సందీప్ కిషన్ హీరోగా రూపుదిద్దుకొంటున్న సినిమా ‘పవర్ పేట’. చైతన్య కృష్ణ దర్శకత్వం వహించిన సినిమా ఇది. 70 ఎం.ఎం ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈరోజు సందీప్ కిషన్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా గ్లింప్స్ విడుదల చేశారు. అడవిలో సింహంతో పోలుస్తూ సందీప్ కిషన్ చెప్పిన డైలాగ్ పవర్ ఫుల్ గా కుదిరింది. ఈ డైలాగ్ తో హీరో క్యారెక్టర్ ఏమిటి, అందులో పవర్ ఏమిటన్నది అంచనా వేయొచ్చు. 1980 నేపథ్యంలో సాగే ఓ లోకల్ గ్యాంగ్ స్టర్ కథ ఇది. సందీప్ కిషన్ లుక్ ఎగ్రసీవ్ గా, మాసీగా ఉంది. తప్పకుండా తనకు ఇది మంచి కమ్ బ్యాక్ సినిమా కావొచ్చు.
గీత రచయితగా అడుగు పెట్టిన చైతన్య కృష్ణ ఆ తరవాత దర్శకుడిగా మారి తన ప్రతిభను నిరూపించుకొనే పనిలో పడ్డారు. ఆయన మాటలు చాలా షార్ప్ గా ఉంటాయి. ఈ గ్లింప్స్ లోనూ ఆ పవర్ కనిపించింది. ఈ గ్లింప్స్ లో ఆసక్తి కలిగించిన మరో అంశం.. మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్. ఈమధ్య మణిశర్మ ఇది వరకటిలా బిజీ అవుతున్నారు. ‘చెన్నై లవ్ స్టోరీ’ కి ఆయన సంగీతం అందించారు. అందులోని తొలి పాట ఇన్స్టెంట్ గా హిట్టయ్యింది. ఇప్పుడు ఈ సినిమాని తన ఖాతాలో వేసుకొన్నారు. మణికి ఇది కచ్చితంగా మంచి కమ్ బ్యాక్ అవుతుందన్న నమ్మకం కలుగుతోంది. 70 ఎం.ఎం సంస్థ క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. మది, శ్రీకర్ ప్రసాద్ లాంటి టాప్ టెక్నీషియన్స్ ఈ సినిమాకు పని చేస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా పట్టాలెక్కింది. అప్పుడే ఫస్ట్ షెడ్యూల్ కూడా పూర్తి చేశారు.