ఫ‌స్టాఫ్ లాక్ చేసిన అనిల్ రావిపూడి

ఎఫ్ 3తో.. త‌న విజ‌య యాత్ర‌ని దిగ్విజ‌యంగా కొన‌సాగించాడు అనిల్ రావిపూడి. ఇప్పుడు త‌న దృష్టంతా బాల‌కృష్ణ సినిమాపైనే ఉంది. అనిల్ రావిపూడితో బాల‌య్య సినిమా ఓకే అయిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం గోపీచంద్ మ‌లినేని తో ఓ సినిమా చేస్తున్నాడు బాల‌య్య‌. అది అవ్వ‌గానే అనిల్ రావిపూడి సినిమా మొద‌లెట్టేస్తారు. దానికి ఇంకొంచెం స‌మ‌యం ఉంది. అందుకే స్క్రిప్టు ని కాస్త బిగించి రాయ‌డానికి అనిల్ రావిపూడికి ఇంకాస్త టైమ్ దొరికింది. ప్ర‌స్తుతం అనిల్ రావిపూడి వైజాగ్‌లో ఉన్నారు. ఆయ‌న బాల‌య్య సినిమాకి సంబంధించిన ఫ‌స్టాఫ్ ని పూర్తి చేశారు. బాల‌య్య‌కు డైలాగ్ వెర్ష‌న్‌తో స‌హా వినిపించి – ఫ‌స్టాఫ్‌ని లాక్ చేసేశాడు అనిల్ రావిపూడి, ఈనెలాఖ‌రుకి సెకండాఫ్‌కి కూడా లాక్ చేసి, ఆ త‌ర‌వాత న‌టీన‌టులు, ఇత‌ర టెక్నీషియ‌న్స్ ని ఫైన‌ల్ చేసుకుంటారు.

అనిల్ రావిపూడి ఇప్ప‌టి వ‌ర‌కూ ఎంట‌ర్‌టైన్‌మెంట్ సినిమాలే తీశాడు. తొలిసారి పూర్తి యాక్ష‌న్ డ్రామా చేయ‌బోతున్నాడు. ఈ క‌థ‌లో ఎంట‌ర్‌టైన్‌మెంట్ కి స్కోప్ చాలా త‌క్కువ‌. అంటే… దాదాపుగా త‌న‌ది కాని జోన‌ర్‌ని ట్రై చేస్తున్న‌ట్టే. ప‌టాస్‌, సుప్రీమ్‌, రాజా ది గ్రేట్ సినిమాల్లో యాక్ష‌న్ సీన్లు బాగానే డీల్ చేశాడు అనిల్ రావిపూడి. అయితే… త‌న సినిమా అన‌గానే ఫ‌న్ మాత్ర‌మే గుర్తొస్తుంది. ఈసారి మాత్రం త‌న‌లో యాక్ష‌న్ ఏస్థాయిలో ఉందో చూపించే ఛాన్స్ దొరికింది. పైగా బాల‌య్య హీరో. మ‌రి అనిల్ రావిపూడి త‌న‌ని తాను ఇంకెంత కొత్త‌గా ఆవిష్క‌రించుకొంటాడో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close