టాలీవుడ్‌లో మరో సునామీ …! ప్రత్యేకహోదాపై ఫైట్ సీన్లు..!!

తెలుగు చిత్ర పరిశ్రమకు రోజులు ఏ మాత్రం కలసి రావడం లేదు. వరుసగా బ్లాక్ బస్టర్ హిట్లు వస్తూ… బాక్సాఫీస్ కళకళలాడుతూంటే… అంతర్గతంగా మాత్రం.. సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. నిన్నామొన్నటిదాకా శ్రీరెడ్డి అనే నటీమణి రాజేసిన నిప్పుతో… టాలీవుడ్… మండుతూనే ఉంది. తెలుగు సినిమాల్లో తెలుగువాళ్లకే అవకాశం కల్పించాలన్న డిమాండ్‌తో శ్రీరెడ్డి ప్రారంభించిన ఉద్యమం.. ఎక్కడెక్కడికో పోయింది. చివరికి అది మీడియా, టాలీవుడ్ మధ్య ప్రచ్ఛన్న యుద్దానికి దారి తీసింది. ఎలాగోలా ఆ విషయం సద్దుమణిగింది అనుకునేలోపలే… ఇప్పుడు ప్రత్యేకహోదా అంశం… టాలీవుడ్‌ను కార్చిచ్చులా తగులుకునే సూచనలు కనిపిస్తున్నాయి.

నిజానికి టాలీవుడ్‌ది వింత పరిస్థితి. పరిశ్రమ హైదరాబాద్ లో ఉంది. అంటే తెలంగాణ. కానీ మార్కెట్ మాత్రం ఎక్కువగా ఆంధ్రప్రదేశ్‌లో ఉంది. దీంతో రెండు రాష్ట్రాలనూ బ్యాలెన్స్ చేసుకోవాల్సిన పరిస్థితి. సినిమా వరకూ… దీన్ని డిల్ చేయడం…ఇండస్ట్రీ పెద్దలకు పెద్ద భారం కాదు. కానీ ఇతర విషయాలలో మత్రం.. ఏం చేయాలో వారికి అంతు పట్టడం లేదు. ఇటు తెలంగాణ ప్రభుత్వం పిలుపునిచ్చే కార్యక్రమాలకు నాగార్జున లాంటి కొంత మంది మద్దతు పలుకుతున్నారు. కానీ ఏపీ విషయంలో మాత్రం పట్టీపట్టనట్లు ఉంటున్నారు. దానికి కారణం.. రాజకీయాలే. ఏపీలో ప్రస్తుతం అంతా ప్రత్యేహోదా ఉద్యమమే. కర్ణాటక, తమిళనాడు హీరోలను చూపించి.. వారిలా సొంత రాష్ట్రం కోసం పోరాడటం లేదన్న ప్రచారం … హీరోలపై సామాన్యుల మనసుల్లోకి వెళ్లేలా జరుగుతోంది. హీరోలకు… ముందడుగు వేద్దామని ఉన్నా… ఉద్యమం అంతా రాజకీయంతో ముడిపడిపోయింది. హోదాకు మద్దతుగా రంగంలోకి దిగితే …తెలుగుదేశం ముద్ర వేస్తారు. బీజేపీ వ్యతిరేకమైనట్లే నిర్ణయించేస్తారు. అసలే కేంద్ర ప్రభుత్వం తమకు వ్యతిరేకంగా మాట్లాడేవారిని ఏం… చేయాలో అదే చేస్తోందన్న అభిప్రాయాలు వస్తున్న సమయంలో వారెవరూ… ఆ రిస్క్ తీసుకోవడానికి సిద్ధపడటం లేదు. తీసుకునే చాన్సులు కూడా లేవు. దీనిపై… గతంలో టీడీపీ నేత బాబూ రాజేంద్రప్రసాద్ విమర్సలు చేసినా… చంద్రబాబు అనుచిత విమర్శలు చేయవద్దని చెప్పంతో సైలెంటయిపోయారు.

ఆ తర్వత కొంత మంది సినీ ప్రముఖులు చంద్రబాబును కలసి ప్రత్యేకహోదా ఉద్యమానికి మద్దతిస్తామని చెప్పారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శివాజీ రాజా కూడా పలుమార్లు… నటులంతా హోదాకు మద్దతిస్తామని చెప్పారు. కానీ ఇంత వరకూ కార్యచరణ లేదు. దీనికి కారణం.. ఎవరూ ఆసక్తి చూపకపోవడమే. పవన కల్యాణ్ ప్రత్యేకంగా రాజకీయ పార్టీ పెట్టి ఉద్యమిస్తున్నందున… ఏమైనా హోదా కార్యక్రమాలు పెట్టుకుంటే.. అది పవన్ కల్యాణ్ చెబితేనే మెగా హీరోలు హాజరయ్య అవకాశం ఉంది. మిగతా హీరోలు పట్టించుకోరు. ఈ విషయం తెలిసి కూడా… నిర్మాత యలమంచిలి రవిచంద్.. టాలీవుడ్‌కు డెడ్‌లైన్ పెట్టేశారు. రవిచంద్ వ్యవహారం చూస్తూంటే… శ్రీరెడ్డి కన్నా ఎక్కువ రచ్చ చేసేలా ఉన్నారు. దీంతో టాలీవుడ్ ప్రముఖులు ఈ ఉపద్రవాన్ని వీలైనంత త్వరగా ముగించేయాలని ప్రయత్నిస్తున్నారు. సాధ్యమవుతుందో లేదో మరి..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ తండ్రిని కూడా వదల్లేదా..? షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అసలు రాజకీయం ఇప్పుడు స్టార్ట్ చేశారు.వైఎస్సార్ కు వారసురాలు జగన్ రెడ్డి కాదని బలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నది తను...

భయపెడుతోన్న ఎండలు…వాతావరణ శాఖ బిగ్ అలర్ట్

ఎండలతో తెలుగు రాష్ట్రాలు కుతకుత ఉడుకుతున్నాయి. బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. పగలూ, సాయంత్రం అనే తేడా లేకుండా ఉక్కపోత సెగలు పుట్టిస్తోంది.ఈ క్రమంలోనే వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. రానున్న...

ఈవీఎం, వీవీ ప్యాట్ పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు

లోక్ సభ ఎన్నికల వేళ ఈవీఎం-వీవీప్యాట్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వీవీప్యాట్‌ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను వందశాతం సరిపోల్చాలనే పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్...

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close