కేసీఆర్ కన్నా మేఘానే టార్గెట్ చేస్తున్న షర్మిల!

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల పాదయాత్ర వాయిదా వేసుకుని మరీ గవర్నర్ తమిళిసైను కలిశారు. ఓ పెద్ద ఫైల్ తీసుకెళ్లారు. అందతా కాళేశ్వరంలో జరిగిన అవినీతి అని.. గవర్నర్‌కు ఆధారాలిచ్చామని చెప్పారు. అవన్నీ కాళేశ్వరరం కాంట్రాక్టర్ మేఘా కృష్ణారెడ్డి అవినీతి వ్యవహారమని చెబుతున్నారు. చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నామని ఆమె చెబుతున్నారు. మేఘా కృష్ణారెడ్డిని ఆమె టార్గెట్ చేయడం ఇదే మొదటి సారి కాదు. గత రెండు నెలలుగా ఇదే పరిస్థితి. ఏ సందర్బం వచ్చినా ఇదే విధంగా దాడి చేస్తున్నారు.

మేఘా కృష్ణారెడ్డి పదమూడు వేల కోట్ల పన్నులు ఎగ్గొట్టారని ఐటీ ఇంటలిజెన్స్ నివేదిక ఇచ్చిందని ప్రకటించారు. కాళేశ్వరం కూడా మేఘా వల్లే మునిగిపోయిందన్నారు. ఇలా ప్రతి అంశంలోనూ మేఘా నే టార్గెట్ చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఇటీవలి కాలంలో కేసీఆర్ కన్నా ఆమె ఎక్కువగా మేఘా కృష్ణారెడ్డినే ప్రత్యర్థిగా చూస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. అయితే ఇలా ఎందుకు చేస్తున్నారన్నది కొంతమందికి అర్థం కావడం లేదు. మేఘా కృష్ణారెడ్డి .. ఇద్దరు పాలకులకు ఎంతో ఆప్తులు. రివర్స్ టెండర్లలో ఏపీలో అన్ని చోట్లా మేఘానే కాంట్రాక్టులు దక్కించుకుంది.

ఇప్పుడు మేఘానే ఎందుకు షర్మిల టార్గెట్ చేస్తున్నారంటే.. దాని వెనుక రాజకీయం ఉందన్న అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది. రాజకీయం అంటే చిన్న విషయం కాదు. ఖర్చుతో కూడుకున్నది. పైగా షర్మిల పాదయాత్ర చేస్తున్నారు. మేఘాను టార్గెట్ చేస్తే పార్టీ ఫండ్ వస్తుందన్న ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నారని భావిస్తున్నారు. అయితే మేఘా వైపు నుంచి ఎలాంటి సంకేతాలు రాకపోవడంతో విపరీతంగా ఆరోపణలు చేస్తున్నారని.. ఫిర్యాదులు చేస్తున్నారని అంటున్నారు. నిజమేమిటో కానీ.. రాజకీయాల్లో ఎవరినైనా ప్రత్యేకంగా టార్గెట్ చేస్తే ఇలాంటి అనుమానాలే వస్తూ ఉంటాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేసీఆర్ అంచనాల్ని అందుకోలేకపోయిన ప్రశాంత్ కిషోర్ !

ఐ ప్యాక్ అంటే తిరుగులేని పొలిటికల్ స్ట్రాటజీ కంపెనీ. దేశంలో ఉన్న ప్రతీ పార్టీ సేవలు అందుకోవాలని అనుకుంటుంది. ఐ ప్యాక్ కన్నా పీకే పైనే అందరికీ గురి. బెంగాల్ తర్వాత తాను...

సోషల్ మీడియాలోనూ దారి తప్పిన ఏపీ రాజకీయాలు !

తమలపాకుతో నువ్వకొటి అంటే.. తలుపు చెక్కతో నేను రెండు అంటా అన్నట్లుగా ఏపీలో రెండు పార్టీల నేతలూ.. సోషల్ మీడియా కార్యకర్తలు చెలరేగిపోతున్నారు. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే రెండు పార్టీలకు...

మిడిల్ డ్రాప్ … దసరాకు కేసీఆర్ జాతీయ పార్టీ లేనట్లే !

ఇతర రాష్ట్రాల నుంచి సీనియర్ నతలు వస్తున్నారు. కేసీఆర్ నాయకత్వం దేశానికి అవసరం అని పొగుడుతున్నారు. వెళ్తున్నారు. ఇక టీఆర్ఎస్ నేతల సంగతి చెప్పాల్సిన పని లేదు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి ఎప్పుడు...

ఏపీలో పోటాపోటీ పోస్టర్లు .. భారతీ పే !

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు గోడలకెక్కుతున్నాయి. గతంలో చంద్రబాబు వియ్ డోంట్ నీడ్ ఎన్టీఆర్ అని అన్నారంటూ... ఓ ఇంగ్లిష్ పత్రికలో వచ్చిన వార్తను పెద్ద పెద్ద పోస్టర్లు చేసి వైసీపీ నేతలు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close