ఆ కానిస్టేబుల్ హత్య ఏపీ పోలీసు వ్యవస్థ బలహీనతకు సాక్ష్యం !

నంద్యాలలో ఓ హెడ్‌ కానిస్టేబుల్‌ను రౌడిషీటర్లు దారుణంగా హత్య చేసిన ఘటన ఇప్పుడు పోలీసు వర్గాల్లో చర్చనీయాంశమమవుతోంది. విధి నిర్వహణలో కటువుగా ఉండే హెడ్ కానిస్టేబుల్ రోడ్‌పై ఒంటరిగా కనిపిస్తే ఆరుగురు రౌడి షీటర్లు అంతకంటే చాన్స్ ఏముంటుందని కొట్టుకుంటూ తీసుకుపోయి.. కిడ్నాప్ చేసి.. అత్యంత దారుణంగా హతమార్చిపోయారు. కానిస్టేబుల్ అన్న కారణంగానే హత్యకు గురయ్యాడు. పోలీసు కాబట్టే చంపేశారు.

ఎవరికైనా పోలీసులంటే కాస్త భయం ఉంటుంది. రౌడీషీటర్లకైతే ఇంకా ఎక్కువ ఉండాలి. ఉండేది కూడా. ఎక్కడైనా పోలీసులు కనిపించినా వంగి వంగి దండాలు పెడతారు. ఎందుకంటే పోలీసులు కన్నెర్ర చేస్తే తమ బతుకెలా ఉంటుందో వాళ్లకి తెలుసు. అయితే ఇది అప్పుడు.. ఇప్పుడు కాదు.. ఇప్పుడు రౌడీషీటర్లు నేరుగా పోలీసులను మర్డర్ చేస్తున్నారు. ఏదో ఓ రాజకీయ అండ వెదుక్కుని తమను ఎమీ చేయలేని స్థితికి రౌడీలు చేరిపోయారు. అందుకే పోలీసుల్నీ హత్య చేస్తున్నారు. కానీ పోలీసు వర్గాలు నిశ్చేష్టులుగా ఉండిపోతున్నాయి.

ఇప్పుడు నేరుగా హత్య చేశారు కానీ.. పోలీసులపై కొన్నాళ్లుగా వివిధ ప్రాంతాల్లో దాడులు జరుగుతూనే ఉన్నాయి. అధికార పార్టీ ముసుగులో అనేక మంది దాడులు చేస్తూనే ఉన్నారు. కానీ ఎవరిపైనా చర్యలు తీసుకోలేకపోయారు. ఆ ఉదాసీనతే ఇప్పుడు ఈ పరిస్థితికి తీసుకు వచ్చింది. శాంతిభద్రతలను పక్కన పెట్టి కేవలం రాజకీయ పార్టీ కి పని చేయడం.. ఆ రాజకీయ పార్టీతో సన్నిహితంగా ఉండే అసాంఘిక శక్తుల జోలికి వెళ్లలేకపోవడం వంటి వాటితో పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైపోయింది. ఇప్పుడు అదే ఆ వ్యవస్థ పరువు పోయేలా చేస్తోంది. సొంత కానిస్టేబుల్‌ను చంపినా.. నిందితుల్ని కూడా వెంటనే పట్టుకోలేని స్థితికి వెళ్లిపోయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్‌కు బీజేపీ అండ లేదని చేతల్లో చూపిస్తేనే నమ్ముతారు లక్ష్మణ్ జీ !

రెండు రోజులుగా ఏపీలో పర్యటిస్తున్న బీజేపీ పార్లమెంటరీ బోర్డు మెంబర్ డాక్టర్ కె లక్ష్మణ్.. తజన్గ సర్కార్‌పై ఘాటుగా విమర్శలు చేస్తున్నారు. అమరావతికే తమ మద్దతంటున్నారు. అభివృద్ది లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిపోయిందని...

“ఉద్యమ” పంచాయతీ పెట్టుకున్న కేటీఆర్ !

తెలంగాణ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటారు. చాలా మందికి సాయం చేస్తూంటారు. విపక్షాలతో పాటు మోదీపైనా విమర్శలకు వాడుకుంటూ ఉంటారు. అయితే రాజకీయ పరమైనవే అయినా... విధానపరంగా ఆ...

ఉత్తదే.. ఆ ప్రచారాన్ని ఖండించిన నాగార్జున …!

విజయవాడ ఎంపీ స్థానానికి పోటీ చేసే అంశంపై వైసీపీ ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్‌కు నాగార్జున ఇంచ్ కూడా కదల్లేదు. అలాంటి ఆలోచనలు.. ఆశలు .. పెట్టుకోవడం లేదని తేలిగ్గా తీసుకున్నారు. తన కొత్త...

ఆ లెక్కన కేసీఆర్ కూడా ” యాంటీ వైసీపీ గ్యాంగ్‌’లో చేరినట్లేనా సజ్జల !?

తెలంగాణ మంత్రులు వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వాన్ని.. జగన్ పరిపాలనను అవకాశం దొరికిన ప్రతీ చోటా..ఇంకా చెప్పాలంటే అవకాశం సృష్టించుకుని మరీ విమర్శలు చేస్తున్నారు. సీఎం కేసీఆర్ కూడా నేరుగా ఏపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. హరీష్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close