కళ్లజోడుతో క‌ల్యాణ్‌రామ్ ఇమేజ్ మేకోవర్

కమర్షియల్ ఫార్ములాకు కట్టుబడి సినిమాలు చేసిన క‌ల్యాణ్‌రామ్ కంప్లీట్ లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ చేయడమే ఓ సాహసం అయితే… అందులో లుక్స్ పరంగానూ పెద్ద సాహసం చేశాడు. కొత్త ఇమేజ్ కోసం, ఇకపై కొత్త కొత్త సినిమాలు చేయడం కోసం, ఇమేజ్ మేకోవర్ కోసం క‌ల్యాణ్‌రామ్ చేసిన సినిమా ‘నా నువ్వే’. ఆల్రెడీ రిలీజైన టీజర్ చూస్తే… హీరో కళ్లజోడు పెట్టుకుని కనిపిస్తాడు. ప్రమోషనల్ వీడియోలోనూ అంతే. కంప్లీట్ సినిమాలోనూ అదే విధంగా కనిపిస్తార్ట‌. పాటల్లో తప్ప సినిమాలోని ఒక్క ఫ్రేములోనూ క‌ల్యాణ్‌రామ్ కళ్లజోడు తీయలేదట.

ఇప్పటివరకూ ఈ నందమూరి హీరో చేసినవన్నీ మాస్ సినిమాలే. అతను అంటే ప్రేక్షకుల్లో ఒక ఇమేజ్ ఏర్పడింది. ముందు ఆ ఇమేజ్ నుంచి అతణ్ణి బయటకు తీసుకొచ్చి లవ్ అండ్ రొమాంటిక్ సినిమాలో కూర్చోబెట్టాలంటే కళ్లజోడు కంపల్సరీ అని దర్శకుడు జయేంద్ర, సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ ఫిక్సయ్యార్ట‌. ప్రచార చిత్రాల్లో క‌ల్యాణ్‌రామ్‌ని కళ్లజోడుతో చూపిస్తుండటం వలన ప్రేక్షకులు అలవాటు పడుతున్నారు. ఇది సినిమాకి కచ్చితంగా హెల్ప్ అవుతుంది. ఇక సినిమా అంతా క‌ల్యాణ్‌రామ్‌ ఎలా కనిపిస్తారన్నదే కీలకం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.