మెగా హీరో సినిమా ఆగిపోయిందా?

‘విజేత’తో ఎంట్రీ ఇచ్చాడు… మెగా అల్లుడు క‌ల్యాణ్ దేవ్‌. ఆ సినిమా ఫ్లాప్అయ్యింది. చిరంజీవి అల్లుడు క‌దా, రెండో అవ‌కాశం కూడా ఈజీగానే వ‌చ్చింది. ‘సూప‌ర్ మ‌చ్చీ’ సినిమాతో మ‌రో ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. ఇటీవ‌లే ఫ‌స్ట్ లుక్ కూడా వ‌చ్చింది. దాదాపు 40 శాతం షూటింగ్ కూడా జ‌రిగింది. అయితే.. ఈ సినిమా ఆగిపోయింద‌న్న‌ది ఇన్‌సైడ్ వ‌ర్గాల టాక్‌. పులివాసు ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్న సినిమా ఇది. రిజ్వాన్ నిర్మాత‌. ఇచ్చిన పెట్టుబ‌డి అంతా స‌గం సినిమా పూర్త‌య్యేలోపే అయిపోయింద‌ని టాక్‌. పైగా ఈ నిర్మాత తీసిన ‘తిప్ప‌రా మీసం’ కూడా ఫ్లాప్ అయ్యింది. ఆ సినిమా ఆడితే, ఆ డ‌బ్బుల్ని – సూప‌ర్ మ‌చ్చీపై పెడ‌దామ‌నుకున్నారు. కానీ తిప్ప‌రా మీసం ఫ్లాప్ అవ్వ‌డంతో నిర్మాత చేతులెత్తేశాడ‌ని టాక్‌. చిరంజీవి అల్లుడి సినిమా ఆగిపోతే బాగోదు. పైగా తొలి సినిమా ఫ్లాప్ అయ్యి, రెండో సినిమా ఆగిపోతే, కెరీర్ లేన‌ట్టే. అందుకే ఈ సినిమాని ఎవ‌రో ఒక‌రు టేక‌ప్ చేస్తార‌ని తెలుస్తోంది. చిరంజీవి త‌ల‌చుకుంటే నిర్మాత‌ల‌కు కొద‌వా..??

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com