ఇక పాల్ వర్సెస్ వర్మ..!

ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ మరోసారి సీన్లోకి వచ్చారు. ఆయన ఈ సారి వర్మపై గురి పెట్టారు. తన క్యారెక్టర్‌ను కమెడియన్ గా చూపిస్తూ.. కమ్మరాజ్యంలో కడప రెడ్లు సినిమా తీశారని.. దాని విడుదల నిలిపివేయాలంటూ.. హైకోర్టులో పిటిషన్ వేశారు. సినిమాలో తన క్యారెక్టర్‌ను అవమానపరిచే విధంగా చూపించారంటున్న కేఏ పాల్‌ అంటున్నారు. ప్రతివాదులుగా కేంద్ర సమాచార మంత్రిత్వశాఖ, సెన్సార్‌ బోర్డు.. రామ్‌గోపాల్‌ వర్మ, జబర్దస్త్‌ కమెడియన్‌ రాము, సిరాశ్రీ తదితరుల్ని చేశారు. ఈనెల 29న విడుదల కానున్న కమ్మరాజ్యంలో కడపరెడ్లు విడుదల కానుంది. హైకోర్టులో శుక్రవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.

కేవలం కుల దుషణలతో.. కలెక్షన్లు పొందాలని.. ఆర్జీవీ.. దిగజారిపోయి.. సినిమా తీస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఆయన ఎంత వివాదాస్పదం చేస్తున్నా.. ఆ సినిమాకు క్రేజ్ రావడం లేదు. ఏపీ అధికార పార్టీకి చెందిన కొంత మంది ఆర్థిక సాయం చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతున్నా… రిలీజ్ విషయంలో… ఆర్జీవీ కాన్ఫిడెంట్ గా లేరంటున్నారు. అయితే.. ఏదో విధంగా.. పబ్లిసిటీ తెచ్చుకుంటున్న ఆర్జీవీ.. సినిమాను రిలీజ్ చేయాలన్న పట్టుదలతో ఉన్నారు.

ఇది బయోపిక్ కాదు.. కానీ… వ్యక్తుల్ని కించ పరిచేలా… క్యారెక్టర్లను.. కించ పరిచేలా.. పాటలు సిద్ధం చేశారు. చాలా మంది… లైట్ తీసుకున్నారు. కానీ కేఏ పాల్ మాత్రం లైట్ తీసుకోలేదు. సినిమాను ఆపించాలన్న పట్టుదలతో ఉన్నారు. ఈ సినిమాలో క్యారెక్టర్‌ను నిజంగానే కేఏ పాల్ ను ఉద్దేశించి తీస్తున్నట్లుగా… ఆర్జీవీ సోషల్ మీడియాలో ప్రకటించారు. ఇలాంటి వాటిని అనుమతి ఉండదు. కాబట్టి.. హైకోర్టు కేఏ పాల్ వినతిపై.. సానుకూలంగా స్పందించినా ఆశ్చర్యం లేదన్న వాదన వినిపిస్తోంది. కానీ దీన్ని కూడా… ఆర్జీవీ పబ్లిసిటీకి ఉపయోగించుకోగల సమర్థులు. ఏం చేస్తాడో మరి..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

దూరదర్శన్ లోగో కలర్ మార్పు… కారణం అదేనా..?

దూరదర్శన్... చాలా ఫేమస్ ఛానెల్. అప్పట్లో ఎక్కడ చూసినా దూరదర్శన్ ప్రసారాలే.అందుకే దూరదర్శన్ ఛానెల్ కు ఇప్పటికీ అసంఖ్యాకమైన ప్రేక్షకులు ఉన్నారు. ఇదంతా బాగానే ఉన్నా, సడెన్ గా దూరదర్శన్ లోగో కలర్...

అగ్రదేశాలు పక్కనపెడుతుంటే ఇండియాలోనే ఎందుకు? ఈవీఎంలే బీజేపీ బలమా..?

లోక్ సభ ఎన్నికల వేళ మరోసారి ఈవీఎంల పనితీరుపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. సాంకేతికతకు పెద్దపీట వేసే అగ్రదేశాలు సైతం ఈవీఎంలను పక్కనపెడుతుంటే ఇండియాలో మాత్రం ఎందుకు ఈవీఎంలతోనే ఎన్నికలను నిర్వహిస్తున్నారనే ప్రశ్నలు...

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close