ఫ్లాష్ బ్యాక్‌: క‌మ‌ల్ హాస‌న్ సినిమా బాల‌య్య‌కి చేరిందిలా!

‘ఆదిత్య 369’.. బాల‌కృష్ణ సినీ జీవితంలో మ‌ర్చిపోలేని సినిమా. సంగీతం శ్రీ‌నివాస‌రావు ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రం గురించి ఇప్ప‌టికీ మాట్లాడుకుంటారు. బాల‌య్య ఆల్ టైమ్ ఫేవ‌రెట్ల‌లో ఈ సినిమా కూడా ఉంది. అందుకే ఈ సినిమాకి సీక్వెల్ తీయాల‌ని బాల‌య్య త‌హ‌త‌హ‌లాడుతుంటారు. నిజానికి.. ఈసినిమా బాల‌య్య చేయాల్సింది కాదు. ముందు క‌మ‌ల్ హాస‌న్ కోసం ఈ క‌థ అల్లారు సింగీతం శ్రీ‌నివాస‌రావు. అప్ప‌టికే క‌మ‌ల్ – సింగీతంది సూప‌ర్ హిట్ కాంబినేష‌న్‌. క‌మ‌ల్ అంటే సింగీతంకీ, సింగీతం అంటే క‌మ‌ల్‌కీ ప్ర‌త్యేక‌మైన అభిమానం. అందుకే.. ‘ఆదిత్య 369’ కూడా ఇదే కాంబోలో రావాలి.

క‌థ రాసుంటున్న‌ప్పుడు ఓ పాత్ర కోసం నందమూరి బాల‌కృష్ణ‌ని ఎంచుకుందాం అనుకున్నారు సింగీతం. ఆ పాత్రే.. శ్రీ‌కృష్ణ‌దేవ‌రాయులు. టైమ్ మిష‌న్‌లో ఎక్కి, శ్రీ‌కృష్ణ దేవ‌రాయుల కాలంలో వాలిపోతాడు హీరో. అక్క‌డ‌.. శ్రీ‌కృష్ణ‌దేవ‌రాయులుగా బాల‌య్య క‌నిపించాలి. ఇదీ ముందుగా అనుకున్న ప్లాను. క‌మ‌ల్ హ‌స‌న్, బాల‌య్య కాంబినేష‌న్ లో మ‌ల్టీస్టార‌ర్ గా రూపొందించాల్సిన సినిమా ఇది. అన్నీ ఓకే అయిపోయాక‌, ఎందుకో క‌మ‌ల్ హాస‌న్ ఈ సినిమా నుంచి డ్రాప్ అయ్యారు. త‌న‌కు అప్ప‌టికే చాలా సినిమాలున్నాయి. అవి పూర్త‌య్యేంత వ‌ర‌కూ ‘ఆదిత్య 369’ చేయ‌లేన‌ని సింగీతంతో చెప్పార‌ట‌. క‌మ‌ల్ వ‌చ్చేంత వ‌ర‌కూ ఈ ప్రాజెక్టు ఆప‌డం ఇష్టం లేని సింగీతం.. రెండు పాత్ర‌లూ.. బాల‌య్య‌తోనే వేయించాల‌ని ఫిక్స్ అయ్యారు. అలా.. బాల‌య్య ఈ సినిమాలో ద్విపాత్రాభిన‌యం చేయాల్సివ‌చ్చింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అప్రూవర్ గా శరత్ చంద్రారెడ్డి…కవితకు బెయిల్ దక్కేనా..?

ఢిల్లీ మద్యం కుంభకోణంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఈడీ అధికారుల వద్ద అప్రూవర్ గా మారిన శరత్ చంద్రారెడ్డి తాజాగా సీబీఐ అధికారుల ముందు కూడా అప్రూవర్...

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close