విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. పాన్ ఇండియా స్టోరీస్ ఓన్లీ

పాన్ ఇండియాపైపు హీరోలంతా దృష్టి పెడుతున్నారు. ఇప్పుడు కాక‌పోయినా, ఎప్పుడో ఒక‌ప్పుడు పాన్ ఇండియా కిరీటం ద‌క్కుతుంద‌ని ఆశ‌. ప్ర‌భాస్ ఇప్ప‌టికే పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. చిరంజీవి కూడా ఆ ప్ర‌య‌త్నం చేశాడు. మ‌హేష్ బాబు కూడా ఆ దిశ‌గా అడుగులేస్తున్నాడు. ఇప్పుడు విజ‌య్ దేవ‌ర‌కొండ వంతు వ‌చ్చింది. ఇక మీద‌ట తాను ఎంచుకునే క‌థ‌ల్లో ‘పాన్ ఇండియా స్ట‌ఫ్‌’ ఉండాల్సిందే అన్న‌ది త‌న‌కు తాను పెట్టుకున్న కండీష‌న్‌. ‘డియ‌ర్ కామ్రేడ్‌’ హిందీలో త‌ప్ప మిగిలిన భాష‌ల్లోనూ విడుద‌లైంది. ఫ‌లితం మాట అటుంచితే – మిగిలిన భాష‌ల్లో త‌న‌కూ కాస్త ఫోలోయింగ్ ఉంద‌న్న విష‌యం విజ‌య్‌కి అర్థ‌మైంది. మంచి సినిమా వ‌స్తే – అక్క‌డ కాసుల గ‌ల‌గ‌ల‌లు ఖాయం. అందుకే విజ‌య్ పంథా మార్చాడు. ఇటీవ‌ల ఓ సూప‌ర్ హిట్ సినిమా తీసిన ఓ ద‌ర్శ‌కుడు విజ‌య్‌కి క‌థ చెప్ప‌డానికి వెళ్తే.. ‘పాన్ ఇండియా స్టోరీ అయితే చెప్పండి.. వింటాను’ అని ముందే ఓ ష‌ర‌తు పెట్టాడ‌ట‌. దాంతో ఆ ద‌ర్శ‌కుడు క‌థ చెప్ప‌కుండానే తిరిగి వ‌చ్చేశాడు. విజ‌య్ కోసం క‌థ‌లు సిద్ధం చేస్తున్న ద‌ర్శ‌కులు ఈ విష‌యాన్నీ మైండ్‌లో పెట్టుకోవాల్సిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వావ్.. రాయల్స్ దంచేశారు..!

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ప్రతీ ఆదివారం ఓ స్పెషల్‌గా మారుతోంది. గత వారం సూపర్ ఓవర్‌దాకా సాగిన మ్యాచ్ ఊపిరిబిగపట్టి చూసేలా చేయగా.. ఈ సారి రాజస్థాన్ రాయల్స్ అసలు అసాధ్యమనుకున్న లక్ష్యాన్ని...

రెండో స్థానానికి పడిపోయిన టీవీ9, అంతర్మధనం

పదహారేళ్లుగా మొదటి స్థానంలో అప్రతిహతంగా కొనసాగుతున్న టీవీ9 రెండో స్థానానికి పడిపోయింది. మొన్నటికి మొన్న లాక్ డౌన్ సమయంలో టిఆర్పి రేటింగులో తాము మొదటి స్థానంలో ఉన్నామని, రెండవ స్థానంలో ఉన్న ఛానల్...

బిగ్ బాస్ నుండి దేవి నిష్క్రమణ, టీవీ9 పై జనాల్లో వ్యతిరేకత కూడా కారణమా ?

బిగ్ బాస్ సీజన్ 4 రికార్డు టిఆర్పీ లతో దూసుకెళుతోంది. కంటెస్టెంట్స్ జాబితా బాగోలేదు అన్న కారణంగా రెండు మూడు రోజుల తర్వాత పడిపోయిన రేటింగులు 10వ రోజు నుండి భారీగా పుంజుకున్నాయి....

పవన్ కళ్యాణ్ ఈనాడు ఇంటర్వ్యూ పై సాక్షి కొమ్మినేని ఏడుపు, ఈనాడు కి నీతులు

ఇటీవల పవన్ కళ్యాణ్ ఈనాడు పత్రికకు ఇచ్చిన సుదీర్ఘమైన ఇంటర్వ్యూ రాజకీయంగా ప్రాముఖ్యత సంతరించుకుంది. అమరావతి, జగన్ పాలన, ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల పై పవన్ కళ్యాణ్ తన అభిప్రాయాలను ఆ...

HOT NEWS

[X] Close
[X] Close