తార‌క‌ర‌త్న కండీష‌న్‌… స్పందించ‌ని క‌ల్యాణ్ రామ్‌!

తార‌క‌ర‌త్న ప్ర‌స్తుతం ఆసుప‌త్రిలో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఆయ‌న హెల్ట్ అప్ డేట్ వ‌చ్చి చాలా రోజులైంది. ఈ విష‌య‌మై ఎవ‌రూ అధికారికంగా నోరు విప్ప‌డం లేదు. తార‌క‌ర‌త్న అవుటాఫ్ డేంజ‌ర్ అని పైకి చెబుతున్నా – లోప‌ల ఏదో జ‌రుగుతోంద‌న్న ఫీలింగ్ నంద‌మూరి అభిమానుల్లో కూడా ఉంది. ఇప్పుడు క‌ల్యాణ్ రామ్ మాట‌లు వింటుంటే.. కొత్త అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. ఈరోజు `అమిగోస్‌`కి సంబంధించి క‌ల్యాణ్ రామ్ మీడియా ఇంట‌ర్వ్యూలు ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా తార‌క‌ర‌త్న ఆరోగ్య ప‌రిస్థితి గురించి విలేక‌రులు క‌ల్యాణ్ రామ్ ని ప్ర‌శించారు. కానీ దీనికి స‌మాధానం చెప్ప‌డానికి క‌ల్యాణ్ రామ్ ఇష్ట‌ప‌డ‌లేదు. `అవ‌న్నీ డాక్ట‌ర్లు చెబుతారు. మ‌నం చెప్ప‌కూడ‌దు` అని స‌మాధానం దాటేశారు. తార‌క‌ర‌త్న ఆరోగ్యం గురించి… క‌ల్యాణ్ రామ్ కి అప్ డేట్ లేకుండా ఉంటుందా..? కానీ ఏం చెప్పినా, ఎలా చెప్పినా అది సున్నిత‌మైన విష‌యం. అందుకే క‌ల్యాణ్ రామ్ నుంచి స‌మాధానం రాలేదు. పూర్తిగా అవుటాఫ్ డేంజ‌ర్ అనుకొంటే.. క‌ల్యాణ్ రామ్ కి ఈ విష‌యం చెప్ప‌డానికి ఎలాంటి అభ్యంత‌రాలూ ఉండ‌వు. కానీ.. ఆ స్థితి నుంచి తార‌క‌ర‌త్న బ‌య‌ట‌ప‌డి ఉండ‌క‌పోవొచ్చు. అందుకే క‌ల్యాణ్ రామ్ ఇలా స్పందించాడేమో అనిపిస్తోంది. మొత్తానికి క‌ల్యాణ్ రామ్ కామెంట్లు… తార‌క‌ర‌త్న ఆరోగ్య స్థితి గురించి కొత్త అనుమానాలూ, ప్ర‌శ్న‌లూ రేకెత్తించే విధంగానే ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

“ఆహా” ఆదాయం కన్నా నష్టాలే ఎక్కువ !

ప్రముక ఓవర్ ది టాప్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఆహా మంచి పనితీరు కనబరుస్తున్నప్పటికీ నష్టాలు మాత్రం ఆదాయం కన్నా ఎక్కువగా నమోదవుతున్నాయి. భారత కార్పొరేట్ వ్యవహారాల శాఖకు సమర్పించిన...

ఇప్పుడు “మంత్రుల టిక్కెట్లు” చింపే ధైర్యం ఉందా !?

ముగ్గురు, నలుగురు టిక్కెట్లు చినిగిపోతాయని సీఎం జగన్ కేబినెట్ సమావేశంలోనే మంత్రుల్ని హెచ్చరించారు. ఆ తర్వాతి రోజే ఎవరెవర్ని తీసేస్తారు.. ఎవరెవర్ని తీసుకుంటారు అనే లీకులు కూడా సజ్జల క్యాంప్ నుంచి...

ప్రభం”జనం”లా మారుతున్న లోకేష్ పాదయాత్ర !

లోకేష్ పాదయాత్రకు వస్తున్న జనం వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏ రోజుకారోజూ అంచనాలకు అంతనంత మంది పాదయాత్రలో పాల్గొంటున్నారు. తాజాగా గోరంట్లలో లోకేష్ పాదయాత్రలో...

ఏపీ పేరును ” వైఎస్ఆర్‌ ఏపీ ” అని మార్చేశారా !?

ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్. ఏపీ ప్రభుత్వం ఏదైనా ప్రభుత్వ విధానం అమలు చేయాలంటే... ఏపీ అని ప్రారంభిస్తుంది. అంటే ఏపీ భవన నిర్మాణ విధానం, ఏపీ పారిశ్రామిక విధానం,...

HOT NEWS

css.php
[X] Close
[X] Close