ప్రముఖ నటుడు కమల్ హాసన్ నిన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తో భేటీ అవడం చాలా ఆశ్చర్యం కలిగించింది. కానీ ఏదో వ్యక్తిగత పనిమీద ఢిల్లీ వెళ్ళిన కమల్ హాసన్ మర్యాదపూర్వకంగా ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ని కలిసారు. డిల్లీలో సినిమా షూటింగ్స్ సజావుగా జరుపుకొనేందుకు ప్రభుత్వం అన్ని విధాల సహకరిస్తే ప్రభుత్వాదాయం కూడా పెరుగుతుందని సూచించారు. సినీ పరిశ్రమని ఆకర్షించే విధంగా ప్రభుత్వం మంచి పాలసీలను రూపొందించాలని ఆయన ముఖ్యమంత్రిని కోరారు. నగరంలో సినిమా షూటింగులు జరుగుతున్నప్పుడు పోలీసులవలన ఇబ్బందులు కలగకుండా చూడాలని కోరారు. సుమారు అరగంట సేపు వారు మాట్లాడుకొన్నారు. వారిద్దరి మధ్య రాజకీయాలపై ఎటువంటి చర్చ జరగలేదని సమాచారం.