ప్రొ.నాగేశ్వర్ : చనిపోయిన రాజీవ్‌పై నిందలేస్తే మోడీకి ఏం వస్తుంది..?

ప్రధానమంత్రి నరేంద్రమోడీ… ప్రచార వ్యూహాన్ని ఎవరూ ఊహించని రీతిలో వివాదాస్పదంగా మార్చుకుంటున్నారు. ఐదో విడత పోలింగ్‌కు రెండు రోజుల ముందు నుంచి ఆయన రాజీవ్ గాంధీని టార్గెట్ చేసుకున్నారు. రాజీవ్ గాంధీ నెంబర్ అవినీతి పరునిగా చనిపోయారని.. ఎన్నికల ప్రచారసభల్లో ఎగతాళి చేయడం ప్రారంభించారు. దీనిపై రాహుల్ కూడా.. కౌంటర్ ఇచ్చారు. మీ కర్మఫలం ఎదురు చూస్తోందని… ఓటమికి దగ్గరగా ఉన్నారనే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని విమర్శలు చేశారు. అయితే.. మోడీ మాత్రం.. రాజీవ్ గాంధీపై విమర్శలు మాత్రం ఆపడం లేదు.

చనిపోయిన వాళ్లను దేవుళ్లుగా చూడటం భారతీయ సంస్కృతి..!

నరేంద్రమోడీ ప్రస్తుతం… రాజీవ్ గాంధీతో పోరాడుతున్నట్లుగా.. ప్రసంగాలు చేస్తున్నారు. ఆయన పోరాడుతోంది… రాజీవ్ గాంధీ కుమారుడు రాహుల్ గాంధీతో. చనిపోయిన వాళ్లను దేవళ్లలో భాగంగా చూడటం… భారతీయ సంస్కృతిలో భాగంగా. చనిపోయిన వాళ్లు ఎంత చెడ్డవాళ్లయినా… వాటి గురించి మర్చిపోయి.. ఒక్క పాజిటివ్ అంశం అయినా తీసుకుని.. మంచిగా మాట్లాడతాం. ఫోటోలు దేవుడి గదిలో పెడతాం. అంటే… చనిపోయిన వారిని గౌరవించే సంస్కృతి భారతీయులది. అలాంటిది మోడీ .. చనిపోయిన వారి గురించి తీవ్రమైన విమర్శలు ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదు. అలాగే.. రాజీవ్ గాంధీ.. భ్రష్టాచారీ నెంబర్ వన్ గా చనిపోయారని.. ఆరోపించారు. కానీ.. ఆయన తీవ్రవాదుల చేతుల్లో చనిపోయారు. అవినీతి కారణంగా చనిపోలేదు. రాజీవ్ గాంధీ హయాంలో అవినీతి జరిగిందని చెప్పడం వేరు.. ఆయనే నేరుగా అవినీతి నెంబర్ వన్ గా చనిపోయారని.. వ్యక్తిగతంగా విమర్శలు చేయడం వేరు. కానీ.. మోడీ.. ఇప్పుడు.. చనిపోయిన రాజీవ్ గాంధీని వ్యక్తిగతంగా నిందిస్తూ విమర్శలు చేస్తున్నారు.

రాహుల్‌ను నిందించాలంటే రాజీవ్ పై నిందలేయాలా..?

బోఫోర్స్ కుంభకోణం అనేది దశాబ్దాలుగా ఉంది. రాజీవ్ గాంధీ హయాంలో ఇది బయటకు వచ్చిన మాట నిజమే. అప్పట్నుంచి.. ఈ బోఫోర్స్ కుంభకోణం గురించి చర్చ నడుస్తూనే ఉంది. ఈ కుంభకోణం విషయంలో ఇప్పటి వరకూ నేర నిరూపణ జరగకపోయినప్పటికీ.. కచ్చితంగా స్కాం జరిగిందని ప్రజలు నమ్మారు. దానికి తగ్గట్లుగా అప్పట్లో ఎన్నికల ఫలితాలు కూడా వచ్చాయి. అయితే.. ఇందులో రాజీవ్ గాంధీకి సంబంధం ఉందని.. ఎక్కడా తేలలేదు. అందుకే భోఫోర్స్ కుంభణంపై విమర్శలు చేయవచ్చు. రాజీవ్ గాంధీ హయాంలో అవినీతి జరిగిందని చెప్పవచ్చు. కానీ… చనిపోయిన రాజీవ్ గాంధీని భ్రష్టాచారీ నెంబర్ వన్ అటూ.. దుర్భాషల్లాంటి విమర్శలు చేస్తున్నారు. రాహుల్ తండ్రి అంటూ సంబోధిస్తున్నారు. చనిపోయిన రాహుల్ తండ్రితో.. ఇప్పుడు మోడీకి సంబంధం ఏముంది..?. రాజీవ్ హయాంలో అవినీతి గురించి మాట్లాడొచ్చు… కాంగ్రెస్ పార్టీ అవినీతి పార్టీ అనొచ్చు..కానీ మోడీ అలా చేయడం లేదు. చాలా కుంభకోణాలను గుర్తు చేసి విమర్శలు చేయవచ్చు కానీ.. చనిపోయిన వ్యక్తిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు..? పోటీలో లేని.. అసలు భూమిపై లేని వ్యక్తిపై అలాంటి విమర్శలు చేస్తున్నారు మోడీ. ప్రధానమంత్రి స్థాయి విమర్శలు కాదు అవి.

బోఫోర్స్ నిరూపించలేకపోయారు..! రాఫెల్ గురించి ఎందుకు మాట్లాడరు..?

రాజీవ్ గాంధీ గురించి అభ్యంతరక వ్యాఖ్యలు చేయడాన్ని… విపక్ష పార్టీల నేతలందరూ ఖండించారు. రాహుల్‌తో పాటు ప్రియాంక కూడా ఖండించారు. ఇప్పుడీ విషయం ప్రజల్లోకి కూడా చర్చకు వెళ్తోంది. రూ. 64 కోట్ల రూపాయల బోఫోర్స్ కుంభకోణం గురించి.. మోడీ మాట్లాడుతున్నారు కానీ… రూ. 30 వేల కోట్ల విలువైన రాఫెల్ కుంభకోణం గురించి మాట్లాడటం లేదని.. ప్రజల్లో చర్చ ప్రారంభమయింది. బోఫోర్స్ గురించి మాట్లాడుతున్న మోడీ… ఇంత వరకూ రాఫెల్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. భోఫోర్స్ స్కాం పేరుతో… ఇంత వరకూ.. ఒక్క చార్జిషీట్ కూడా దాఖలు కాలేదు. రాజీవ్ గాంధీపై ఆరోపణలే కానీ కనీసం… ఒక్క ఆరోపణను కూడా ముందుకు తీసుకెళ్లలేకపోయారు. అసలు చనిపోయిన వ్యక్తుల గురించి మాట్లాడి రాజకీయం మాట్లాడటం అరుదు. మాట్లాడినా… ఆయన చనిపోవడం గురించి.. ఇతరుల గురించి కాదు.. ఆయన కుమారుడు రాహుల్ గాంధీ అవడం వల్ల విమర్శలు చేయకూడదు. కానీ మోడీ ఇప్పుడు అదే చేస్తున్నారు. ఆయన రాజకీయ ప్రయోజనాల కోసం.. ప్రధానమంత్రి స్థాయి కన్నా తక్కువగా విమర్శలు చేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.