కొత్త ట్రెండ్‌: పాత సినిమాకి 4K హంగు

ఎపిక్ సినిమాలంటూ కొన్నుంటాయి. అవి ఎన్నిసార్లు చూసినా త‌నివి తీర‌దు. టీవీలో వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా రేటింగులు అదిరిపోతుంటాయి. చూసిన సినిమానే అయినా – ఏదో ఓ మ్యాజిక్‌. దాన్నే ఇప్పుడు నిర్మాత‌లు కూడా క్యాష్ చేసుకోవాల‌ని చూస్తున్నారు. పాత సినిమాకు కొత్త హంగులు అద్ది – రీరిలీజ్ చేస్తే ఇప్పుడు కాసుల వ‌ర్షం కురుస్తోంది. `పోకిరి` రీ రిలీజ్ అందుకు తాజా ఉదాహ‌ర‌ణ‌.

ఈరోజు తెలుగు రాష్ట్రాల్లోని ప‌లు ప్రాంతాల్లో పోకిరి సినిమాని రీ రిలీజ్ చేస్తున్నారు. 200 థియేట‌ర్ల‌లో ఈ సినిమా విడుదల చేస్తే (సింగిల్ షో)… అన్ని చోట్లా టికెట్ హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఈ థియేట‌ర్ల సంఖ్య అంత‌కంత‌కూ పెంచుకొంటూ పోవాల్సివ‌స్తోంది. ఓర‌కంగా.. ఇది న్యూ ఇండియ‌న్ రికార్డ్‌! పోకిరిని టీవీల్లో ఇప్ప‌టికే కొన్ని వంద‌ల‌సార్లు చూసుంటారు. అయినా ఏమిటో ఈ క్రేజ్‌. పాత సినిమాకి కాస్త‌… 4K హంగులు అద్దారంతే. దానికే మ‌హేష్ ఫ్యాన్స్ టికెట్లు ఎగ‌బ‌డి కొనేసుకొన్నారు. ఇది వ‌ర‌కు కూడా ప‌వ‌న్ క‌ల్యాణ్ పుట్టిన రోజున హైద‌రాబాద్ లో గ‌బ్బ‌ర్ సింగ్‌, తొలి ప్రేమ‌, ఖుషి, జ‌ల్సా… ఇలా నాలుగు షోల్లో నాలుగు సినిమాలు వేస్తే.. థియేట‌ర్ల‌కు కిక్కిరిసిపోయాయి. ఇప్పుడు `పోకిరి` రీ రిలీజ్‌కీ అదే స్ఫూర్తినిచ్చి ఉంటుంది.

అస‌లు ఈ రీ రీలీజ్ అల‌న్నింటికీ కార‌ణం… మాజాబ‌జార్‌. ఆ పాత మ‌ధురం లాంటి మాయాబ‌జార్‌ని క‌ల‌ర్ లో తీసి, రీ రిలీజ్ చేస్తే అనూహ్య‌మైన స్పంద‌న వ‌చ్చింది. ఓ కొత్త సినిమా రిలీజ్ అయితే ఎంత క్రేజ్ వ‌స్తుందో.. క‌ల‌ర్ మాయాబ‌జార్‌కి అంత క్రేజ్ వ‌చ్చింది. దాంతో పాత సినిమాల్ని ఇలా.. రీ మోడ‌ల్ చేసి, రిలీజ్ చేస్తే మంచి ఫ‌లితాలు వ‌స్తాయ‌ని నిర్మాత‌లు ఆ దిశ‌గా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

జ‌నాలు థియేట‌ర్ల‌కు రావ‌డం లేద‌న్న మాట ఈ మ‌ధ్య త‌ర‌చూ వినిపిస్తోంది. అయితే అదంతా ఒట్టిమాటే అనిపిస్తోంది. ఎందుకంటే పాత సినిమాల్ని రీ మోడ‌ల్ చేస్తేనే ఈ స్థాయిలో స్పంద‌న వస్తోందంటే, థియేట‌ర్ల‌న్నీ కిక్కిరిపోతున్నాయంటే, స‌త్తా ఉన్న సినిమా వ‌స్తే.. దాన్ని ఆపేదెవ‌రు? దానికి అడ్డెవ‌రు?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పెదనాన్న మన గుండెల్లో వున్నారు : ప్రభాస్

రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు సంస్మరణ సభ కోసం ఆయన స్వగ్రామమైన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో భారీగా ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రభాస్‌ ఇక్కడకు చేరుకున్నారు. తమ అభిమాన...

లక్ష్మిపార్వతి అంత ధైర్యం కొడాలి నానికి లేదా !?

ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీకి యుగపురుషుడి పేరు తీసేయడంపై మెల్లగా వైసీపీలో ఉన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా ముసుగు తీసేస్తున్నారు. సమర్థిస్తూ ఒకరి తర్వాత ఒకరు మీడియా ముందుకువచ్చి మాట్లాడుతున్నారు. పెద్ద...

మహేష్ బాబు ఇంటిలో చోరికి యత్నం

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట్లో చోరికి ప్రయత్నించాడు ఓ దొంగ. ఓ అగంతకుడు మహేష్ బాబు ఇంటి గోడ దూకి లోపలికి వచ్చాడు. మంగళవారం రాత్రి సమయంలో లో చోరీ ప్రయత్నం...

స్వాతిముత్యం పై త్రివిక్రమ్ స్టాంప్

హారిక హాసిని క్రియేషన్స్, సితార ఎంటర్‏టైన్మెంట్స్ త్రివిక్రమ్ శ్రీనివాస్ హోమ్ బ్యానర్లు. కేవలం త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమాలు చేయడానికే హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ ని కేటాయించారు నిర్మాత చినబాబు. ఇక సితారలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close