ఎపిక్ ల‌వ్ స్టోరీ: ‘ఏయ్ పిల్లా’

ర‌వితేజ ఇంటి నుంచి ఓ హీరో వ‌స్తున్నాడు. త‌నే మాధ‌వ్ భూప‌తి రాజు. ర‌వితేజ సోద‌రుడు ర‌ఘు త‌న‌యుడే ఈ మాధ‌వ్. త‌న ఎంట్రీ కోసం చాలా కాలం నుంచి ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. ఎన్నో క‌థ‌ల్ని ఒడ‌గ‌ట్టిన త‌ర‌వాత‌… ఓ క‌థకి ఓకే చెప్పాడు. అదే `ఏయ్ పిల్లా`. ఎపిక్ ల‌వ్ స్టోరీ అనేది ఉప‌శీర్షిక ఈ సినిమాతో లుధీర్ బై రెడ్డి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ‘సినిమా చూపిస్త మావ‌’, ‘నేను నాన్న బోయ్‌ఫ్రెండ్స్‌’, ‘జ‌వాన్’ చిత్రాల‌కు స‌హాయ‌కుడిగా ప‌నిచేశాడు లుధీర్‌. ఈ చిత్రాన్ని న‌ల్ల‌మ‌ల‌పు బుజ్జి నిర్మిస్తున్నారు. మ‌రో ద‌ర్శ‌కుడు ర‌మేష్ వ‌ర్మ ఈ చిత్రానికి స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తుండ‌డం విశేషం.

మిస్ ఇండియా కాంటెస్ట్‌లో ర‌న్న‌ర‌ప్‌గా నిలిచిన రూబ‌ల్ షికావ‌త్ ఈ సినిమాతో క‌థానాయిక‌గా ఎంట్రీ ఇస్తోంది. ఈ రోజు ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ని విడుదల చేశారు. పోస్ట‌ర్ చూస్తుంటే, మాధ‌వ్ – రూబ‌ల్ కెమిస్ట్రీ కుదిరిన‌ట్టే క‌నిపిస్తోంది. టెక్నిక‌ల్ టీమ్ సపోర్ట్ కూడా గ‌ట్టిగానే ఉండేలా చూసుకొన్నారు. మిక్కీ జే.మేయ‌ర్, శ్యామ్ కె.నాయుడు, చిన్నా ఈ టీమ్‌లో ఉన్నారు. ప‌ల్లెటూరి నేప‌థ్యంలో సాగే క‌థ ఇది. త్వ‌ర‌లోనే షూటింగ్ మొద‌లెడ‌తారు. ఈ యేడాదే విడుద‌ల‌చేసే ప్ర‌య‌త్నాల్లో ఉన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేసీఆర్ అంచనాల్ని అందుకోలేకపోయిన ప్రశాంత్ కిషోర్ !

ఐ ప్యాక్ అంటే తిరుగులేని పొలిటికల్ స్ట్రాటజీ కంపెనీ. దేశంలో ఉన్న ప్రతీ పార్టీ సేవలు అందుకోవాలని అనుకుంటుంది. ఐ ప్యాక్ కన్నా పీకే పైనే అందరికీ గురి. బెంగాల్ తర్వాత తాను...

సోషల్ మీడియాలోనూ దారి తప్పిన ఏపీ రాజకీయాలు !

తమలపాకుతో నువ్వకొటి అంటే.. తలుపు చెక్కతో నేను రెండు అంటా అన్నట్లుగా ఏపీలో రెండు పార్టీల నేతలూ.. సోషల్ మీడియా కార్యకర్తలు చెలరేగిపోతున్నారు. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే రెండు పార్టీలకు...

మిడిల్ డ్రాప్ … దసరాకు కేసీఆర్ జాతీయ పార్టీ లేనట్లే !

ఇతర రాష్ట్రాల నుంచి సీనియర్ నతలు వస్తున్నారు. కేసీఆర్ నాయకత్వం దేశానికి అవసరం అని పొగుడుతున్నారు. వెళ్తున్నారు. ఇక టీఆర్ఎస్ నేతల సంగతి చెప్పాల్సిన పని లేదు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి ఎప్పుడు...

ఏపీలో పోటాపోటీ పోస్టర్లు .. భారతీ పే !

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు గోడలకెక్కుతున్నాయి. గతంలో చంద్రబాబు వియ్ డోంట్ నీడ్ ఎన్టీఆర్ అని అన్నారంటూ... ఓ ఇంగ్లిష్ పత్రికలో వచ్చిన వార్తను పెద్ద పెద్ద పోస్టర్లు చేసి వైసీపీ నేతలు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close