నెల్లూరు జిల్లాలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి విషయం హాట్ టాపిక్ గా మారింది. ఆయనకు సుప్రీంకోర్టులో కూడా ఊరట లభించకపోవడంతో బయటకు రావడం తప్ప మరో మార్గం లేకుండా పోయింది. లొంగిపోవడమో..విచారణకు వస్తానని పోలీసులకు కబురు చేసి దొరికిపోవడమో చేయాల్సిన అయన ఇంకా.. ఆజ్ఞాతంలోనే ఉన్నారు. పోలీసులు కూడా ఎప్పుడు బయటకు వచ్చినా అరెస్టు చేయవచ్చు కానీ అప్పటి వరకూ పరారీలో ఉంటే ఉండనీయండని పోలీసులు కూడా వెదుకుతున్నట్లుగా కనిపిస్తున్నారు కానీ వెదకడం లేదు.
కాకాణి గోవర్ధన్ రెడ్డి పరారీతో ఆయన పరువు అంతా నియోజకవర్గంలో పోయింది. సుప్రీంకోర్టు కూడా తప్పుదోవ పట్టించి బెయిల్ పొందాలని చేసిన ప్రయత్నాన్ని తీవ్రంగా తప్పు పట్టి పిటిషన్ కొట్టి వేయడంతో ఇప్పుడు ఎలా సమర్థించుకోవాలో తెలియని పరిస్థితి. ఇప్పుడు పోలీసుల ముందుకు రావడం తప్ప కాకాణికి మరో మార్గం లేదు. వస్తే అరెస్టు చేశారు. జైలునూ లెక్క చేయనని గతంలో చేసిన ప్రకటనలు ఉత్తుత్తవేనని.. అసలు భయం వేరే ఉందని ఈ ఆజ్ఞాతంతో వెల్లడవుతోంది. జైలు పెద్ద మ్యాటర్ కాదని హ్యాపీగా వెళ్లి రావాలని జగన్ పార్టీ నేతలకు సూచిస్తున్నారు. కాని కాకాణి ఎందుకో భయపడుతున్నారు.
ఎంత కాలం దాక్కున్నా అది ఆజ్ఞాతమే. ఏదైనా ఉన్నత న్యాయస్థానంలో బెయిల్ వస్తుందని ఆశలు పెట్టుకుంటే కనిపించకుండా పోయి.. సీక్రెట్ గా ప్రయత్నాలు చేసుకుంటే ఏదో హోప్ ఉందని అనుకుంటారు. కానీ అన్ని దారులు మూసుకుపోయాక.. కూడా అలాగే ఉంటే మాత్రం పాపం అనుకుంటారు. అయితే కాకాణి అజ్ఞాతంలో ఉండి.. తానే దోపిడీ చేయలేదని.. చాలా మంది చేస్తున్నారని.. ఆరోపణలు చేయించి..వైసీపీ మీడియాతో ప్రచారం చేయిస్తున్నారు. అదే గొప్ప ప్లాన్ అనుకుంటున్నారు.