ఇద్దరు “లక్ష్మినారాయణు”ల్లో ఎవరు సీఎం అభ్యర్థి..?

సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ భారతీయ జనతా పార్టీలో చేరడం ఖాయంగానే కనిపిస్తోంది. ఈ విషయంపై భారతీయ జనతాపార్టీ హైకమాండ్ ఏపీ నేతలకు ముందస్తు సంకేతాలు పంపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. సాక్షాత్తూ.. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ .. ఈ విషయంలో బయటపడ్డారు. పదవి వచ్చిన సందర్భంగా తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శించుకుని తలనీలాలు ఇచ్చారు. తిరుపతిలో రాజకీయాలు మాట్లాడారు. ఆ సమయంలో కన్నా.. బీజేపీ అధికారంలోకి వచ్చేయబోతుందని ప్రకటించేశారు. 2019లో ఏపీలో.. బీజేపీ ముఖ్యమంత్రి ఉంటారన్నారు. కన్నా లక్ష్మినారాయణ కాన్ఫిడెంట్ గా ఆంధ్రప్రదేశ్ లో తాము అధికారంలోకి వస్తామని చెప్పిన వెంటనే .. జర్నలిస్టులు కూడా.. ముఖ్యమంత్రి మీరా..? సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణనా..? అని అడిగేశారు. దానికి కన్నా లక్ష్మినారాయణ.. ఆ విషయం అమిత్ షా, నరేంద్రమోదీ నిర్ణయిస్తారని ప్రకటించారు. దాంతో ఆశ్చర్యపోవడం విలేకరుల వంతయింది.

నిజానికి సీబీఐ మాజీ జేడీ బీజేపీలోకి వెళ్తానని ఎప్పుడూ ప్రకటించలేదు. కనీసం చర్చలు జరుగుతున్నాయన్న విషయాన్ని కూడా చెప్పలేదు. అలాంటిది.. ఆయన ప్రస్తావన వస్తే… ఖండించాల్సిన కన్నా లక్ష్మినారాయణ అంతా హైకమాండ్ నిర్ణయం అన్నట్లు మాట్లాడటంతో… అంతర్గతంగా… బీజేపీలో సీబీఐ మాజీ జేడీని చేర్చుకునే ప్రక్రియ నడుస్తున్నట్లు తేలిపోయిందంటున్నారు. సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ ప్రస్తుతం జిల్లాల పర్యనటల్లో ఉన్నారు. జిల్లాల్లో ఉన్న సమస్యలను రెండు నెలలలో అధ్యయనం చేస్తానని.. ఆ తర్వాత కార్యాచరణ రూపొందించుకుటానని చెప్పారు. రాజకీయాల్లోకి వస్తానని ఇంత వరకూ నేరుగా ప్రకటించలేదు కానీ.. వ్యవసాయమంత్రిని కావాలన్న ఆకాంక్షను మాత్రం వ్యక్తం చేశారు.

సీబీఐ మాజీ జేడీకి.. ఆరెస్సెస్ తో దగ్గరి సంబంధాలున్నాయన్న ప్రచారం కొంత కాలంగా జరుగుతోంది. ఉద్యోగ విరమణ తర్వాత జరిగిన ఓ ఆరెస్సెస్ కార్యక్రమంలో పాల్గొన్నట్లు… కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ నోటి వెంట… అప్రయత్నంగా వచ్చిన మాటలు.. బీజేపీ ప్లాన్లను బయటపెట్టిందని.. రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. సీబీఐ మాజీ జేడీ వీఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకున్నప్పుడే.. ఆయన బీజేపీలోకి వెళ్తారని అనుకున్నారు. ఎస్కే యూనివర్శిటీ వీసీగా ఉన్న లక్ష్మినారాయణ బంధువు కూడా రాజీనామా చేసి… ఆయనతో పాటే నడుస్తానని ప్రకటించారు. అంతా ఓ పద్దతి ప్రకారమే బీజేపీ… నడిపిస్తోందని.. సీబీఐ మాజీ జేడీ బీజేపీలో చేరడం లాంఛనమేనన్న అభిప్రాయాలు.. కన్నా లక్ష్మినారాయణ మాటలతో తేటతెల్లమయ్యాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close