ఆప్ కా సీఎం చోర్ హై అని ఒడిశాలో క‌న్నాకి ఎవ‌రో చెప్పార‌ట‌..!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఎన్నిక‌లు పూర్త‌వ‌గానే వివిధ రాష్ట్రాల్లో పార్టీ త‌ర‌ఫున ప‌ర్య‌ట‌న‌కు వెళ్లారు ఏపీ భాజ‌పా అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌. దేశంలో ఎక్క‌డికి వెళ్లినా మోడికి అనుకూల ప‌వ‌నాలే ఉన్నాయ‌నీ, చిన్న‌వ్యాపారుల ద‌గ్గ‌ర్నుంచీ అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లూ మ‌రోసారి మోడీని ఈ దేశ ప్ర‌ధానిగా కోరుకుంటున్నార‌ని చెప్పారు. మోడీ మీద ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తిరేక‌త ఉంద‌ని ఏపీలో టీడీపీతోపాటు, ఆ పార్టీకి మ‌ద్ద‌తుగా నిలిచే మీడియా మాత్ర‌మే విష‌ప్ర‌చారం చేస్తోంద‌న్నారు. ఎంత వ్య‌తిరేక ప్ర‌చారం చేసినా, ఏపీలో కూడా మోడీకి అనుకూలంగానే ప్ర‌జ‌లున్నార‌ని క‌న్నా చెప్పడం విశేషం!!!

ఒడిశాలోని కోణార్క్ లో పూస‌ల‌మ్ముకునే ఒక చిరు వ్యాపారి త‌న‌తో మాట్లాడుతూ… ఆప్ కా సీఎం బ‌డా చోర్ హైనా, ఏ చోర్ మోడీకో చోర్ బోల్తా క్యా హై అని క‌న్నాతో అన్నాడ‌‌ట‌! మీ ముఖ్య‌మంత్రే దొంగ‌, ఆయ‌న మోడీని దొంగ అంటారేంటి అని ఆ వ్యాపారి అడిగాడ‌ట‌! ఆ మాట అన‌గానే వెంట‌నే స‌ద‌రు వ్య‌క్తితో మ‌రోసారి మాట్లాడించి ఒక వీడియో తీసుకుంటే స‌రిపోయేది! ప్చ్‌… కానీ క‌న్నా అలా చెయ్య‌లేదెందుకో! మీ ముఖ్య‌మంత్రి దొంగ అని ఎవ‌రైనా అంటే… ఎందుకు అని ప్ర‌శ్నించాలి క‌దా. కార‌ణం తెలుసుకోవాలి క‌దా. ఆ పూస‌ల‌మ్మే వ్యాపారి అలా విమ‌ర్శిస్తే, ఏపీ రాజ‌కీయాల గురించి ఎంత ఆస‌క్తి ఉందో తెలుసుకునే కుతూహ‌లం స‌హ‌జంగానే క‌లగాలి క‌దా! కానీ, క‌న్నా అవేవీ అడ‌గ‌లేద‌ట‌. అయినా, మోడీని ఉద్దేశించి చౌకీదార్ చోర్ అంటున్న‌ది ఎవ‌రూ… రాహుల్ గాంధీ! చంద్ర‌బాబు నాయుడు చేస్తున్న విమ‌ర్శ ఏంటి… ఆంధ్రాకి మోడీ అన్యాయం చేశార‌ని! అలాంట‌ప్పుడు, ఒడిశాలో ఒక చిన్నవ్యాపారి ఇలాంటి విమ‌ర్శ చంద్ర‌బాబు మీద‌ చేశాడ‌ని క‌న్నా చెప్తుంటే ఎలా ఉంటుంది..?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో భాజ‌పా ప‌నితీరుపై క‌న్నా మాట్లాడుతూ… ఐదు పార్ల‌మెంటు స్థానాల్లో గ‌ట్టిపోటీ ఇచ్చామ‌నీ, గెలుపు అవ‌కాశాలున్నాయ‌న్నారు. దాదాపు 25 అసెంబ్లీ నియోజ‌క వ‌ర్గాల్లో ఫ‌లితాలు త‌మ‌కు అనుకూలంగా ఉండే అవ‌కాశం ఉంద‌ని క‌న్నా చెప్పారు. మ‌రి, దేశ‌మంతా మ‌ళ్లీ మోడీ కావాలీ కావాలీ అంటున్న‌ప్పుడు… ఆంధ్రాలో ఇన్ని త‌క్కువ స్థానాలు త‌మ‌కు వ‌స్తాయ‌ని క‌న్నా చెబితే ఎలా..? అంటే, ఆంధ్రాలో భాజ‌పా మీద తీవ్ర వ్య‌తిరేక‌త ఉంద‌ని ఆయ‌నే చెబుతున్నట్టే క‌దా! ఏదేమైనా, ఎక్క‌డో ఒడిశాలో ఒక చిన్న వ్యాపారి ఆప్ కా సీఎం చోర్ హై అని అభిప్రాయ‌ప‌డ్డాడ‌ని క‌న్నా చెబుతుంటే.. అవునా నిజ‌మా, ఆ వ్య‌క్తి ఎవ‌రో చూడాల‌ని అనిపిస్తోంది.! క‌నీసం ఆ వ్య‌క్తి ఫొటో అయినా క‌న్నా తీసి ఉంటే బాగుండేదే..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జనసైనికుల్ని రెచ్చగొట్టేందుకు వైసీపీ దింపుడు కళ్లెం ఆశలు !

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం పూర్తయింది. టీడీపీ, జనసేన మధ్య సీట్ల సర్దుబాటు పూర్తయింది. ఏ సీట్లలో పోటీ చేయాలో కూడా ఓ నిర్ణయానికి వచ్చారు. అయితే పవన్ 24 సీట్లే తీసుకున్నారంటూ.....

విచారణకు రాను – సీబీఐకి కవిత లేఖ

ఢిల్లీ లిక్కర్ స్కాంలో విచారణకు తాను హాజరు కావడం లేదని సీబీఐకి ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద జారీ చేసిన నోటీసులను రద్దు చేయండి...

మళ్లీ ఉద్యోగుల పోరాటం ప్రభుత్వానికి తాకట్టు !

ఎన్నికలకు ముందు ఉద్యోగ నేతలు ఆందోళనలు అంటూ హడావుడి చేశారు. కానీ అదంతా స్క్రిప్టెడ్ అని.. ఏమీ చేయకపోయినా ఏదో ఇచ్చినట్లుగా హడావుడి చేయడానికని మొదటి నుంచి అనుమానాలుననాయి. ఇప్పుడు అదే నిజం...

అభిప్రాయం : జనసేన శ్రేణుల అంతర్మధనం

2024 ఎన్నికల రాజకీయ వేడి రాజకుంది. తెలుగు దేశం పార్టీజనసేన కలిసి ఏర్పాటు చేసుకున్న పొత్తు లో భాగం గా జనసేన 24 ఎమ్మెల్యే సీట్ల లో పోటీ చేస్తుందని చంద్రబాబు -పవన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close