పూరి జగన్నాథ్‌తో ఓ సినిమా చేయాలన్నది కల్యాణ్‌రామ్ కల. అది ఇజం సినిమాతో నెరవేర్చుకొన్నాడు. ఈసినిమాకి నిర్మాత కూడా కల్యాణ్‌రామే. ఈ సినిమా టీజర్ వినాయక చవితి సందర్భంగా విడులైంది. టీజర్ చూస్తే… పూరి మరోసారి మాస్‌ని టార్గెట్ చేసినట్టు స్పష్టం అవుతోంది. పూరి మార్క్ పంచ్ డైలాగులు పడకపోయినా… యాక్షన్ సీన్స్, షాట్స్‌తో తన రేంజు చూపించాడు. మరీ ముఖ్యంగా కల్యాణ్ రామ్ కండల గురించి మాట్లాడుకోవాల్సిందే. తొలి షాట్‌లోనే సిక్స్ ప్యాక్ చూపించి అదరగొట్టాడు. మేకోవర్ కోసం కల్యాణ్ రామ్ ఎంత కష్టపడ్డాడో… టీజర్ చూస్తే అర్థమవుతోంది. జగపతిబాబు కూడా మరోసారి స్టైలీష్ గెటప్‌తో కనిపించాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మాణ విలువలు ప్రతీ షాట్‌లోనూ కనిపించాయి.. అనూప్ ఆర్.ఆర్ తో… హార్టు బీటు పెంచాడు.
పూరి టీజర్ అంటే డైలాగ్ ఆశిస్తారు. వినిపించిన ఒకటీ అరా డైలాగులు హిందీ, ఇంగ్లీష్‌లోనే సాగాయి. మొత్తానికి టీజర్ నుంచి ఆసక్తి రేపే ప్రయత్నం చేశాడు పూరి జగన్నాథ్. పూరి మార్క్ యాక్షన్ ఎంటర్ టైనర్కి సిద్ధపడిపోమని సంకేతాలు పంపాడు. మరి పూర్తి స్థాయిలో ఆ విన్యాసాలు చూడాలంటే దసరా వరకూ ఆగాల్సిందే. ఎందుకంటే ఇజం వచ్చేది అప్పుడే.