తమిళ హీరో సూర్య హిట్టు కొట్టి ఎన్నాళ్లయ్యిందో కదా? తన వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. కానీ బాక్సాఫీసు ద్గగర మెప్పించలేకపోతున్నాడు. సూర్య సినిమా కమర్షియల్ గా ఆడి చాలా కాలం అయ్యింది. అన్నిటికంటే ముఖ్యంగా ‘కంగువా’ భారీ డిజాస్టర్ ని మూటగట్టుకొంది. ‘రెట్రో’ దీ అదే దారి. ఈ రెండు సినిమాలపై నిర్మాతలు భారీగా ఖర్చు పెట్టారు. కానీ ఫలితం రాలేదు. ఇప్పుడు తమిళ సినిమా ‘కరుప్పు’ రిలీజ్ చేస్తున్నారు. ఈనెల 15న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తెలుగులో ‘వీరభద్రుడు’ గా పేరు మార్చారు.
అసలే సూర్యకు వరుస ఫ్లాపులు.. దానికి తోడు బ్యాడ్ సీజన్. ఈ వేసవి బాక్సాఫీసు ఖాళీ అయిపోయింది. ఐపీఎల్ దెబ్బకు థియేటర్లు బోసి బోతున్నాయి. ఎండలకు భయపడి సగం జనం బయటకు రావడం లేదు. ఇలాంటి నేపథ్యంలో సినిమా రిలీజ్ చేయడం రిస్కే. పైగా తమిళంలో ప్రస్తుతం పొలిటికల్ హీట్ నడుస్తోంది. అక్కడ సినిమాల గురించి మాట్లాడుకొనేంత తీరిక లేదు. మూడ్ మొత్తం విజయ్ చుట్టూ తిరుగుతోంది. ఇలాంటి సమయంలో సినిమాలపై ఫోకస్ పెడతారా అనేది ప్రశ్న. ప్రచారం ఎంత గట్టిగా చేసుకొన్నా, వాళ్ల ఫోకస్ సంపాదించడం అంత తేలికైన విషయం కాదు. పైగా `కురుప్పు` ఫక్తు మాస్ మసాలా సినిమాలా అనిపిస్తోంది. ఇలాంటి సినిమాలకు కాసులు రాలతాయనుకోవడం నిజంగా అత్యాసే.
కాకపోతే.. ఒకటే ప్లస్ పాయింట్. ఈ సినిమాకు పెద్దగా పోటీ లేదు. చిన్న, మీడియం రేంజ్ సినిమాలేవీ ఈనెల 15న రావడం లేదు. అదొక్కటే సూర్య సినిమాని కాపాడే వస్తువు. వారం రోజుల్లో సినిమా రిలీజ్ అనగా.. కనీసం ప్రచార పర్వానికి శ్రీకారం చుట్టలేదు. సూర్య సినిమా అంటే.. తెలుగులో పబ్లిసిటీ బాగా చేసుకొంటాడు. ఈసారి ఆ వాతావరణం కనిపించడం లేదు. ‘విశ్వనాథన్ అండ్ సన్స్’t సినిమా పై మాత్రం సూర్య గట్టిగా ఆశలు పెట్టుకొన్నా. ఈ యేడాదే ఆ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది.
