బాహుబ‌లి ఆర్‌.ఆర్‌కి సాయం చేసిందెవ‌రు?

రాజ‌మౌళి సినిమా అంటే.. సంగీత బాధ్య‌త‌లు ఎం.ఎం.కీర‌వాణి చూసుకొంటార‌న్న విష‌యం ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. అయితే… కీర‌వాణితో పాటు మ‌రో సంగీత ద‌ర్శ‌కుడి చేయి కూడా..ప‌డుతుంటుంది. ఆయ‌నే.. క‌ల్యాణి మాలిక్‌. రాజ‌మౌళి దర్శ‌క‌త్వం వ‌హించిన చాలా సినిమాల‌కు క‌ల్యాణి మాలిక్ తెర వెనుక ప‌నిచేశాడు. కొన్ని కీల‌క‌మైన ఎపిసోడ్ల‌కు ఆర్‌.ఆర్ అందించాడు. మ‌రీ ముఖ్యంగా ఛ‌త్ర‌ప‌తిలో.. ఓ రిపీటెడ్ బీజియం వ‌స్తుంటుంది. దానికి ఆర్‌.ఆర్ ఇచ్చింది క‌ల్యాణీ మాలికే. ఇప్పుడు `బాహుబ‌లి 2` విష‌యంలోనూ క‌ల్యాణీ మాలిక్ హ‌స్తం ఉంద‌ని తెలుస్తోంది. మ‌రీ ముఖ్యంగా సెకండాఫ్‌లో కొన్ని కీల‌క‌మైన స‌న్నివేశాల‌కు, ప‌తాక ఘ‌ట్టాల‌కూ క‌ల్యాణీ మాలికే ఆర్‌.ఆర్ ఇచ్చాడ‌ట‌. ఆయా స‌న్నివేశాల‌న్నీ అద్భుతంగా ఎలివేట్ అయ్యాయ‌ని టాక్‌. కానీ ఏం లాభం..? ఆ ప‌నిత‌న‌మంతా కీర‌వాణికి చేరిపోతుంది. కనీసం క‌ల్యాణి మాలిక్‌కి టైటిల్ కార్డులో అయినా క్రెడిట్ ఇస్తారో, లేదో??

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పాల్ గారి పార్టీ టిక్కెట్ కోసం రూ. 50 లక్షలు ఇచ్చాడట !

సమాజంలో కొన్ని వింతలు జరగుతూ ఉంటాయి. నమ్మాలా వద్దో తేల్చుకోలేము. కేఏ పాల్ ఎల్బీ నగర్ టిక్కెట్ ఇస్తానంటే రూ. 50 లక్షలు పాల్ కు ఇచ్చేశాడట. చివరికి పాల్ టిక్కెట్ ఇవ్వలేదని...

“ఈ ఆఫీస్” భద్రం – స్పందించిన ఈసీ

ఏపీ ప్రభుత్వం జీవోలను అన్నీ దాచిన ఈ ఆఫీస్ ను అప్ గ్రేడేషన్ పేరతో సమూలంగా మాల్చాలనుకున్న ఏపీ ప్రభుత్వానికి ఈసీ చెక్ పెట్టింది. ఈ ఆఫీస్ అప్ గ్రేడేషన్ పేరుతో...

విజయ్ సేతుపతి నుంచి ఓ వెరైటీ సినిమా

హీరోగానే కాకుండా ప్రతి నాయకుడిగానూ కనిపించి ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకున్న విలక్షణ నటుడు విజయ్‌ సేతుపతి. హీరోయిజం లెక్కలు వేసుకోకుండా పాత్రలకు ప్రాధాన్యత ఇస్తూ ఆయన ప్రయాణం సాగుతోంది. ఇదే ఆయన్ని...

చంద్రముఖి కన్నా ఘోరం… ఆర్ఎస్పీ పై సోషల్ మీడియా ఫైర్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి తీహార్ జైల్లోనున్న ఎమ్మెల్సీ కవితను కలిసిన బీఆర్ఎస్ నేత ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close