ ఆధిపత్యాన్ని అడ్డగించి ప్రతిపక్షాలకు ఎక్కువగా మాట్లాడే అవకాశం ఇవ్వాల్సినవాడు. బయట కూడా రాజకీయాలకు అతీతంగా, రాజకీయాలు మాట్లాడకుండా ఉండేవాడు….ఇలాంటి లక్షణాలన్నీ స్పీకరుకు ఉండాలి.

కాని ఇప్పటి స్పీకర్లు ఇందుకు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో స్పీకర్లు అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారు. ఏ నాయకుడినైనా స్పీకరు పదవికి ఎంపిక చేసేది అధికార పార్టీయే. అంటే ముఖ్యమంత్రే. స్పీకరుగా ఎన్నికయ్యాక సదరు నాయకుడు తామరాకు మీద నీటిబొట్టులా ఉండాలి. కాని ఇప్పటి స్పీకర్లు ముఖ్యమంత్రికి నమ్మిన బంట్లలా ఉన్నారు. తమ్మినేని సీతారాం ఇలాగే వ్యవహరిస్తున్నాడు. అసెంబ్లీలో ఆయన పాత్ర సంగతి అలా ఉంచుదాం. బయటమాత్రం ఆయన పక్కా వైకాపా నాయకుడిలా వ్యవహరిస్తున్నాడు. ఆయన మాటలు,వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. చివరకు పబ్లిగ్గా బూతులు మాట్లాడుతున్నారు. ఆయన స్పీకరైనప్పుడు కొన్ని పత్రికలు ‘తమ్మినేని సౌమ్యుడు’ అని రాశాయి. కాని ఆయన మాటతీరు అందుకు విరుద్ధంగా ఉంది.

సీఎం వైఎస్‌ జగన్‌ భజన బృందంలో తమ్మినేని ముఖ్యపాత్రే పోషిస్తున్నాడు. ‘ఆంధ్రప్రదేశ్‌లోనే పుట్టిపెరిగిన జగన్‌ గర్వించదగ్గ భారతీయ పౌరుడు’ అన్నాడీయన. కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియాగాంధీని ఘాటుగా విమర్శించాడు. కాని సభ్యత మర్చిపోయి బూతులు మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది? అసెంబ్లీలో అధికార, ప్రతిపక్ష సభ్యులు సభ్యతకు తిలోదాకాలిచ్చి బుతూలు తిట్టుకుంటున్నారు కదా. వారు అలా మాట్లాడకుండా కట్టడి చేయాల్సిన స్పీకరు తానే బూతులు మాట్లాడితే వాళ్లకేం చెబుతాడు? ‘గతంలో చంద్రబాబు నాయుడు సోనియా గాంధీతో చేతులు కలిపి లం…త్వానికి పాల్పడలేదా?వాళ్లా జగన్మోహన్‌ రెడ్డి గురించి మాట్లాడేది? అర్థం లేని మాటలు మాట్లాడే అర్హత వారికి లేదు’…అన్నాడు తమ్మినేని.

జగన్‌కు, సోనియా గాంధీకి చాలా వ్యత్యాసం ఉందన్నాడు. ఇలా మాట్లాడి స్పీకర్‌ ఏం సాధించాడంటే, ఉన్న గౌరవం పోగొట్టుకున్నాడు. ‘తమ్మినేని రాజకీయ వ్యభిచారి’ అని టీడీపీ నాయకుడు కూన రవికుమార్‌ విమర్శించాడు. మరోపక్క కాంగ్రెసు నాయకులు విరుచుకుపడ్డారు. తమ్మినేని స్పీకర్‌ పదవి చేపట్టినప్పటినుంచి జగన్‌ని పలు సందర్భాల్లో ఆకాశానికి ఎత్తేశాడు. టీడీపీ హయాంలో కోడెల శిప్రసాదరావు కూడా పార్టీ నాయకుడిగానే వ్యవహరించాడు. పార్టీ నిర్వహించిన నిరసన కార్యక్రమాల్లో, సైకిల్‌ యాత్రలో పాల్గొన్నాడు. పదవిలో ఉన్నప్పుడే అనేక ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ఒకప్పటి స్పీకర్లు ముఖ్యమంత్రులను కూడా కట్టడి చేసి తమ నిష్పాక్షకతను చాటుకున్నారు. కాని ఇప్పటి స్పీకర్లు ముఖ్యమంత్రుల కనుసన్నల్లో మెలుగుతూ వారి కరుణాకటాక్షల కోసం వేచి చూస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పెండింగ్‌లో ఉన్న మూడు డీఏల చెల్లింపునకు సీఎం జగన్ గ్రీన్‌సిగ్నల్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు దసరా కానుక ప్రకటించింది. పెండింగ్‌లో ఉన్న మూడు డీఏల చెల్లింపునకు సీఎం జగన్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. డీఏల చెల్లింపునకు కార్యాచరణ కూడా ప్రభుత్వం ప్రకటించింది. జులై 2018...

ఎన్నికలు నిర్వహణ వద్దంటున్న వైకాపా

దేశంలో కరోనా లాక్ డౌన్ విధించినప్పుడు ఎన్నికలు వాయిదా వేశారని నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను కులం పేరు పెట్టి మరీ బూతులు తిట్టిన మంత్రులు ఇప్పుడు.. అదే రమేష్ కుమార్ ఎన్నికలు పెడతానంటే...

అమరావతిలో “రియల్ పెయిడ్ ఉద్యమం” స్టార్ట్..!

అమరావతిలో పోటీ ఉద్యమాలు జరుగుతున్నాయి. భూములిచ్చిన రైతులు లాఠీదెబ్బలకు ఓర్చుకుని పోరాటం చేస్తూంటే.. వారికి పోటీగా కొంత మంది ఇప్పుడు ఉద్యమాలను ప్రారంభిస్తున్నారు. శంకుస్థాపన చేసి ఐదేళ్లయిన సందర్భంగా రైతుల సభ...

తిరుపతిలో బీజేపీ పోటీ ఖాయం.. కానీ అభ్యర్థి మాత్రం పక్క పార్టీ నుంచి..!

తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నికల్లో పోటీ చేసి.. తాము ఏపీలో బలపడ్డామని నిరూపించుకోవాలని భారతీయ జనతా పార్టీ ఉబలాట పడుతోంది. ముఖ్యంగా ఏపీ వ్యవహారాల ఇన్చార్జ్‌గా ఉన్న సునీల్ ధియోధర్ తాను.. పార్టీని...

HOT NEWS

[X] Close
[X] Close