తేజ – ‘అలివేలు’ ఎవ‌రు..?

పుట్టిన‌రోజు సంద‌ర్భంగా త‌న రెండు కొత్త సినిమాల్ని, వాటి టైటిళ్ల‌నీ ప్ర‌క‌టించేశాడు తేజ‌. ఓ సినిమా గోపీచంద్‌తో చేస్తాన‌ని, మ‌రోటి రానాతో తెర‌కెక్కిస్తాన‌ని క్లారిటీ ఇచ్చాడు. గోపీచంద్ సినిమాకి ‘అలివేలు – వేంక‌ట‌ర‌మ‌ణ‌’ పేరు ఫిక్స్ అయ్యింది. వేంక‌ట‌ర‌మ‌ణ అంటే.. గోపీచంద్‌. మ‌రి అలివేలు ఎవ‌ర‌న్న ఆస‌క్తి నెల‌కొంది. ఈ పాత్ర‌కోసం కాజ‌ల్ ఎంపిక చేశార‌ని, అయితే త్వ‌ర‌లో అధికారికంగా ప్ర‌క‌టిస్తార‌ని తెలుస్తోంది.

తేజ – కాజ‌ల్ మ‌ధ్య అనుబంధం ఉంది. ‘ల‌క్ష్మీ క‌ల్యాణం’తో కాజ‌ల్‌కి తొలి అవ‌కాశం ఇచ్చింది తేజ‌నే. కాజ‌ల్ 50 వ‌సినిమా `నేనే రాజు నేనే మంత్రి`కీ తేజ‌నే ద‌ర్శ‌కుడు. ఆ వెంట‌నే కాజ‌ల్‌ని ‘సీత‌’గా చూపించారు. ఇప్పుడు వ‌రుస‌గా మూడోసారి, మొత్తంగా నాలుగోసారి త‌న సినిమాలో కాజ‌ల్‌కి క‌థానాయిక పోస్టు ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. నిజానికి ఈ క‌థ‌లో వేంక‌ట‌ర‌మ‌ణతో పోలిస్తే, అలివేలు పాత్రే స్ట్రాంగ్‌గా ఉంటుంద‌ని, ఆ పాత్ర‌లో స్టార్ క‌థానాయిక అత్య‌వ‌స‌రం అని… అందుకే కాజ‌ల్‌ని తీసుకున్నార‌ని తెలుస్తోంది. త్వ‌ర‌లోనే కాజ‌ల్ ఎంట్రీపై ఓ అధికారిక ప్ర‌క‌ట‌న రానుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com