కమలహాసన్ కెరీర్లో ‘భారతీయుడు 2’ పెద్ద డిజాస్టర్. ఈ సినిమా చూసిన హార్డ్‌కోర్ ఫ్యాన్స్ కూడా “ఇది కమల్ కెరీర్లో అతిపెద్ద పరాజయం” తేల్చేశారు. శంకర్ దర్శకత్వం, మేకింగ్, టేకింగ్, కథ. కథనం.. ఇలా ఒక్క ఎలిమెంట్ కూడా ప్రేక్షకులకు పట్టలేదు. ఆశ్చర్యకరంగా ‘భారతీయుడు 2’ కంటే దారుణమైన ఫలితాన్ని ఆరు నెలల గ్యాప్ లోనే చూశారు కమల్. రీసెంట్ గా వచ్చిన థగ్ లైఫ్ సినిమా భారతీయుడు 2 కంటే డిజాస్టర్ రిజల్ట్ ఇచ్చింది.
కమలహాసన్, మణిరత్నం, ఏఆర్ రెహమాన్, శింబు, త్రిష ఇలా ఎంతో స్టార్ ఎట్రాక్షన్ వున్న ప్రాజెక్ట్ ఇది. 38 ఏళ్ల తర్వాత మణిరత్నం-కమల్ కాంబో రీ యూనియన్ కావడం మరో ప్రత్యేక ఆకర్షణ. కానీ ఈ సినిమా బాక్సాఫీసు వద్ద దారుణంగా బోల్తా కొట్టింది. తమిళనాడులో కూడా ఈ చిత్రం పూర్తిగా డిజాస్టర్‌గా నిలిచింది.
భారతీయుడు 2 ఐదు రోజుల్లో ₹116 కోట్లు గ్రాస్ సాధించగా, థగ్ లైఫ్ మాత్రం ₹80 కోట్ల వద్దే ఆగిపోయింది. ఇది కమల్ హాసన్ కెరీర్లో అతిపెద్ద డిజాస్టర్. ఈ రెండు సినిమాలు కమల్ కెరీర్‌కు ఊహించని షాకులు. ఈ రెండు కూడా బడా కాంబినేషన్లే. కానీ ఆడియన్స్ దారుణంగా తిరస్కరించారు.
మారుతున్న ప్రేక్షకులు అభిరుచుల బట్టి బిగ్ స్టార్స్ బిగ్ ఈవెంట్ సినిమాలు చేయడంపై దృష్టి పెట్టాలనే వాస్తవాన్ని ఈ ఫలితాలు నిరూపిస్తున్నాయి. ఇదే కమల్ హసన్ ‘విక్రమ్’ పాన్ ఇండియా హిట్ కొట్టారు. ఆ సినిమాలో వున్నది ఈ రెండు సినిమాల్లో మిస్ అయిన ఫాక్టర్ ఏమిటనేదానిపై రివ్యూ చేస్తే.. భవిష్యత్ లో ఎలాంటి సినిమాలు చేయాలనే క్లారిటీ దొరుకుతుంది.