మీడియా వాచ్ : కులాల మధ్య చిచ్చుపెట్టి చానళ్లు ఎంత సంపాదించుకుంటాయి ?

రాజకీయ మీడియా వలువలు వదిలేసింది. విలువ కట్టుకుని.. వసూలు చేసుకుని నగ్నంగా ఊరేగుతోంది. కులాల పేర్లు పెట్టి ఆ రెండు కులాలు కొట్లాడుకుంటున్నాయని ప్రచారం చేస్తోంది. చర్చలు నిర్వహిస్తోంది. ఇలాంటి పరిస్థితి చూసి .. ఇదేం దౌర్భాగ్యం అనుకునే పాతతరం జర్నలిస్టులు మాత్రం అనుకుంటున్నారు. కొత్త తరం జర్నలిస్టులు మాత్రం అలా వేసినందుకు ఇంత ప్యాకేజీ వచ్చిందని చెప్పుకుంటున్నారు.

మీడియా సంస్థల్లో కొన్ని ప్రమాణాలు చాలా కాలంగా ఉన్నాయి. ఆ ప్రకారం.. కులాల పేర్లు రాయరు. ఓ సామాజికవర్గం.. ప్రధాన సామాజికవర్గం.. అగ్రవర్ణం ఇలా రాస్తారు. ఎలాంటి విద్వేషాలు లేని వార్తల్లో.. రాజకీయ సమీకరణాల గురించి చెప్పాలనుకున్నప్పుడు కూడా ఇదే ఫార్ములా పాటిస్తారు. కానీ ఇప్పుడు ఆ విలువలన్నింటినీ కొన్ని చానళ్లు వదిలేశాయి. ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని పాలకుల నుంచి వచ్చే ఆదేశాల మేరకు రంగంలోకి దిగిపోయారు. రెండుకులాల పేర్లు పెట్టి రెచ్చగొట్టేలా స్టోరీలు వేసేశారు

అసలు గోరంట్ల ఎపిసోడ్‌లో కులం ఎక్కడ ఉంది..? ఆయన చేసిన పనికి.. కులం ఎక్కడ ఉంది . తనను తను రక్షించుకోవడానికి మరో కులాన్ని తిట్టాడు ఎంపీ. అసలు ఆ ఏంపీ ప్రవర్తనపై ఎలాంటి చర్చ పెట్టకుండా.. ఆయనకు మద్దతుగా కొంత మంది కులాల్ని వెంటేసుకుని ఇతర కులాలపై దాడికి పాల్పడుతున్నట్లుగా సమర్థించడం దేనికి సంకేతం ?. ఈ విషయాన్ని కులాల ఉచ్చులోకి లాగడానికి పై నుంచి సలహాలు రావడంతోనే ఇలా స్టోరీలు వేశారని ఆయన చానళ్లలో ఉన్న అందరికీ తెలుసు. ఈ రోజుల్లో ఇదంతా కామనేనని.. న్యూస్ అంటే ప్రజలకు మేలు చేయడమే కాదు.. చిచ్చు పెట్టేది కూడానని చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.

ఇలా న్యూస్ చానళ్లు నడిపి.. ప్రజల మధ్య విద్వేషాలు పెంచి.. తాము సంపాదించుకుని.. హాయిగా బతకితే చాలు అనుకుంటున్నాయి యాజమాన్యాలు. అందులే ఇప్పుడు మీడియాలో వలువలు వదిలేసి మరీ విలువ లెక్క కట్టుకుని వసూలు చేసుకుని బతికేస్తున్నారని విమర్శించక తప్పడంలేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

5 నెలల్లో రూ. 40వేల కోట్లు గల్లంతయ్యాయట !

ఏపీ బడ్జెట్ నిర్వహణ గురించి ప్రత్యేకంగా సర్టిఫికెట్లు ఇవ్వాల్సిన పని లేదు. బడ్జెట్ వ్యవహారం ఇప్పుడు కూడా నడుస్తోంది. ఈ ఐదు నెలల్లో రూ. నలభైవేల కోట్లకుపైగా లెక్కలు తెలియడం లేదని గగ్గోలు...

‘గాడ్ ఫాద‌ర్‌’ హిట్‌… నాగ్ హ్యాపీ!

ఈ ద‌స‌రాకి మూడు సినిమాలొచ్చాయి. గాడ్‌ఫాద‌ర్‌, ది ఘోస్ట్‌, స్వాతిముత్యం. గాడ్ ఫాద‌ర్‌కి వ‌సూళ్లు బాగున్నాయి. స్వాతి ముత్యంకి రివ్యూలు బాగా వ‌చ్చాయి. ది ఘోస్ట్ కి ఇవి రెండూ లేవు....

వైసీపీ సర్పంచ్‌ల బాధ జగన్‌కూ పట్టడం లేదు !

వారు వైసీపీ తరపున సర్పంచ్‌లుగా ఎన్నికయ్యారు. ప్రత్యర్థి పార్టీనో.. సొంత పార్టీలో ప్రత్యర్థుల్నో దెబ్బకొట్టడానికి పెద్ద ఎత్తున ఖర్చు పెట్టుకున్నారు. గెలిచారు. కానీ ఇప్పుడు వారికి అసలు సినిమా కనిపిస్తోంది. వీధిలైట్...

చిరంజీవి ఫ్యాన్స్ Vs బ్రాహ్మణ సంఘాలు..

చిరంజీవి ఫ్యాన్స్ Vs బ్రాహ్మణ సంఘాలు.. ఇప్పుడు బంతి... వాళ్లిద్ద‌రి చేతికీ చిక్కింది. ఇక ఆడుకోవ‌డ‌మే త‌రువాయి. అవును... అల‌య్ బ‌ల‌య్‌... కార్య‌క్ర‌మంలో చిరంజీవి - గ‌రిక‌పాటి మ‌ధ్య ఏం జ‌రిగిందో తెలిసింది. చిరుని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close