అల్లు అర్జున్‌తో నటించే ఛాన్స్‌ వచ్చినా…

అదృష్టానికి ఆధార్‌ కార్డ్‌ ఎలా వుంటుందంటే ప్రియా ప్రకాశ్‌ వారియన్‌కు వచ్చిన పాపులారిటీని చూపిస్తే సరిపోతుందేమో! ఏదో మలయాళంలో ఒక్కసారి కన్ను గీటింది. అంతే… ప్రపంచం మొత్తం ఆమెకు దాసోహం అనేసింది. ఏ సినిమాలోనిదీ వీడియో క్లిప్‌ అనేది కూడా తెలియకుండా వాట్సాప్‌, ట్వట్టిర్‌, ఫేస్‌బుక్‌ తదితర సామాజిక మాధ్యమాల్లో ఆమె క్లిప్‌ షేర్‌ చేసినవారు ఎందరో! ‘ఒరు అడార్‌ లవ్‌’లోని ఓ పాటలో చిన్న క్లిప్‌తో ఫేమస్‌ అయిన ప్రియా ప్రకాశ్‌ వారియర్‌కి ఆ సినిమా విడుదలకు ముందే ఇతర భాషల్లో నటించే అవకాశాలు వెల్లవెత్తాయి. పలువురు తెలుగు హీరోలు, దర్శక నిర్మాతలు ప్రియా ప్రకాశ్‌ వారియర్‌తో సినిమా చేయాలని ప్రయత్నించారు. ఒకానొక సమయంలో అల్లు అర్జున్‌ సరసన ఆమె నటిస్తుందని ప్రచారం జరిగింది. ‘ఒరు అడార్‌ లవ్‌’ తెలుగు అనువాదం ‘లవర్స్‌ డే’ ప్రచారం కోసం ఈ రోజు హైదరాబాద్‌ వచ్చిన ప్రియా ప్రకాశ్‌ వారియన్‌ను ఆ ప్రచారం నిజమా? కాదా? అని అడిగితే… నిజమేనని చెప్పింది. ‘‘అల్లు అర్జున్‌ సరసన నటించే అవకాశం వచ్చింది. అప్పటికి ‘ఒరు అడార్‌ లవ్‌’ చిత్రీకరణ పూర్తి కాలేదు. దాంతో ఆ సినిమా చేయలేకపోయా. మా సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకకు ఆయన వస్తుండటం సంతోషంగా ఉంది. చిత్రబృందమంతా ఆయన్ని కలవడం కోసం ఆత్రుతగా ఎదురుచూస్తోంది’’ అని ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ చెప్పింది. అల్లు అర్జున్‌, అల్లు అయాన్‌ ‘వింక్‌ మూమెంట్‌’ చూశానని, ఆయన తన గురించి చాలా పోస్టులు పెట్టారని సంతోషం వ్యక్తం చేసింది. బుధవారం ‘ లవర్స్ డే ‘ ప్రీ రిలీజ్ జరగనుంది. ప్రేమికుల రోజు కానుకగా ఫిబ్రవరి 14న సినిమాను విడుదల చేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

4 చోట్ల టీడీపీ అభ్యర్థుల మార్పు ?

తెలుగుదేశం పార్టీ నలుగురు అభ్యర్థులను మార్చాలని నిర్ణయించుకుంది. నరసాపురం సిట్టింగ్ ఎంపీ అయిన కనుమూరు రఘురామకృష్ణరాజు ఉండి అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దింపడం దాదాపు ఖాయమే. మంతెన రామరాజుకు...

విజయమ్మ బర్త్‌డే విషెష్ : షర్మిల చెప్పింది.. జగన్ చెప్పాల్సి వచ్చింది !

వైఎస్ విజయలక్ష్మి పుట్టిన రోజును వైఎస్ జగన్ గత మూడేళ్లలో ఎప్పుడూ తల్చుకోలేదు. సోషల్ మీడియాలో చిన్న పోస్టు కూడా పెట్టలేదు. కానీ ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో జగన్ కు...

ఆసుపత్రి వ్యాపారంపై మాధవీలత సంచలన వ్యాఖ్యలు

మాధవీలత... బీజేపీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి. ఎంఐఎంకు పెట్టని కోటగా ఉన్న హైదరాబాద్ సెగ్మెంట్ లో ఈసారి జెండా పాతుతామని చెప్తున్నా బీజేపీ నేతల వ్యాఖ్యలకు తగ్గట్టుగానే మాధవీలత అందరి దృష్టిని...

బీఆర్ఎస్ కు బిగ్ షాక్ – కాంగ్రెస్ లోచేరిన కేటీఆర్ బావమరిది..!

లోక్ సభ ఎన్నికల ముంగిట బీఆర్ఎస్ కు షాక్ ల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, కీలక నేతలు పార్టీని వీడుతుండగా తాజాగా కేటీఆర్ బావమరిది ఎడ్ల రాహుల్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close