మైత్రీ నుంచి అడ్వాన్స్ అందుకొన్న‌ హ‌ను

అందాల రాక్ష‌సితో ఎంట్రీ ఇచ్చాడు హ‌ను రాఘ‌వ‌పూడి. ఆ సినిమా బాక్సాఫీసు ద‌గ్గ‌ర స‌రిగా ఆడ‌లేదు కానీ, త‌న‌కంటూ ఓ ఫ్యాన్ బేస్ సంపాదించుకొన్నాడు హ‌ను. కృష్ణ‌గాడి వీర ప్రేమ‌గాథ హిట్ట‌వ్వ‌డంతో అవ‌కాశాలు వ‌చ్చి ప‌డ్డాయి. అయితే `లై`, `ప‌డిప‌డి లేచె మ‌న‌సు` సినిమాల‌తో నిరాశ ప‌రిచాడు. అయితే ఎట్ట‌కేల‌కు `సీతారామం`తో ఓ మంచి విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకొన్నాడు. ఇప్పుడు మ‌ళ్లీ హ‌నుపై న‌మ్మ‌కాలు ఏర్ప‌డ్డాయి. ఈ సినిమా గురించి పాజిటీవ్ బ‌జ్ ఏర్ప‌డ‌గానే, మైత్రీ మూవీస్ హ‌నుకి అడ్వాన్స్ ఇచ్చింది. ఇప్పుడు హ‌ను త‌దుప‌రి సినిమా మైత్రీతోనే. హ‌నుకి కొన్ని ప్లాన్స్ ఉన్నాయి. ఇంత‌కు ముందే బాలీవుడ్ నుంచి ఓ ఆఫ‌ర్ వ‌చ్చింది. అయితే… దానికంటే ముందే మైత్రీ సినిమాని హ‌ను ప‌ట్టాలెక్కించ‌బోతున్న‌ట్టు తెలుస్తోంది. ఈ సినిమా ఓ స్టార్ హీరోతోనే ఉండ‌బోతోంద‌ని స‌మాచారం. హ‌ను ద‌గ్గ‌ర రెండు క‌థ‌లు రెడీగా ఉన్నాయి. సో… హీరో సెట్ అయితే, ఈ సినిమా ప‌ట్టాలెక్కించ‌డం ఏమాత్రం ఆల‌స్యం కాక‌పోవొచ్చు. త్వ‌ర‌లోనే ఈ హ‌ను కొత్త సినిమాకి సంబంధించిన వివ‌రాలు బ‌య‌ట‌కు వ‌స్తాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంతకీ లాయర్లకు ఏపీ ప్రభుత్వం పెట్టిన ఖర్చెంత!?

కింది కోర్టుల, జిల్లా కోర్టులు, సీబీఐ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు ఇలా న్యాయస్థానాలన్నింటిలో ఏపీ ప్రభుత్వ కేసులు వందలు, వేలల్లో ఉంటాయి. కింది స్థాయిలో పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించుకుంటారు. కానీ హైకోర్టు,...

అమెరికాలో ఘోర ప్రమాదం – ముగ్గురు ప్రవాసాంధ్రులు మృతి !

అమెరకాలోని టెక్సాస్‌లో జరిగిన ఘోర ప్రమాదంలో ముగ్గురు ప్రవాసాంధ్రులు చనిపోయారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) బోర్డు డైరెక్టర్ డాక్టర్ కొడాలి నాగేంద్ర శ్రీనివాస్ భార్య యలమంచిలి వాణిశ్రీ, ఆయన ఇద్దరు...

కేసీఆర్ అంచనాల్ని అందుకోలేకపోయిన ప్రశాంత్ కిషోర్ !

ఐ ప్యాక్ అంటే తిరుగులేని పొలిటికల్ స్ట్రాటజీ కంపెనీ. దేశంలో ఉన్న ప్రతీ పార్టీ సేవలు అందుకోవాలని అనుకుంటుంది. ఐ ప్యాక్ కన్నా పీకే పైనే అందరికీ గురి. బెంగాల్ తర్వాత తాను...

సోషల్ మీడియాలోనూ దారి తప్పిన ఏపీ రాజకీయాలు !

తమలపాకుతో నువ్వకొటి అంటే.. తలుపు చెక్కతో నేను రెండు అంటా అన్నట్లుగా ఏపీలో రెండు పార్టీల నేతలూ.. సోషల్ మీడియా కార్యకర్తలు చెలరేగిపోతున్నారు. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే రెండు పార్టీలకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close