రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న చంద్రబాబు- మోడీ భేటీ

తాజాగా చంద్రబాబు నాయుడు బిజెపి కేంద్ర అధినాయకత్వంతో భేటీ కావడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తుంది. శరవేగంగా రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. శనివారం నాడు చంద్రబాబు నాయుడు మోడీతో కొద్ది నిమిషాల పాటు చర్చలు జరపడం, ఆ తరువాత ఆదివారం నాడు లంచ్ మీటింగ్ సందర్భంగా జగన్ మోడీ చర్చలు జరపడం రాజకీయ వర్గాలలో ఆసక్తికర చర్చకు దారితీసింది. వివరాల్లోకి వెళ్తే..

మోడీ చంద్రబాబు మీటింగ్ నేపథ్యం, చర్చ:

చంద్రబాబు నాయుడు బిజెపితో కలిసి 2014లో ఎన్నికల్లో పోటీ చేశారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయకుండా ఈ కూటమికి మద్దతు పలికారు. ఈ కూటమి 2014లో అధికారాన్ని చేపట్టింది. అయితే అధికారం చేపట్టిన అనంతరం టిడిపి బీజేపీల మధ్య గ్యాప్ పెరుగుతూ వచ్చింది. ఇదే సమయంలో వైఎస్ఆర్సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా పావులు కదిపి బిజెపి అధిష్టానానికి అనధికారికంగా పూర్తి మద్దతు ప్రకటించారు. ఒకానొక సమయంలో చంద్రబాబు నాయుడు కి సంబంధించిన టిడిపి నేతలు అమిత్ షా కాన్వాయ్ పై రాళ్లు రువ్వే వరకు టిడిపి బిజెపిల మధ్య గ్యాప్ పెరుగుతూ వచ్చింది. దీంతో బిజెపి అనధికారికంగా 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి కి మద్దతు ఇచ్చిందని , ఈ కారణంగానే వైఎస్ఆర్సిపి బంపర్ మెజారిటీతో అధికారాన్ని చేపట్టిందని ఒక విశ్లేషణ వినిపించింది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న రీతిలో చంద్రబాబు ఆ పిదప బిజెపితో సంబంధాలు పునరుద్ధరించుకునే ప్రయత్నం చేసినప్పటికీ బిజెపి పార్టీ చంద్రబాబును ఏమాత్రం పరిగణలోకి తీసుకోలేదు. ఈ నేపథ్యంలో శనివారం నాడు చంద్రబాబు కొద్ది నిమిషాల పాటే అయినప్పటికీ మోడీతో చర్చలు జరపడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి కలిగించింది.

మోడీ చంద్రబాబు భేటీ పై విమర్శలు గుప్పిస్తూ క్లారిటీ ఇచ్చిన సజ్జల

అయితే చంద్రబాబు మోడీల మధ్య ఎటువంటి చర్చ జరిగింది అన్న విషయంపై సామాన్య ప్రజానీకానికి , మీడియాకు పెద్దగా స్పష్టత రాలేదు. అయితే, వైఎస్ఆర్సిపి ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి మోడీ చంద్రబాబు ల తాజా భేటి పై విమర్శలు గుప్పించారు. విమర్శలు గుప్పించడంతోపాటు ఈ భేటీ ముఖ్య ఉద్దేశం ఏమిటో కూడా ఆయన స్పష్టం చేశారు. బిజెపి ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల కంటే కూడా తెలంగాణ రాజకీయాలపై ప్రస్తుతం ఎక్కువ ఫోకస్ పెడుతున్న నేపథ్యంలో, తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ ని గద్దె దింపి బిజెపి పార్టీని అధికారంలోకి ఎక్కించడానికి తమ వంతు సహాయాన్ని తాము చేస్తామని చంద్రబాబు నాయుడు పూర్తిస్థాయిలో బిజెపి కి మద్దతు పలికాడని, మొత్తానికి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బిజెపి కలిసి 2024 లో ఏపీ లో పోటీ చేయడానికి ప్రాతిపదికను చంద్రబాబు నాయుడు సిద్ధం చేస్తున్నారని సజ్జల వ్యాఖ్యానించారు. అయితే ఈ మీటింగ్ తమకు ఎటువంటి భయాన్ని కలిగించడం లేదని ఆయన ముక్తాయించారు.

భేటిలో జరిగిన చర్చపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర విశ్లేషణ

నిజానికి ఆంధ్రప్రదేశ్లో తిరిగి చంద్రబాబు నాయుడు పార్టీ బలపడడం బిజెపికి ప్రస్తుతానికి ఇష్టం లేదు. కర్ణాటకలో జనతాదల్ పార్టీని మూడవ స్థానానికి నెట్టి తాము రెండవ స్థానానికి వచ్చినట్లుగా, మహారాష్ట్రలో శివసేనను కిందకు నెట్టి తాము దాని పై స్థానానికి వచ్చినట్లుగా, ఆంధ్రప్రదేశ్లో సైతం టిడిపి కంటే పై స్థానాన్ని ఆక్రమించుకోవాలని బిజెపి కలలు కంటోంది. వినడానికి ఇప్పుడు ఇది హాస్యాస్పదంగా కనిపించినప్పటికీ, ఇటువంటి అసాధ్యాన్ని కర్ణాటక , మహారాష్ట్రలో సుసాధ్యం చేసిన బిజెపి ఆంధ్రప్రదేశ్లో సైతం 2029 నాటికి. దీనిని సుసాధ్యం చేయగలదనడం లో సందేహం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎంతవరకో ఎందుకు, 2019 కి ముందు పెద్దగా ఉనికిలో లేని బిజెపి ఇవాళ తెలంగాణలో రెండవ స్థానాన్ని స్పష్టంగా ఆక్రమించుకుందని వారు గుర్తు చేస్తున్నారు. అయితే ఇదే జరిగితే తన పార్టీ భవిష్యత్తు పూర్తిగా నాశనం అవుతుందని గ్రహించిన చంద్రబాబు ముందుగానే జాగ్రత్త పడి పావు లు కదుపుతున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.

మోడీకి చంద్రబాబు బంపర్ ఆఫర్:

ప్రస్తుత పరిస్థితిని ఆకళింపు చేసుకున్న చంద్రబాబు, తెలంగాణ లో 2023లో అధికారం చేపట్టడం కోసం బిజెపి ఆతృతను గ్రహించి, తెలంగాణలో కేసీఆర్ని గద్దె దింపడానికి తమ పార్టీ వైపు నుండి, తమ ఆధీనంలో ఉన్న మీడియా వైపు నుండి బిజెపికి పూర్తిస్థాయి మద్దతు ప్రకటిస్తామని ఆఫర్ చేసినట్లుగా తెలుస్తోంది. దీనికి ప్రతిఫలంగా ఆంధ్రప్రదేశ్ లో బిజెపి జనసేన కూటమిలోకి తమను కూడా చేర్చుకోవాలని చంద్రబాబు మోడీని కోరినట్లుగా తెలుస్తోంది. అయితే మోడీ మాత్రం ముందు తెలంగాణలో మద్దతు ఇవ్వండి, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల సంగతి తెలంగాణ ఫలితాల అనంతరం చర్చించుకుందాం అని సూచించినట్లు తెలుగుదేశం పార్టీ కీలక నేతలు కొందరు ఆంతరంగికులతో చర్చ ల సందర్భంగా బయట పెట్టినట్లు సమాచారం.

త్యాగాలకు టిడిపి సిద్ధం అని మోడీతో భేటీలో విస్పష్టంగా వివరించిన చంద్రబాబు?

అయితే వైఎస్ఆర్సిపి తో కేంద్ర బిజెపికి ఉన్న సంబంధాలను దృష్టిలో పెట్టుకుని ఆ సంబంధాలను బ్రేక్ చేసి తన పార్టీతో బిజెపి పొత్తులోకి రావాలంటే తమ వైపు నుండి ముందడుగు ఉండాలని భావించిన చంద్రబాబు తమ పార్టీ వైపు నుండి అవసరం అయితే త్యాగాలు చేయడానికి కూడా సిద్ధం అని మోడీతో స్పష్టంగా సూచించినట్లు సమాచారం. గతంలో వైఎస్ఆర్సిపి వ్యతిరేక ఓటు చీలనివ్వను అని పవన్ కళ్యాణ్ ప్రకటించిన ఉద్దేశానికి దగ్గరగానే చంద్రబాబు వ్యవహార శైలి ఉండబోతుందని సమాచారం. అవసరమైతే జనసేన తో ముఖ్యమంత్రి పదవిని రెండున్నర ఏళ్ల పాటు షేర్ చేసుకోవడానికి చంద్రబాబు సంసిద్ధత వ్యక్తం చేసినట్లు, ఈ విషయాన్ని స్పష్టంగా మోడీతో భేటీలో వివరించినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు పేరు ఎత్తితేనే ఒంటికాలి తో లేచే సోము వీర్రాజు సైతం తన బాణీ మార్చి చంద్రబాబు విజినరీ అంటూ తాజాగా పొగడ్తలు గుప్పించడం ఈ ప్రచారానికి బలాన్ని చేకూరుస్తోంది.

ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రానున్న రోజుల్లో పెను మార్పులు సంభవించి అవకాశం కనిపిస్తుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రియల్లీ గ్రేట్..50 మందిని కాపాడిన బాలుడు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాద ఘటనలో ఓ బాలుడి సాహసం 50మందిని ప్రాణాపాయం నుంచి కాపాడింది. భారీగా మంటలు ఎగిసిపడటంతో ప్రమాదంలో చిక్కుకొని ఆపన్నహస్తం కోసం...

పిఠాపురంపైకి అసాంఘిక శక్తుల దండయాత్ర !

ఒక్కడిని ఒక్కరంటే ఒక్కర్ని ఓడించడానికి అన్ని రకాల మాఫియాల్ని రంగంలోకి దించుతోంది వైసీపీ. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టడమే కాదు.. నకిలీ మద్యంతో ముంచెత్తుతున్నారు. బయట నుంచి ఎర్ర చందనం స్మగ్లర్లు,...

టీఆర్ఎస్ ఎక్కడుంది ? ఇప్పుడున్నది బీఆర్ఎస్‌ !

టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్నే బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవంగా చేసేందుకు ఆ పార్టీ శ్రేణులు సిద్ధమయ్యారు. ఎన్నికల హడావుడిలో ఉన్నందున పెద్దగా కార్యక్రమాలేమీ వద్దని పార్టీ కార్యాలయాల్లో జెండా ఎగురవేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు....

మేనిఫెస్టో మోసాలు : ఎలా చనిపోయినా రూ.లక్ష ఇస్తానన్నారే – గుర్తు రాలేదా ?

తెలుగుదేశంపార్టీ హయాంలో చంద్రన్న బీమా అనే పథకం ఉండేది. సహజ మరణం కూడా రూ. 30వేలు, ప్రమాద మరణానికి రూ. 2 లక్షలు ఇచ్చేవారు. వారికి వీరికి అని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close