ఈమధ్య టీజర్లలో కూడా సినిమాకి ఉండాల్సిన బిల్డప్పులన్నీ ఇస్తున్నారు. టీజర్ చూస్తే… దాదాపుగా సినిమా రంచు రుచీ వాసనా కనిపెట్టేయొచ్చు. టీజర్ వల్ల బిజినెస్సులు మొదలవుతాయి. అంచనాలు పెరుగుతుంటాయి. టీజర్లోనే సినిమా అంతా చూపించేద్దామన్న కసికూడా కొంతమందిలో కనిపిస్తుంటుంది. సునీల్ కథానాయకుడిగా నటించిన ఈడు గోల్డెహె టీజర్ వినాయక చవితి సందర్భంగా విడుదల చేశారు. వీరూపోట్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రం త్వరలోనే విడుదల కాబోతోంది. టీజర్లో కొత్తదనం ఏమీ కనిపించలేదు. సునీల్ గత సినిమాల ఛాయల్లోనే ఈసినిమా కూడా నడుస్తుందని అర్థమైంది. నువ్వు కన్నింగా, ఇన్నోసెంటా? అని మిత్రులు అడిగితే – ఐయామ్ ఫన్నోసెంట్ అని సునీల్ చెప్పడమే ఈ టీజర్లో వినిపించిన ఏకైక డైలాగ్. సునీల్ మాస్క్లు వేసుకొని తిరుగుతుంటే ఇదేమైనా కిక్ తరహా కథేమో అనే అనుమానం రాకమానదు. టీజర్లో విషయం ఏమీ లేనట్టే. రోజూ విడుదలవుతున్న సవాలక్ష టీజర్లలో అదొకటి అనిపిస్తోంది. కనీసం సినిమాలో అయినా విషయం ఉందో, లేదో??
