కామెడిలో సీరియస్‌నెస్ ..! కంట్రోల్.. కంట్రోల్.. కేఏ పాల్..!

కేఏ పాల్ ఇప్పటి వరకూ.. సీరియస్‌గా కామెడీ చేశారు. కానీ ఆయన ఇప్పుడు సీరియస్ అయిపోతున్నారు. ఆయన చేతిలో వేటకత్తి ఒక్కటే తక్కువ… మద్దతివ్వకపోతే అంతు చూస్తానని… చెలరేగిపోయారు. ఒకప్పుడు మత ప్రబోధకుడిగా ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న కేఏ పాల్ ఇప్పుడు .. ఎలాంటి పేరు తెచ్చుకుంటున్నారో కానీ.. రోజు రోజుకు.. వింతగా తయారవుతున్నారు. తన పీస్ మిషన్‌కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అడ్డం పడ్డాయన్న కారణంగా.. దానికి రావాల్సిన వందల కోట్లు రావడం లేదన్న కారణంగా… ఆయన ఏకంగా ఓ రాజకీయ పార్టీ పెట్టేశారు. గత ఎన్నికలకు ముందు అభ్యర్థుల జాబితా ఉన్న సీడీ పోయిందని కనిపించకుండా పోయిన ఆయన ఈ సారి పేపర్ మీదే అభ్యర్థుల్ని రాసుకున్నారు. పోటీ చేయడానికి 30 మందిని ఎలాగో పట్టుకున్నారు. తాను నర్సాపురం నుంచి బరిలోకి దిగబోతున్నారు.

ఎన్నికల సన్నద్ధతలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో పాస్టర్ల భేటీ ఏర్పాటు చేశారు. ఇందులో ఆయన చేసిన ప్రసంగం కలకలం రేపుతోంది. పాస్టర్లనుద్దేశించి ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేసారు. తనకు మద్దతు ఇవ్వని పాస్టర్ల అంతుచూస్తానని హెచ్చరించారు. విశ్వహిందూ పరిషత్ పైనా, హిందువుల దేవుళ్లపైనా విమర్శలు చేశారు. అక్కడ చినజీయర్ స్వామికి సాష్టాంగ నమస్కారం చేసిన తెలంగాణ సీఎం కేసీఆర్ .. ఇక్కడకు వచ్చేసరికి జగన్‌కు పంపుకొడుతున్నాడని .. అనుకరించి చూపించారు. నేను అంతా దోచుకున్నాను..నువ్వు అంతా దోచుకోమని చెప్పడానికని వారు అలా చేస్తున్నారని మండిపడ్డారు. తాను సిఎం అయితే కేసీఆర్ బొప్ప తీస్తానంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ముక్కును నేలకు రాస్తానన్నారు.

కేసీఆర్ కు ఇంత ముక్కు ఉంటుందని,ఇలా సాగదీస్తాడని వ్యంగ్యంగా అంటూ, ఆయనను అనుకరించడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎలక్షన అవ్వనివ్వండి..ఒక్కొక్కడి పప్పు తీస్తా..చేపలు కడిగినట్ల కడిగేస్తా అంటూ తీవ్ర విమర్శలు చేయడంతో.. పాల్.. రాను రాను కంట్రోల్ తప్పి పోతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడని వదలలేదు. ఆయన మంచి మనిషే, నేనంటే ప్రేమే .. అంటూనే అవినీతి ఎక్కువయ్యిందని చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ పైనా విమర్శలు చేసారు. ఆయనకు సినిమాల్లో డ్యాన్సులు చేయడం రాదంటూ..పవన్ కళ్యాణ్ డ్యాన్స్ స్టైల్ ను అనుకరించి చూపించారు. ఆయన మాటల్ని సీరియస్‌గా తీసుకునే పరిస్థితి లేదు కానీ.. ఆయన మాత్రం.. రాను రాను కంట్రోల్ తప్పిపోతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మహానాడు : టీడీపీ 6 హామీలతో భవిష్యత్‌కు గ్యారంటీ !

మహానాడులో తెలుగుదేశం పార్టీ ప్రజలకు సంక్షే్మ రంగంలో ఆరు హామీలు ప్రకటించింది. భవిష్యత్ కు గ్యారంటీ పేరుతో మినీ మేనిఫెస్టోని చంద్రబాబు ప్రకటించారు. నిరుద్యోగులకు, మహిళలకు, రైతులకు టీడీపీ...

ఎన్టీఆర్‌ను వైసీపీ స్మరించుకుంది.. చంద్రబాబును తిట్టడానికైనా సరే!

ఎన్టీఆర్ అందరి మనిషి. అయితే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సహజంగానేకొంత మందికి దూరంఅవుతారు. అలా దూరమైన వారు కూడా ప్రత్యేక సందర్భాల్లో దగ్గర చేసుకోక తప్పదు. ఎన్టీఆర్‌ను అలా దగ్గర చేసుకోవాల్సిన ప...

బాలయ్య కోసం కొత్త ప్ర‌పంచం సృష్టిస్తాడ‌ట‌

అ, క‌ల్కి, జాంబిరెడ్డి చిత్రాల‌తో ఆక‌ట్టుకొన్నాడు ప్ర‌శాంత్ వ‌ర్మ‌. ఇప్పుడు హను-మాన్ రూపొందిస్తున్నాడు. తేజా స‌జ్జా క‌థానాయ‌కుడిగా న‌టించిన ఈ చిత్రం త్వ‌ర‌లో విడుద‌ల కాబోతోంది. ఈలోగా నంద‌మూరి బాల‌కృష్ణ‌తో సినిమా చేసే...

అందరికీ బెంచ్ మార్క్ బిల్డింగ్‌లు – ఏపీ జనానికి మాత్రం బటన్లు !

తెలంగాణ ప్రభుత్వం ఓ పెద్ద సెక్రటేరియట్ కట్టుకుంది. కథలు కథలుగా చెప్పుకున్నారు. ఇప్పుడు కేంద్రం పార్లమెంట్ నిర్మించింది.. అంత కంటే ఎక్కువ కథలు చెప్పుకుంటున్నారు. నిజానికి ఈ రెండు నిర్మాణాలూ అవసరం లేదని..దుబారా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close