నా పరువూ కాపాడండి..! హైదరాబాద్ సీపీకి కేఏ పాల్ ఫిర్యాదు..!

కేఏ పాల్ హైదరాబాద్ పోలీసుల్ని ఆశ్రయించారు. వైఎస్ జగన్ సోదరి షర్మిల ఏ కారణంతో.. హైదరాబాద్ సీపీ అంజన్ కుమార్ ను.. ఆశ్రయించి ఫిర్యాదు చేశారో అదే కారణంతో… తాను కూడా ఫిర్యాదు చేశారు. అదే కారణం అంటే.. కేఏ పాల్ కు ప్రభాస్ కు లింక్ ఉందని కాదు కానీ.. చిత్రవిచిత్రమైన ట్రోలింగ్ తో తన పరువు తీస్తున్నారనేది ఆయన వాదన. తనపై వస్తున్న అసత్య ప్రసారాలు, యూట్యూబ్ చానల్స్ లో పోస్ట్ చేస్తున్న కామేడీ క్లిప్పింగ్స్ లపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ కలిసి ఫిర్యాదు చేశారు. 100 యూట్యూబ్ చానల్స్, కొన్ని వెబ్ సైట్స్, కొంతమంది వ్యక్తుల పైన లిఖితపూర్వక ఫిర్యాదు అందించారు. అసత్య ప్రచారాలు చేస్తున్న వారందరిపైనా కఠిన చర్యలు తీసుకొని శిక్షించాలని కోరారు. దీనితో పాటు… ఆంద్రప్రదేశ్ లో తనకు ప్రాణహాని ఉందని వ్యక్తిగత భద్రతను కల్పించాలని కె ఏ పాల్ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ను కోరారు. త్వరలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలుస్తానని ప్రకటించారు. ఒంగోలు పోలీస్ స్టేషన్ లో తనపై ఉన్న కేసులను మళ్లీ రీ ఓపెన్ చేసి ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. సీఎం చంద్రబాబు , ప్రతిపక్ష నేత వై ఎస్ జగన్ ల నుంచి తనకు ప్రాణహాని ఉందని చెప్పుకొచ్చారు.

షర్మిల ఫిర్యాదుపై పోలీసులు సీరియస్ గా స్పందించారు. విచారణ బృందాలను ఏర్పాటు చేశారు. దాంతో సైబర్ ట్రోలింగ్ కు గురవుతున్న వారు … తమ కేసుల్ని కూడా అంతే సీరియస్ తీసుకుంటారన్న ఉద్దేశంతో పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు చేస్తున్నారు. యూ ట్యూబ్ చానళ్లపై నియంత్రణ లేకపోవడంతో వ్యూస్ కోసం ఆయా ఛానళ్లు చేస్తున్న ప్రయత్నాలు పలువురు సెలబ్రిటిల పరువుకు భంగం కలిగించేలా మారాయి. షర్మిల ఫిర్యాదుపై చర్యలు తీసుకున్న పోలీసులు అభ్యంతకరంగా ఉన్న ఆయా వీడియోలను అప్ లోడ్ చేసిందెవరు? ఏయే ఐపీ ల నుంచి ఆప్ లోడ్ అయ్యాయన్న విషయాలను గుర్తించి వారిపై చర్యలు తీసుకుంటున్నారు. షర్మిల కేసులో ఇప్పటికే 14మందికి పోలీసులు నోటీసులు జారీ చేశారు.

సోషల్ మీడియా ట్రోలింగ్ తో తల పట్టుకుంటున్న బడాబాబులు తమను ఈ ట్రోలింగ్ నుంచి కాపాడాలంటూ పోలీసులను ఒకరితర్వాత మరొకరుగా ఆశ్రయిస్తున్నారు.. బాలయ్య బాబు నుంచి లోకేష్ వరకు..ఇంకొక వైపు పవన్ కళ్యాణ్,నాగబాబులను టార్గెట్ చేస్తూ జరుగుతున్న ట్రోలింగ్ ప్రస్తుతం పోలీసులకు కొత్త తలనొప్పులు తీసుకుని వస్తున్నాయి…ట్రోలింగ్ ను సమర్ధవంతంగా కట్టడి చేయడానికి అవసరమైన చట్టపరమైన మార్గాలు తక్కువగా ఉండటంతో పోలీసులకు తలనొప్పిగా మారుతోంది. షర్మిల కేసులో ఏం చేయాలో తెలియక తంటాలు పడుతూంటే.. కొత్తగా ముందే కేఏ పాల్ మరో ఫిర్యాదు తో రావడంతో మళ్లీ యూ ట్యూబుకు సరికొత్త లేఖలు రాయడానికి సన్నద్దమవుతున్నారు హైదరాబాద్ పోలీసులు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అగ్రదేశాలు పక్కనపెడుతుంటే ఇండియాలోనే ఎందుకు? ఈవీఎంలే బీజేపీ బలమా..?

లోక్ సభ ఎన్నికల వేళ మరోసారి ఈవీఎంల పనితీరుపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. సాంకేతికతకు పెద్దపీట వేసే అగ్రదేశాలు సైతం ఈవీఎంలను పక్కనపెడుతుంటే ఇండియాలో మాత్రం ఎందుకు ఈవీఎంలతోనే ఎన్నికలను నిర్వహిస్తున్నారనే ప్రశ్నలు...

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close